*ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం*
*ఆత్మహత్య పరిష్కారం కాదు,సమస్యలను కుటుంబ సభ్యులతో లేదా మిత్రులతో పంచుకోవాలి*
*తోటివారితో మాట్లాడటం, వారి భావాలను అర్థం చేసుకోవడం ద్వారా ప్రాణాలను కాపాడవచ్చు - అనూరాధ రావు,బాలల హక్కుల సంఘం*
బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, సెప్టెంబర్ 09:
సెప్టెంబర్ నెలను జాతీయ ఆత్మహత్యల నివారణ అవగాహన మాసం అంటారు. National suicide prevention month.సెప్టెంబర్ 10వ తేదీన ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవాన్ని ప్రపంచం అంతట నిర్వహిస్తారు. world suicide prevention Day. 2014-2026 సంవత్సరాలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO నిర్దేశించిన థీమ్ - ఆత్మహత్యలపై మన దృక్పథాన్ని మార్చడం - అంటే సంభాషణను ప్రారంభించండి - start the conversation.ఆత్మహత్యల నివారణకై ఆత్మహత్యలపై అవగాహన పెంచడం, మానసిక ఆరోగ్యం గురించి కావలసిన సహయం అందు బాటులో ఉంది అని అవగాహన పెంపొందించడమే లక్ష్యం.2003 నుండి ఇది ప్రారంభం అయింది. ప్రారంభించడానికి కారణాలు : ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇక్కడ పిల్లల ఆత్మహత్యల గురించి బాలల హక్కల సంఘం మాట్లాడుతుంది.
*నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో NCRB డేటా ప్రకారం 18 సంవత్సరాల లోపు పిల్లల్లో ఆత్మహత్యలు తీవ్రమైన సమస్యగా ఉంది.*
2024 డేటా ప్రకారం 11, 184 పిల్లల ఆత్మహత్యలు జరిగాయి.వాటి వివరాలు ఇలా ఉన్నాయి.
*(1)*: 1077 మంది పిల్లలు పరిక్ష ఫేల్యుర్ వల్ల సుసైడ్ చేసుకున్నారు.
*(2)*: కుటుంబ సమస్యలతో 3,101 పిల్లలు సుసైడ్ చేసుకున్నారు.
*(3)*: ప్రేమ వ్యవహారాల వల్ల-1671.
*(4)*: అనారోగ్య కారణాల వల్ల 1347.
ఇంకా ఇతర కారణాలు - మానసిక బత్తిడి, బుల్లీయింగ్ సామజిక ఒత్తిడి మొదలైనవి. ఇవి అధికారక సంఖ్యలు మాత్రమే, వాస్తవంగా ఎక్కువ సంఖ్య ఉండవచ్చు అని అంటున్నారు.
కారణం కేసు నమోదు చేయడానికి ఇష్టపడని వారు, బయటకు చెప్పడానికి భయపడే వారు కొందరు ఉంటారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడ సమ్యస తీవ్రత ఎక్కువగానే ఉంది.విద్యార్థుల ఆత్మహత్మలు రైతుల ఆత్మహత్యల కంటే 10 రెట్లు ఎక్కువగా ఉంది. ఇది ఒక పెచ్చరిక అని మానసిక నిపుణులు అంటున్నారు.విద్యార్థుల ఆత్మ హత్యలకు ప్రధాన కారణం, వారికి ఒత్తిడి పెరగడం - అటు తల్లి తండ్రల నుండి, ఇటు కాలేజి / స్కూళ్ల యాజమాన్యాల నుండి పిల్లలపై బత్తిడి తేవడం, రాంక్యుల గురించి, మార్కుల గురించి. దీన్ని తట్టుకోలేక పిల్లలు సూసైడ్స్ చేసుకుంటున్నారు.
కుటుంబంలో గొడవలు, తల్లి తండ్రల మధ్య విబేధాలు ఉండడం వల్ల పిల్లలు తమ సమస్యలు ఎవరితో చెప్పుకోవాలో తెలియక సుసైడ్స్ కు పాల్పడాతున్నారు.
పరీక్షల వత్తిడి - సరిగ్గా రాయక పోతే ఫెయిల్ అవడం, తక్కువ మార్కులు రావడం,ఇంట్లో చెప్పుకునే అవకాశం లేక బలైపోతున్నారు. ఇక NEET,JEE పరీక్షల్లో జరిగే అవకతవకల వల్ల పిల్లలు ప్రతి సంవత్సరం సుసైడ్స్ చేసుకుంటున్న విషయం తెలిసిందే.స్నేహితులు మధ్య విభేదాలు, చిన్నవయస్సు ప్రేమ వ్యవరాలు బ్రేకప్ అవడం, భావోద్వేగాలకు లోను కావడం వల్ల కూడా సూసైడ్స్ అవుతున్నాయి.
ముఖ్యంగా మానసిక అనారోగ్య సమస్యలు, డిప్రెషన్, ఆందోళన. మానసిక ఒత్తిడి సమస్యలను గుర్తించలేక పోవడం.బుల్లీయింగ్ స్కూళ్లో లేదా ఆన్లైన్లో పిల్లలుబుల్లేయింగ్కు గురికావడం ఎక్కువగా మానసికి బత్తిడిని ఎవరు గుర్తించ లేక, ఎవరి సపోర్ట్ లేకపోవడం వల్ల ఈ ఆత్మహత్యలు జరుగుతున్నాయి.
నివారణ చర్యలు తప్పని సరిగా ఆలోచించాల్సిన సమయం.
అంటే ముఖ్యంగా తల్లితండ్రుల్లో మార్పు రావలి, పిల్లలకు సమయాన్ని ఇవ్వాలి,పూర్తిగా వారు చెబుతున్న సమస్య వినాలి,వారితో ఓపెన్గా మాట్లాడి,వారి సమస్యను అర్ధం చేసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే.
పిల్లలపై అధిక అంచనాలు పెట్టకండి, మొదటి ర్యాంకు రావాలి అనే బత్తిడి అటు పేరేంట్స్, ఇటు స్కూల్స్ పెట్టకూడదు. పిల్లలుస్వేచ్ఛగా చదువుకునేలా,సంతోషంగా పాఠశాలలకు వెళ్లేలా ఉండాలి.
స్కూళ్లలో తరచుగా నిపుణులైన మానసిక వైద్యులతో కౌన్సిలింగ్ ఎర్పాటు చేయాలి. పిల్లల్లో
కొన్ని సంకేతాలు గమనించాలి. పిల్లలు అకస్మాత్తుగా ఒంటరిగా ఉండడం, ఏదో కోల్పోయిన విధంగా ఉండడం,ఎవరితో మాట్లాడక పోవడం, నిరాశగా మాట్లాడడం, నిద్ర పోకపోవడం, స్నేహితులకు దూరంగా ఉండడం చేస్తారు.ఇది గుర్తిం చినట్లయితే పేరేంట్స్ కాని స్కూల్లో టీచర్లు కాని, హస్టల్స్లో ఉన్న పిల్లలు ఇతర రూంమ్మెట్స్ కాని ఈ మార్పులను గమనిస్తే,వారిని కాపాడుకోవచ్చు. వెంటనే వారిని మానసిక వైద్యుల వద్ద సంప్రదించాలి.
వారు కౌన్సెలింగ్ ద్వారా పిల్లల్లో ఉన్న భయాలను తొలిగిస్తారు.వారిలో ఆత్మ విశ్వాసం పెంచడానికి తగిన సూచనలు, సలహాలు ఇస్తారు.వారికి కావల్సింది నీవు ఒంటరి కాదు, నీకు మేం ఉన్నాం అనే భరోసా ఇవ్వడం. ప్రతి స్కూళ్లలో, కళాశాలల్లో తరచు కౌన్సిలింగ్, వర్క్ షాప్స్ నిర్వహించాలి.టెలి మానస్ 1416 / 18008914416
Kiran - 18005990019
ఈ నంబర్స్కు కాల్ చేసి మీ మానసిక సమస్య ఎదైనా మాట్లాడిన వారు మీకు గైడ్ చేస్తారు.ప్రతి విద్యార్థి జీవితం విలువైనది, కావల్సిన సహయం తీసుకోవడం తప్పుకాదు.
ఆత్మహత్యల నివారణకై,అవగాహన పెంపోందించడానికి విద్యార్థులకు అండగా పని చేద్దాం.
No comments:
Post a Comment