Monday, January 31, 2022

వేల కోట్ల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం..! మామూళ్ల మ‌త్తులో జీహెచ్ఎంసీ అధికారులు..!

వేల కోట్ల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం..! మామూళ్ల మ‌త్తులో జీహెచ్ఎంసీ అధికారులు..!
 https://www.dishadaily.com/some-individuals-built-buildings-illegally-on-government-land#.YfjP6a6g6dl.whatsapp

----------------------------------------------------------------

నా పైనే వార్త రాస్తావా ?

తొక్కిస్తా అంటూ భూతు పురాణం మొదలు పెట్టిన ఆ తహసీల్దార్ ఎవరో మీరే చదవండి , 

వేల కోట్ల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం..! మామూళ్ల మ‌త్తులో జీహెచ్ఎంసీ అధికారులు..! https://t.co/Eldw67w9qZ
------------------------------------------------------------------

రెవిన్యూ అధికారులు, @GHMCOnline అధికారులు అవినీతి వాళ్ళ వందల ఎకరాల ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురై అక్రమ నిర్మానాలు వెలుస్తున్నాయి.... దీని పై వార్తలు రాస్తే ఇలా బెదిరింపులు వస్తున్నాయి... మున్సిపల్, రెవిన్యూ అధికారులు అవినీతి మత్తు కారణంగా రానున్న రోజుల్లో గజం భూమి కూడా మిగలదు https://t.co/bRPR7UwPKD
-------------------------------------------------------------------

తెలంగాణ రెవిన్యూ సంఘాల ప్రతినిధులు ఇప్పుడు స్పందించండి....

మీ అధికారుల అక్రమాలకు బాధితులు అయిన వారు రెవిన్యూ అధికారుల మీద దాడులు చేస్తే వెంటనే స్పందించే ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఇప్పుడు స్పందించండి మీ విశ్వసనీయత తెలుస్తుంది.... Bplkm
https://t.co/ksG3Cp49IY https://t.co/sDNuXZCYkP

మెగా’ కరెప్షన్.. ఆకునూరి సంచలనం

మెగా’ కరెప్షన్.. ఆకునూరి సంచలనం

– రజిత్ కుమార్ తన నిజాయితీ నిరూపించు కోవాలి

– ప్రభుత్వం విచారణ కమిటీ వేయాలి
– మేఘా సంస్థ విచారణ కమిటీని ప్రభావితం చేయొచ్చు
– మంత్రుల కాళ్లు మొక్కితే అధికారులకు ప్రమోషన్స్
– దోచుకోవడానికే కాళేశ్వరం ప్రాజెక్టు
– విద్యా, ఆరోగ్యంపై కేటాయిస్తే దోచుకోలేరు..
-తొలివెలుగుతో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళీ

ఐఏఎస్ అధికారి రజిత్ కుమార్తె పెళ్లి అంశం తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తోంది. ఈ వివాహ ఖర్చులకు మేఘా ఇంజనీరింగ్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ డబ్బులు సమకూర్చిందనే వార్తలు విపక్షాలకు ఆయుధంగా మారింది. తాజాగా ఈ అంశంపై రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తొలివెలుగుతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన ఈ అంశంపై మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.

రజిత్ కుమార్ తన నిజాయితీని నిరూపించుకోవాలని ఆకనూరి అన్నారు. ప్రభుత్వం ఈ విషయంపై ఇంత వరకూ స్పందించకపోవడం పలు అనుమానాలకు దారి తీస్తోందని చెప్పారు. ఒక రిటైర్డ్ జడ్జీతో ప్రభుత్వం ఓ కమిటీ వేసి నిజాలు నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ప్రభుత్వం విచారణకు ఆదేశించినా.. మేఘా కృష్ణారెడ్డి కమిటీని ప్రభావితం చేసే అవకాశం కూడా లేకపోలేదని అనుమానించారు.

తెలంగాణలో రాజకీయ నాయకులు, ఐఏఎస్ అధికారులు కలిసి నాకింత, నీకింత అంటూ అవినీతి సొమ్ము పంచుకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. పెద్ద ఎత్తున అవినీతి చేస్తూ తెలంగాణ ప్రజల కష్టాన్ని హవాలా రూపంలో దేశం నుంచి తరలించేస్తున్నారని అన్నారు. కుల ప్రాతిపదికన అధికారులకు పదోన్నతలు ఇస్తున్నారని ఆయన ఆరోపించారు. అవినీతి అధికారులను అందలం ఎక్కిస్తున్నారని మండిపడ్డారు. మంత్రులకు కాళ్లు మొక్కితే ప్రమోషన్స్ వస్తాయనే అభిప్రాయం ఐఏఎస్ అధికారుల్లో ఏర్పడిందని ఆకునూరి మురళీ అన్నారు.

తెలంగాణ ఏర్పడి ఏడేళ్లు అవుతున్నా.. ఇంత వరకు ఒక్క ఐఏఎస్ అధికారి కూడా సస్పెండ్ కాలేదంటే.. రాజకీయ నాయకులు, అధికారులు కమ్ముక్కై అవినీతి చేస్తున్నారనేది స్పష్టంగా తెలుస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. తెలంగాణలో పని చేస్తున్న ఓ ఐఏఎస్ అధికారికి స్విస్ బ్యాంక్ లో అకౌంట్ కూడా ఉందని ఇటీవల తనకు తెలిసిందని చెప్పారు. లక్షన్నర కోట్ల రెవెన్యూ ఉన్న తెలంగాణలో కొన్ని గ్రామాలకు కనీస సౌకర్యాలు కూడా లేకపోవడానికి కారణం పేట్రేగిపోతున్న అవినీతి అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణ ప్రభుత్వానికి నాలుగు లక్షల కోట్లు అప్పు ఉందని ఆయన వివరించారు. దీనిలో రెండు లక్షల కోట్లు ఇరిగేషన్ ప్రాజెక్టులకే కేటాయించారని అన్నారు. ఇలాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేపడితే.. పెద్ద అవినీతి చేసుకోవచ్చనేది ప్రభుత్వ ఆలోచన అని ఆయన ఆరోపించారు. విద్యా, ఆరోగ్యం, మౌలికవసతుల కల్పనపై ఎక్కువ కేటాయింపులు పెడితే దోచుకోవడానికి అవకాశం ఉండదు కనుక లక్షల కోట్లతో ప్రాజెక్టులు నిర్మిస్తున్నారని తొలివెలుగుతో ఆకునూరి మురళీ చెప్పారు.


“మెగా” రిగ్గింగ్.. ఖజానాకు డ్రిల్లింగ్! ఇటలీ కంపెనీ పేరుతో.. “కృష్ణ” మాయ!

డ్రగ్స్ దందా పాల్పడే వారిపై ఇక చెడుగుడే..... సైబరాబాద్ పోలీసుల స్టాంగ్ వార్నింగ్.....!

*డ్రగ్స్ దందా పాల్పడే వారిపై ఇక చెడుగుడే..... సైబరాబాద్ పోలీసుల స్టాంగ్ వార్నింగ్.....!*

తెలంగాణ రాష్ట్రంలో విచ్చలవిడిగా బయటపడుతున్న మాధకద్రవ్యాల ఘటనలపై పోలీసులు ఉక్కుపాదం మొపుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో డ్రగ్స్ దందాపై ఆందోళన వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్..ఇకపై రాష్ట్రంలో డ్రగ్స్ అనే మాటే వినిపించకూడదంటూ పోలీసులకు ఆదేశాలు జారీచేశారు. ఈక్రమంలో డ్రగ్స్ దందాను కూకటివేళ్లతో సహా ఏరిపారేసేందుకు పోలీసులు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. తెలంగాణ రాష్ట్రం సహా హైదరాబాద్ జంటనగరాల్లో డ్రగ్స్ దందాపై తీసుకుంటున్న చర్యల గురించి సైబరాబాద్ *డీసీపీ (క్రైమ్స్) కలమేశ్వర్* వివరించారుఈసందర్భంగా డీసీపీ కలమేశ్వర్ సోమవారం ప్రత్యేకంగామాట్లాడుతూ.. మాదకద్రవ్యాల నియంత్రణ కోసం ఇప్పటికే సైబరాబాద్ పరిధిలో తగిన చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. డ్రగ్స్ కొనుగోలు, అమ్మకం చేస్తున్న వారిపై ప్రత్యేక నిఘావుంచి వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అందుకోసం సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నార్కోటిక్స్ సెల్ ఏర్పాటు చేసి.. ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు డీసీపీ కలమేశ్వర్ పేర్కొన్నారు. జంట నగరాల పరిధిలోని పబ్స్, రిసార్టులపై ప్రత్యేక నిఘా ఉంచారు పోలీసులు.
ముఖ్యంగా గ్రామాల్లో పంటపొలాల మాటున గంజాయి పండిస్తున్న వారిపై నిఘా ఉంచి.. గంజాయి మూలాల నిర్ములనకు అక్కడి పంచాయతీ అధికారులతో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టు డీసీపీ కలమేశ్వర్ తెలిపారు. డ్రగ్స్ / గాంజాయి సరఫరా చేస్తున్న వారు, ఎవరెవరు ఉన్నారు? ఎక్కడికి తరలిస్తున్నారు? వంటి వివరాల ఆధారంగా ఆయా ప్రదేశానికి ప్రత్యేక బృందాలను పంపించి పూర్తి స్థాయిలో నిర్ములించే దిశగా చర్యలు తీసుకున్నట్టు డీసీపీ వివరించారు.
మాదక ద్రవ్యాలకు యువత బానిసలు కావడంపట్ల ఆందోళన వ్యక్తం చేసిన కలమేశ్వర్.. యువతకి ప్రత్యేక కౌన్సిలింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కళాశాలలు, విద్యా సంస్థల యాజమాన్యాలతో సమావేశాలు ఏర్పాటు చేసి.. డ్రగ్స్ నియంత్రణపై సూచనలు చేశారు. ఇతర దేశాల నుండి సరఫరా అయ్యే డ్రగ్స్ పై నజర్ పెంచామన్న డీసీపీ కలమేశ్వర్.. డ్రగ్స్/గాంజాయి సరఫరాలపై ఎవరివద్దనైనా సమాచారం ఉంటే “డయల్ 100” ద్వారా పోలీసులకు తెలియజేయాలని సూచించారు.

*link Media ప్రజల పక్షం🖋️*
prajasankalpam1.blogspot.com

Sunday, January 30, 2022

ఐఏఎస్ లు ఉంది ప్రజాసేవకా? నాయకులకు ఊడిగం చేయడానికా?

ఐఏఎస్ లు ఉంది ప్రజాసేవకా? నాయకులకు ఊడిగం చేయడానికా?

తెలంగాణలో జరుగుతున్న అవినీతిపై ఉద్యమకారులు, మేధావుల్లో చర్చ జరుగుతోంది. ఉద్యోగులు, రాజకీయ నాయకులు, బడా వ్యాపారవేత్తలు మొత్తం కుమ్మకై ప్రజల సొమ్ము దొచుకుంటున్నారని అనుమానాలను వారు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల రజత్ కుమార్ కుమార్తె పెళ్లి బిల్లుల వ్యవహారమే అందుకు నిదర్శనమని చెబుతున్నారు. మరీ ముఖ్యంగా బడా వ్యాపారవేత్త మేఘా కృష్ణారెడ్డి ఆస్తుల చిట్టా చుట్టూ అనేక సందేహాలను తెరపైకి తెస్తున్నారు.

తాజాగా బయటపడిన 70వేల కోట్ల మేఘా దోపిడీపై ఉద్యమకారులు మండిపడుతున్నారు. జూపల్లి రామేశ్వరరావు, మెగా కృష్ణారెడ్డి లాంటి బడా వ్యాపారులు తెలంగాణను దోచుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. వారి అవినీతిపై ఎవరైనా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే.. కోర్టులను కూడా మేనేజ్ చేస్తున్నారని అంటున్నారు. ఆ మధ్య పంపకాల్లో ప్రభుత్వానికి మేఘా సంస్థకు అభిప్రాయ బేధాలు వచ్చాయేమో కానీ.. ఆ సంస్థపై ఈడీ, ఐటీ దాడులు జరిగాయని.. కాకపోతే లోపాయికారి ఒప్పందం తర్వాత వాటాలు పంచుకున్నారని చెబుతున్నారు.


ఈ అవినీతిపరులకు ప్రభుత్వ అధికారులు గ్రీన్ కార్పెట్ వేస్తున్నారని మండిపడుతున్నారు ఉద్యమకారులు. ఐఏఎస్ అధికారుల్లో 80శాతం మంది బ్రోకర్లులా తయారయ్యారని అంటున్నారు. రజత్ కుమార్ కూడా ఈ కోవకు చెందిన వారేనని ఆరోపిస్తున్నారు. అందుకే మేఘా సంస్థ ఆయన కుమార్తె పెళ్లి ఖర్చులకు బిల్లులు చెల్లించిందని అంటున్నారు. గత ఎన్నికల్లో కూడా రజత్ కుమార్ టీఆర్ఎస్ కు అనుకూలంగా వ్యవహరించి 23 లక్షల ఓట్లు తొలగించారని ఆరోపిస్తున్నారు.
కింది స్థాయి ఉద్యోగులు 10 వేలు లంచం తీసుకున్నా పట్టుబడతారు కానీ.. ఐఏఎస్ లాంటి ఉన్నతస్థాయి అధికారులు వేల కోట్ల అవినీతి చేసినా, బడా వ్యాపారులు కోట్లు దోచేస్తున్నా దొరకకుండా సిస్టమ్ ని మేనేజ్ చేస్తున్నారని మండిపడుతున్నారు ఉద్యమకారులు. ప్రమోషన్ల కోసం అధికారులు రాజకీయ నాయకులకు, వ్యాపారులకు ఊడిగం చేస్తున్నారని విమర్శిస్తున్నారు. తెలంగాణ వచ్చిన తరువాత ఓ కలెక్టర్.. మహిళా రాజకీయ నాయకురాలి కాళ్ల దగ్గర కూర్చున్నాడని గుర్తు చేస్తున్నారు.

Saturday, January 29, 2022

సంజయ్ వ్యవహారంలో పోలీసుల చర్యలు సమర్థనీయమే..!

సంజయ్ వ్యవహారంలో పోలీసుల చర్యలు సమర్థనీయమే..!

జాగరణ దీక్ష చేసిన బండి సంజయ్ పై పోలీసులు వ్యవహరించిన తీరుని సీపీ సత్యనారాయణ సమర్థించుకున్నారు. సంజయ్ విషయంలో తాము చట్టబద్దంగా వ్యవహరించామని అన్నారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ చేసిన జాగరణ దీక్ష ఉద్రిక్తతకు దారి తీసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం లోక్ సభ స్పీకర్ వరకు వెళ్లింది. ఫిబ్రవరి 3న లోక్ సభ ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరు కావాలని నోటీసులు అందాయని సీపీ సత్యనారాయణ తెలిపారు.

బండి సంజయ్ విషయంతో తాము చట్టబద్ధంగానే వ్యవహరించామని ఆయన అన్నారు. తనతో పాటు కరీంనగర్ ఏసీపీ తుల శ్రీనివాస్ రావు, సీఐ లక్ష్మీబాబు, జగిత్యాల డీసీపీలకు నోటీసులు అందాయని చెప్పారు. రాష్ట్రంలో చాలా మంది ధర్నాలు, నిరసనలు చేస్తున్నారని.. కాకపోతే వారంతా కరోనా నిబంధనలు పాటిస్తున్నారని వివరించారు. కానీ.. బండి సంజయ్ కోవిడ్ నిబంధనలు అతిక్రమించారని.. దీంతో అతని పై చర్యలు తీసుకోవలసి వచ్చిందని అన్నారు.

కాగా.. ప్రభుత్వం విడుదల చేసిన జీవో 317ను సవరించాలని డిమాండ్‌ చేస్తూ బండి సంజయ్‌ కరీంనగర్‌లో చేపట్టిన జాగరణ దీక్ష చేశారు. ఆయన చేస్తున్న దీక్ష కరోనా వ్యాప్తికి కారణం అవుతోందని పోలీసులు భగ్నం చేశారు. ఆ నేపథ్యంలో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. తరువాత పోలీసులు సంజయ్ ని ఆరెస్ట్ చేశారు.
అయితే.. ఈ వ్యవహారంపై బండి.. పోలీసులు తనపై దౌర్జన్యం చేశారని లోక్ సభ స్పీకర్ కి ఫిర్యాదు చేశారు. సంజయ్‌ ఫిర్యాదును ప్రివిలేజ్‌ కమిటీకి స్పీకర్‌ ఓం బిర్లా పంపారు. ఈ వ్యవహారంపై వివరాలు సమర్పించాలని ప్రివిలేజ్‌ కమిటీ కేంద్ర హోంశాఖ కార్యదర్శికి సూచించింది. దీంతో.. కరీంనగర్ పోలీసుల అధికారులకు ప్రివిలేజ్ కమిటీ నోటీసులు జారీ చేసింది.

దీపావళి సామాను తయారు చేసే వారి జీవితం ఇంత దారుణమా…?

దీపావళి సామాను తయారు చేసే వారి జీవితం ఇంత దారుణమా…? శివకాశీలోనే క్రాకర్స్ ఎందుకు తయారు చేస్తారు…?

దీపావళి రోజు బాంబులు అదే క్రాకర్స్ కాల్చడం అనేది మనకు చాలా సరదాగా ఉంటుంది. డబ్బులు పోసి కొనుక్కుని అగ్గి పుల్ల గీయడం ఎంతో సరదాగా ఉంటుంది. ఒక్క దీపావళికే కాదు… రాజకీయ నాయకుల ర్యాలీలకు, విజయోత్సవ కార్యక్రమాలకు, పుట్టిన రోజు వేడుకలకు, నూతన ఏడాదికి ఇలా ఏదోక రూపంలో కాలుస్తూనే ఉంటారు.

కాలుష్యం పెరిగేది పెరుగుతుంది, గీసే అగ్గి పుల్లలు ఏదోక కారణంతో గీస్తూ ఉంటాం. సరే గాని శివకాశీలోనే ఆ సామాగ్రి ఎందుకు తయారు చేస్తారు అనేది చాలా మందికి క్లారిటీ లేదు కదా…? దానికి పెద్ద కారణమే ఉందండీ. ఆ కారణం ఏంటో ఒక్కసారి చూద్దాం.


శివకాశీలోని విరుదునగర్, కోవిల్పట్టి ప్రాంతాల్లో అవి తయారు చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఆ ప్రాంతంలో ఏ పంట పండినా సరే దాదాపుగా వర్షాధారమే. మన రాయలసీమ మాదిరిగా ఉంటుంది. ఎక్కడ చూసినా సరే ఎండిన పొలాలు మాత్రమే ఉంటాయి. ఇక అక్కడి ప్రజలకు వ్యవసాయం వలన ఏ విధమైన ఉపయోగం లేదు. ఇక అక్కడి ప్రాంతం కూడా టపాకాయలు తయారు చేయడానికి అనువుగా ఉంటుంది.

ఎండ ఎక్కువగా ఉండటంతో సామాగ్రిని ఎండబెట్టడం కూడా సులువు. వర్షాలు చాలా తక్కువగా పడుతూ ఉంటాయి. ఇక అక్కడి కంపెనీలలో పని చేసే వారికి ఎక్కువగా ఏదోక రోగాలు వస్తూనే ఉంటాయి. ఊపిరితిత్తుల వ్యాధి లేదా క్షయవ్యాధితో చాలా మంది ప్రజలు బాధపడుతూ ఉంటారు. పేదరికం కారణంగా చాలా మంది అక్కడ పని చేయడానికి వెళ్తారు.

మన దగ్గరకు ఇతర ప్రాంతాల నుంచి వలస వస్తారు కదా…? ఆ విధంగా అన్నట్టు. ఏదైనా పొరపాటు జరిగితే అంతే సంగతులు. అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో పుట్టి పెరిగితే అక్కడ పని చేయడానికి ఎవరూ ఇష్టపడరు. ఇక అక్కడ వాళ్ళను చూస్తే మనకు క్రాకర్స్ కాల్చే సంతోషంగా కూడా ఉండదు. అంత దుర్భరమైన జీవితాలు అనుభవిస్తారు.