*మాజీ మేయర్ కొరివి కృష్ణ స్వామి ముదిరాజ్ కాంస్య విగ్రహాన్ని అంబర్ పేట లో ఏర్పాటు చేయాలి*
*కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ లకు వినతి పత్రాలను సమర్పించిన ముదిరాజ్ సంఘం నేతలు*
బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, సెప్టెంబర్ 19:
స్వాతంత్ర సమరయోధుడు, మాజీ మేయర్ స్వర్గీయ కొరివి కృష్ణ స్వామి ముదిరాజ్ కాంస్య విగ్రహాన్ని అంబర్ పేటలో ఏర్పాటు చేయాలని ముదిరాజ్ సంఘం నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు అంబర్ పేట ముదిరాజ్ సంఘం ప్రతినిధులు శనివారం కేంద్రమంత్రి గంగాపురం కిషన్ రెడ్డి, శాసనసభ్యులు కాలేరు వెంకటేష్ లను కలిసి వినతి పత్రాలను సమర్పించారు. స్వాతంత్ర పోరాటంలో కృష్ణ స్వామి ముదిరాజ్ కీలకపాత్ర పోషించారని, అదేవిధంగా హైదరాబాద్ నగర మొట్టమొదటి మేయర్ గా నగర అభివృద్ధికి, పేద ప్రజల సంక్షేమానికి ఆయన ఎంతో కృషి చేశారని వారు పేర్కొన్నారు. జర్నలిస్టుగా పత్రికా రంగంలో ఆయన ఎనలేని సేవలందించారని,ఎన్నో పుస్తకాలను ఆయన రచించారని వారు గుర్తు చేశారు. ఆ మహనీయుడి విగ్రహాన్ని అంబర్ పేట చే నెంబర్ చౌరస్తా, శ్రీ రమణ చౌరస్తా, అలీ కేఫ్ చౌరస్తా మూడు ప్రాంతాల్లో ఎక్కడైనా ఏర్పాటు చేయగలరని వారు కేంద్ర మంత్రి, ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు సతీష్ ముదిరాజ్, చింతల శ్రీనివాస్ ముదిరాజ్, చింతల శ్రీనివాస్ ముదిరాజ్,గిరవేణి మహేష్ ముదిరాజ్, తవిటి వెంకటేష్ ముదిరాజ్ , కృష్ణంరాజు ముదిరాజ్, వి.లక్ష్మి ముదిరాజ్,డి.భరత్ ముదిరాజ్,శాతం సూరి ముదిరాజ్,డొప్ప అంజయ్య, ఎన్.మహేష్
గోవింద్ మురళి, గోవింద్ అర్జున్, మోర బోజీ ముదిరాజ్, మోర నాగులు, జిట్టా కృష్ణ, తూర్పు దీక్షిత్ ముదిరాజ్ లు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment