*తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఫెయిల్, రేవంత్ రెడ్డి పరిపాలన చాతగాని ముఖ్యమంత్రి - ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ మిస్ హేమా సుదర్శన్ జిల్లోజు*
బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, సెప్టెంబర్ 25:
ఆదిలాబాద్ రాజీవ్ గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఘటనపై ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ మిస్ హేమా సుదర్శన్ జిల్లోజు ప్రధాన డిమాండ్లు.
*(1)*: RIMS అగ్ని ప్రమాదంపై సమగ్ర, స్వతంత్ర విచారణ వెంటనే జరిపించాలి.
*(2)*: ఎంతమంది శిశువులు మృతి చెందారు, ఎంతమంది గాయపడ్డారు, ఎంతమంది రక్షించబడ్డారు అనే పూర్తి వివరాలను ప్రభుత్వం వెంటనే వెల్లడించాలి.
*(3)*: నిర్లక్ష్యానికి బాధ్యులైన అధికారులను గుర్తించి, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.
*(4)*: దాదాపు ఏడాది క్రితమే సిద్ధమైన 22 పడకల కొత్త SNCU ఎందుకు వినియోగంలోకి రాలేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలి.
*(5)*: తెలంగాణలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో తక్షణమే ఫైర్ సేఫ్టీ, విద్యుత్, AC, ఆక్సిజన్ మరియు ఎమర్జెన్సీ వ్యవస్థలపై ప్రత్యేక ఆడిట్ నిర్వహించాలి.
*(6)*: మృతి చెందిన నవజాత శిశువుల కుటుంబాలకు తగిన పరిహారం, పూర్తి ప్రభుత్వ సహాయం అందించాలి.
*(7)*: ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ రిమ్స్ RIMS ఘటనపై పూర్తి వివరాలతో ప్రజలకు సమాధానం చెప్పాలి.
నవజాత శిశువుల ప్రాణాలకు కూడా భద్రత కల్పించలేని పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇది కేవలం రిమ్స్ RIMS సమస్య కాదు - తెలంగాణ ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థపై ఉన్న తీవ్రమైన ప్రశ్న. ప్రజల ప్రాణాలతో రాజీ పడే పరిస్థితిని ఆప్ సహించదు. మీ పార్టీ ఎమ్మెల్సీ విజయశాంతి గారు కూడా లక్షల లక్షలు దోచుకుంటున్నారు గవర్నమెంట్ హాస్పటల్ సదుపాయం బాగాలేదు అని ప్రశ్నించడం జరిగింది. మరి దామోదర్ రాజా నరసింహ గారు వైద్యశాఖ మంత్రిగా ఉండి మీరు ఏం చేస్తున్నారు అని చెప్పేసి ఆప్ ప్రశ్నిస్తుంది అని అన్నారు.
No comments:
Post a Comment