*పత్రికా ప్రకటన*
*తపస్ ఆధ్వర్యంలో ఘనంగా జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుకు సన్మానం*
*మరికల్ గ్రామ ఉపాధ్యాయులు కమ్మరి పాండురంగయ్య చారి మరియు సమాజ సేవకులు కాసోజు దివ్య ప్రభాకర చారికి సన్మానం*
బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, సెప్టెంబర్ 20:
వికారాబాద్ జిల్లా కేంద్రంలో విద్యా రంగంలో విశిష్ట సేవలు అందించిన ఉపాధ్యాయులను గుర్తించి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో "గురువందనం " కార్యక్రమం నిర్వహించారు.జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా చౌడపూర్ మండలం మరికల్ ఉన్నత పాఠశాల లో చిత్రలేఖనం ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న కమ్మరి పాండురంగయ్య చారి ,కొత్తపల్లి ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయులు సంగెం రమేష్, కన్మన్ కాల్వ పాఠశాల ఉపాధ్యాయురాలు మంజులత, .మరికల్ పాఠశాలలో విద్యార్థులకు సహాయ సహకారాలు అందించిన సమాజ సేవకులు కాసోజు దివ్య ప్రభాకర చారికి శాసనమండలి సభ్యులు గౌరవనీయ AVN రెడ్డి చే సన్మానం చేసి అభినందించారు. పరిగి నియోజకవర్గం ,కొడంగల్ నియోజకవర్గం తాండూర్ నియోజకవర్గం, వికారాబాద్ నియోజకవర్గం లోని ఉత్తమ ఉపాధ్యాయులకు తపస్ నాయకులు సన్మానించారు.
No comments:
Post a Comment