*ప్రెస్ నోట్*
*ఆక్స్‌ఫర్డ్ ఇంటర్నేషనల్ స్కూల్‌పై విచారణకు జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ NCPCR ఆదేశాలు – చర్యల నివేదిక కోరుతూ మరోసారి రిమైండర్*
*NCPCR File No.: TL-99828/NCPCR/2026-27/EDU*
బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, సెప్టెంబర్ 09:
మెద్చల్–మల్కాజిగిరి జిల్లాలోని ఆక్స్‌ఫర్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ వ్యవహారంపై జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (NCPCR) విచారణకు ఆదేశించింది.సామాజిక కార్యకర్త మరియు Know Your Rights Society అధ్యక్షుడు ఎస్. ఉమేష్ కుమార్ 07.07.2026న NCPCRకు సమర్పించిన ఫిర్యాదులో, సంబంధిత నిబంధనల ప్రకారం పాఠశాలలో విద్యాహక్కు చట్టం, 2009లోని సెక్షన్ 12(1)(c) అమలు, ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు (EWS) మరియు సామాజికంగా వెనుకబడిన వర్గాలు (DG) చెందిన పిల్లలకు 25 శాతం ప్రవేశాల నిబంధన అమలవుతోందా అనే అంశంపై విచారణ జరిపించాలని కోరారు.
ఈ ఫిర్యాదును పరిశీలించిన జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (NCPCR), 24.08.2026న మెద్చల్–మల్కాజిగిరి జిల్లా మేజిస్ట్రేట్‌కు లేఖ పంపి, ఫిర్యాదులో పేర్కొన్న అంశాలపై విచారణ జరిపి Action Taken Report (ATR) ను 7 రోజుల్లో కమిషన్‌కు సమర్పించాలని ఆదేశించింది.అయితే, నిర్ణీత సమయంలో చర్యల నివేదిక అందకపోవడంతో NCPCR 09.09.2026న Reminder-1 జారీ చేసింది. ఈ రిమైండర్‌లో, గతంలో పంపిన లేఖను ప్రస్తావిస్తూ, ఆక్స్‌ఫర్డ్ ఇంటర్నేషనల్ స్కూల్‌కు సంబంధించిన అంశంపై విచారణ జరిపి, 7 రోజుల్లో అవసరమైన నివేదికను సమర్పించాలని జిల్లా మేజిస్ట్రేట్‌ను మరోసారి ఆదేశించింది.NCPCR తన లేఖలో, బాలల హక్కుల పరిరక్షణకు సంబంధించిన చట్టాల అమలును పర్యవేక్షించడం తమ చట్టబద్ధ బాధ్యత అని స్పష్టం చేసింది. ముఖ్యంగా RTE Act, 2009, POCSO Act, 2012 మరియు Juvenile Justice Act, 2015 వంటి చట్టాల సమర్థవంతమైన అమలుపై కమిషన్ పర్యవేక్షణ బాధ్యత కలిగి ఉందని పేర్కొంది.
“పిల్లల విద్యాహక్కు అమలుపై పూర్తి స్థాయి విచారణ జరగాలి”.
ఈ సందర్భంగా ఎస్. ఉమేష్ కుమార్ మాట్లాడుతూ:
“విద్యాహక్కు చట్టం ద్వారా పేద మరియు వెనుకబడిన వర్గాల పిల్లలకు కల్పించిన హక్కులు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా వాస్తవంగా అమలయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. NCPCR స్వయంగా విచారణకు ఆదేశించి, ఇప్పుడు చర్యల నివేదిక సమర్పించకపోవడంతో రిమైండర్ జారీ చేయడం ఈ అంశం ప్రాధాన్యతను తెలియజేస్తోంది. జిల్లా యంత్రాంగం నిష్పక్షపాతంగా విచారణ జరిపి, వాస్తవాలను ప్రజలకు మరియు కమిషన్‌కు స్పష్టంగా తెలియజేయాలి.”
అలాగే, పాఠశాలలలో RTE నిబంధనలు, EWS/DG పిల్లలకు అందాల్సిన ప్రవేశ హక్కులు మరియు ఇతర బాలల హక్కులు సమర్థవంతంగా అమలయ్యేలా సంబంధిత అధికారులు పర్యవేక్షణ పెంచాలని ఆయన కోరారు.
No comments:
Post a Comment