*డిల్లిలో జరుగుతున్న వరుస సంఘటనలు మనకు ఒక తీవ్రమైన హెచ్చరిక*
*పిల్లల రక్షణ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరి బాధ్యత - అనూరాధ రావు,బాలల హక్కుల సంఘం*
బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, సెప్టెంబర్ 22:
దేశ రాజధాని ఢిల్లీ లో నెల వ్యవధిలో 4 ఘటనలు చోటు చేసుకున్నాయి.ఢిల్లీ - దేశ రాజధాని నగరం అని ఎంతో గొప్పగా చెప్పు కుంటాం, కాని అమ్మయిలు బయటికి వెళితే క్షేమంగా ఇంటికి చేరడం చాలా కష్టం.ఇంకా ఎన్ని నిర్భయ ఘటనలను చూడాలి మనం?
సెప్టెంబర్ 10వ తేదీన డిల్లి స్వరూప్ నగర్ లో 16 సంవత్సరాల అమ్మాయి టెంపోలో స్నేహితున్ని కలవడానికి వెళితే, అతను తన స్నేహితులను పిలిచి మద్యం సేవించి, ఆ అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేసారు.వాళ్లలో ముగ్గురు మైనర్లే. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేస్తాను అని చెప్పగానే కత్తితో పొడిచి చంపి,నిర్మానుష్య ప్రదేశంలో మూటకట్టి పడేశారు. 13వ తేదీన పోలీసులకు ఈ శవం దొరికింది.సిసి టీవీ పుటేజీ ఆధారంగా నిందితులను పట్టుకున్నారు.సౌత్ ఢిల్లి సిడిఆర్ చౌక్ దగ్గర పుట్ పాతపై నిద్రిస్తున్న 10 సంవత్సరాల పాపను క్యాబ్ డ్రైవర్ అపహరించి, రేప్ చేసి, రాళ్లతో కొట్టి చంపి పారిపోయాడు.
షాబాద్ డైరీ అపార్టమెంట్ దగ్గర 5 సంవత్సరాల పాపను 34 సంవత్సరాల వ్యక్తి బిస్కెట్లు ఇస్తానని ఇంట్లోకి పిలిచి రేప్ చేసిన ఘటన జరిగింది.అగస్టు చివరి వారంలో నోయిడా నుండి ఢీల్లీ కాశ్మీరీ గేట్ ప్రాంతానికి వెళుతున్న స్లీపర్ బస్సులో 16 సంవత్సరాల మైనర్ "బాలికపై గ్యాంగ్ రేప్ జరిగింది. అబ్బయిలను కూడా వదలడం లేదు, 12 సంవత్సరాల బాలుడిపై ధారుణంగా నలుగురు వ్యక్తులు రేప్ చేసి,కొట్టి ప్రాణాపాయ స్థితిలో వదిలేశారు.అన్ని కేసుల్లో కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
నేరం రుజువైతే POCSO చట్ట ప్రకారం శిక్ష పడుతుంది. ఇక్కడ ముగ్గురు మైనర్లకు జువెనైల్ చట్ట ప్రకారం 3 సంవత్సరాల శిక్ష పడుతుంది అని అంటున్నారు.వారిని Correction home లో పెడతారు.మనం పిల్లల భద్రత గురించి చూస్తే రక్షణ కల్పించడంలో మన వ్యవస్థ విఫలం అయింది అని చెప్ప వచ్చు.నేరం జరిగాక చర్యలు తీసుకోవడం కాదు, ముందస్తు భద్రత చర్యలు ఎంటి?
ఈ ఘోరాలు కదులుత్తున్న బస్సులో, టెంపోల్ జరిగాయి.
వాహనాలకు ఏదైన ఆలారం లాంటివి అమర్చడం వల్ల, దగ్గర పోలీస్స్టేషన్కు, పోలీసుల పెట్రోలింగ్ వాహనాలకు సమచారం అందే విధంగా పరికరాలను అమర్చాలి.
తల్లిదండ్రులు తప్పని సరి అలర్టుగా ఉండాలి. పిల్లలను ఒంటరిగా పంపిచాల్సి వస్తే తెలియని ప్రైవేట్ బస్సులు, వాహనాలు అవాయిడ్ చేయలి. ప్రభుత్వ రవాణా బస్సులు,మెట్రో ట్రైన్ లేదా రిజిస్టర్డ్ క్యాబ్ మాత్రమే ఉపయోగించాలి.మీరు ప్రయాణించే లోకేషన్ కుటుంబ సభ్యులకు షేర్ చేయాలి.
అపరిచితులతో అప్రమత్తంగా ఉండాలి, తెలియని వ్యక్తులు లిఫ్ట్ ఇస్తాం రమ్మని పిలిస్తే వద్దు అని చెప్పాలి. తినడానికి ఎదైనా ఇస్తే వద్దు అని చెప్పాలి. స్మార్ట్ ఫోన్లో బయటికి వెళ్లిన తర్వాత SOS emergency ఆన్ చేసుకోవాలి, ఏదైన సమస్య వస్తే బటన్ ఒత్తితే ఆ సమాచారం తల్లిదండ్రుల ఫోన్ కు / పోలీసుస్టేషన్ కు అందుతుంది. కావల్సిన సహాయం అందుతుంది.అత్యవసర నంబర్స్ కు కాల్ చేయాలి 112 / 100 / 1091 / 1098
బాధితులకు న్యాయం జరగాలి, వారికి కావలస్సిన కౌన్సిలింగ్, వైద్యం అందాలి, ఆ కుటుంబాలకు అండగా ప్రభుత్వం ఉండాలి.
పిల్లల రక్షణ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరి బాధ్యత, కుటుంబం, పాఠశాలలు, పోలీసులు, ప్రభుత్వం అందరి బాధ్యత.
No comments:
Post a Comment