*మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - నల్లకుంట ఇన్స్పెక్టర్ SHO మారుతి ప్రసాద్*
బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, సెప్టెంబర్ 12:
వినాయక చవితి పండుగను, భక్తి శ్రద్దలతో, సంప్రదాయాలతో, పర్యావరణాన్ని కాపాడుకుంటూ జరుపుకుందామని నల్లకుంట ఇన్స్పెక్టర్ మారుతి ప్రసాద్ పిలుపునిచ్చారు.నల్లకుంట సిటిజన్స్ అసోసియేషన్ NCA, హైదరాబాద్ సిటిజన్స్ ఫోరం HCF ఆధ్వర్యంలో ఈరోజు నల్లకుంటలో జరిగిన మట్టి గణపతుల ఉచిత పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మారుతి ప్రసాద్ మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను ప్రతిష్టించడం వలన నగరంలో హుస్సేన్ సాగర్ మరియు చెరువులు, కుంటలు కాలుష్యానికి గురవుతున్నాయని, పర్యావరణానికి హానికరం కాని మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించాలని పిలుపు నిచ్చారు. నగరంలో వైభవంగా నిర్వహించుకొనే “వినాయక చవితి” పండుగ సందర్భంగా అందరూ ఇండ్లలోనూ, అపార్ట్‌మెంట్స్, కాలనీ, బస్తీలలో సామూహికంగాను మట్టి గణపతి విగ్రహాలను ప్రతిష్టించాలని అన్నారు.
కార్యక్రమంలోNCA అధ్యక్షులు వి మోహన్ రావు, ప్రధాన కార్యదర్శి మోహన్ నాయుడు, పి శ్రీనివాసరావు, HCF ప్రధాన కార్యదర్శి కె.వీరయ్య, రామకృష్ణారావు, రాజీవ్ కుమార్, డాక్టర్ అమర్నాథ్, సత్యనారాయణ, కృష్ణ బాబు, కిరణ్, గోపాల్, శివకుమార్, వినోద్, సుకుమార్, నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment