*పర్యావరణ పరిరక్షణలో భాగంగా మరికల్ జిల్లా పరిషత్ పాఠశాలలో మట్టి వినాయక విగ్రహాలు తయారు చేసిన విద్యార్థులు*
బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, సెప్టెంబర్ 11:
వికారాబాద్ జిల్లా చౌడపూర్ మండల పరిధిలోని మరికల్ గ్రామ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు మట్టి వినాయక ప్రతిమలు వివిధ ఆకారాలలో చూడముచ్చటగా తయారు చేశారు.మంచి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రధానోపాధ్యాయురాలు సర్వమంగళ బహుమతులు అందజేశారు.సీనియర్స్ లో మొదటి బహుమతి వైష్ణవి రెండో బహుమతి నితిన్ జూనియర్స్ లో మొదటి బహుమతి నరేష్ రెండో బహుమతి కార్తీక్ అందుకొన్నారు. గ్రామంలో మన ఇండ్లలో మట్టి వినాయకులను ప్రతిష్టించి భక్తి శ్రద్దలతో పూజించి పర్యావరణాన్ని కాపాడాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శైలజ వెంకటయ్య మల్లయ్య శివప్రసాద్ అంజిలయ్య రాజశేఖర్ హన్మయ్య శశిధర్ పాండురంగాచారి శ్రీలక్ష్మి రమాదేవి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment