*బతుకమ్మ యంగ్ ఫిలిం మేకర్స్ ఛాలెంజ్‌కు మంచి స్పందన*
*ఔత్సాహిక ఫిలిం మేకర్స్ విజ్ఞప్తి మేరకు అక్టోబర్ 2 వరకు గడువు పొడిగింపు-సమీక్షా సమావేశంలో నిర్ణయం*
బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, సెప్టెంబర్ 22:
బతుకమ్మ యంగ్ ఫిలిం మేకర్స్ ఛాలెంజ్‌కు విశేష స్పందన లభిస్తోంది. ఈ నేపథ్యంలో ఔత్సాహిక ఫిలిం మేకర్స్ విజ్ఞప్తి మేరకు పోటీలో పాల్గొనే గడువును అక్టోబర్ 2 వరకు పొడిగించారు. సోమవారం ఎఫ్‌డీసీ కార్యాలయంలో తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు, ఎఫ్‌డీసీ మేనేజింగ్ డైరెక్టర్ ఎం. ముకుంద రెడ్డి, ప్రభుత్వ క్రియేటివ్ డైరెక్టర్ కొండా రాజు, జ్యూరీ కమిటీ చైర్మన్ హరీష్ శంకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.యువతలోని సృజనాత్మక ప్రతిభను ప్రోత్సహించడంతో పాటు, ఔత్సాహిక ఫిలిం మేకర్స్‌కు తమ ప్రతిభను చాటుకునేందుకు మరింత అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో గడువును పొడిగించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్‌పర్సన్ వెన్నెల గద్దర్, ఎఫ్‌డీసీ ఈడి. కిషోర్ బాబు, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, విమలక్క, కాసర్ల శ్యామ్, పొన్నం రవిచంద్ర, అనిల్ జీలా తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment