*శాసనసభ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన సెంట్రల్ హాల్ కు మాజీ శాసనసభ స్పీకర్ స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాద రావు సెంట్రల్ హాలుగా నామకరణం*
బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, సెప్టెంబర్ 07:
శాసనసభ ప్రాంగణంలో నూతనంగా రూపుదిద్దుకున్న సెంట్రల్ హాల్‌ను సభా నాయకుడు, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రారంభించారు. మాజీ శాసనసభ స్పీకర్ స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాద రావు సెంట్రల్ హాలుగా నామకరణం చేసిన ఈ ప్రాంగణ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రితో పాటు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో పాటు మంత్రులు, ప్రభుత్వ విప్‌లు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. మాజీ శాసనసభ స్పీకర్ శ్రీపాద రావు గారి చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం ముఖ్యమంత్రి గౌరవ సభ్యులతో కలిసి బ్రేక్ ఫాస్ట్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
No comments:
Post a Comment