*_ఇదే 'నా' జర్నలిజం_*
ఈడీ భారీ దాడులపై *_తెలుగు మీడియా సైలెన్స్ దేనికి రా..?_*
_# యాజమాన్య పాదాల కింద నలుగుతున్న వైనాలు_
_# కొండెక్కిన గుండె ధైర్యం_
_# దమ్మున్నోళ్ళు ఎక్కడ.?_
_(తెలుగు జర్నలిజంపై ఈ దశాబ్ది ఉత్తమ పరిశోధన పాత్రికేయులు అనంచిన్ని వెంకటేశ్వరరావు, 9440000009 అందిస్తున్న సంచలన కథనం)_
జర్నలిస్టులు పిరికి వాళ్ళా.? నాటి దుమ్ము , ధైర్యం ఎక్కడికి పోయింది.
డబ్బు సంపాదించిన వాడి చేతుల్లో కీలుబొమ్మలు అయ్యారా.? అంతరాత్మ ఎక్కడికి పోయింది.? బట్ నేను..నేనే. నన్ను కొనెటోడు లేడు. పుట్టలేదు. కేసులు 'వెంట్రుక'తో సమానం. జైళ్ళ గోడలు బద్దలు కొట్టుకొని.. 'ఫాంహౌజ్ పశుపతి'ని పడుకోపెట్టిన 'నా' జర్నలిజం ఇంతే ఉంటది. నాకు దుమ్ము, ధైర్యం ఉంది. అందుకే 'తెలుగు జర్నలిస్టు'ల తరఫున 'నా' కథనం ఇలాగే ఉంటుంది ర్రా.. రాజకీయుల్లారా.! 'యూజ్ లెస్ ఫేలోస్'.
*_గ్రూప్‌పై ఈడీ దాడులు, రుణాల మోసం & మీడియా సంబంధాలపై సమగ్ర కథనం…:_*
AMR సంస్థ పై ఈడీ రైడ్స్ కి సంబంధించి తెలుగు దినపత్రికల్లో ఎక్కడా వార్తలు రాయడం లేదని రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరావు చేసిన ట్వీట్ చూసి ఆశ్చర్యం వేసింది ..
*_ఏందిరా ఇది.!:_*
'ఇంత పెద్ద ఇష్యూ జరిగితే ఇది తెలుగు మీడియాలో ఎందుకు హైలెట్ కాలేదు' అని స్టడీ చేస్తే . . ఆ సంస్థ యజమానికి తెలుగు మీడియా సంస్థల యజమానులకు ఉన్న ఆర్ధిక సంబంధాలపై సమాచారం తెలిసింది.
*_మాకేం తెల్వద్.. కన్పించద్_*
హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, మైనింగ్ సంస్థ AMR ఇండియా లిమిటెడ్ (AMR India Limited), దాని ప్రమోటర్ అల్తురు మహేష్ కుమార్ రెడ్డి (A. Mahesh Reddy) నివాసాలు, కార్యాలయాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దేశవ్యాప్తంగా ఏకకాలంలో విస్తృత సోదాలు నిర్వహించింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (PMLA), 2002 కింద హైదరాబాద్ (కమలాపురి కాలనీ/బంజారాహిల్స్ పరిసరాలు), కోల్‌కతా, బెంగళూరు, చెన్నై నగరాల్లోని పలు ప్రాంతాల్లో ఈ తనిఖీలు చేపట్టారు.
*_రుణాల బాగోతం_*
ఈడీ దాడుల వెనుక ప్రధాన కారణాలు & ఆరోపణలు
కోల్‌కతాకు చెందిన NBFCలు అయిన SREI ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ లిమిటెడ్ (SIFL), SREI ఎక్విప్‌మెంట్ ఫైనాన్స్ లిమిటెడ్ (SEFL) నుంచి ఒడిశాకు చెందిన ARSS గ్రూప్, AMR గ్రూప్ భారీగా రుణాలు తీసుకున్నాయి.
*_రూ.919 కోట్లా..?_*
నిబంధనలకు విరుద్ధంగా పొందిన ఈ రుణాలను ప్రాజెక్టుల కోసం కాకుండా ఇతర అనుబంధ సంస్థలకు మళ్లించడం (Fund diversion), ‘ఎవర్‌గ్రీనింగ్’ పేరిట రౌండ్ ట్రిప్పింగ్ చేయడం, తిరిగి చెల్లించకుండా ఎగవేతకు పాల్పడటం వంటి ఆర్థిక నేరాలపై ఈడీ విచారణ జరుపుతోంది. SREI క్లెయిమ్‌లలో ఒక్క ARSS గ్రూప్‌పైనే దాదాపు ₹919 కోట్ల వివాదం ఉంది.
*_రశీదులు ఇచ్చి మరీ.._*
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్‌లోని మైనర్ ఖనిజాల రవాణాపై సీనరైజ్ ఫీజు వసూలు చేసేందుకు ‘సీనరైజ్ కలెక్టింగ్ కాంట్రాక్టర్ (SCC)’గా AMR ఇండియా కాంట్రాక్ట్ దక్కించుకుంది (గుంటూరు, కృష్ణా, నెల్లూరు, ప్రకాశం, విశాఖపట్నం జిల్లాల్లో సుమారు 650 చెక్‌పోస్టులు).
ప్రభుత్వ అధికారిక ‘OMEPS’ పోర్టల్ నిబంధనలను ఉల్లంఘించి, AMR సంస్థ సొంత ప్రైవేట్ యాప్‌లు, వెబ్‌సైట్ల ద్వారా అనధికారిక పర్మిట్లు/ రశీదులు జారీ చేసింది.
*_ఇలా గండి కొట్టి.._*
వ్యక్తిగత బ్యాంక్ ఖాతాలకు లింక్ చేసిన UPI క్యూఆర్ (QR) కోడ్ల ద్వారా, అలాగే నేరుగా నగదు (Cash) రూపంలో మైనింగ్ వ్యాపారుల నుంచి వందల కోట్ల రూపాయలు వసూలు చేసి ప్రభుత్వ ఖజానాకు గండికొట్టారనేది విజిలెన్స్, మైనింగ్ అధికారుల ప్రధాన ఆరోపణ. తాజా సోదాల్లో మహేష్ రెడ్డి నివాసాలు, కార్యాలయాల నుంచి మెర్సిడెస్- మేబ్యాక్, లెక్సస్, ఫెరారీ, లంబోర్ఘిని, నిస్సాన్ జీటీఆర్ వంటి సుమారు 11 అత్యంత ఖరీదైన లగ్జరీ కార్లను అధికారులు గుర్తించి, నిధుల మూలాలపై దర్యాప్తు చేస్తున్నారు.
*_రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఆరోపణలు & మీడియా మౌనం_*
ఈడీ సోదాలు, AMR సంస్థ అక్రమాల వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు (ABV) సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
*_ప్రధాన మీడియా మౌనం…:_*
జాతీయ స్థాయిలో ఈడీ ఇంత భారీ ఎత్తున సోదాలు జరిపి, వందల కోట్ల అక్రమ నగదు లావాదేవీలు, లగ్జరీ కార్ల సీజ్ వ్యవహారాలు బయటపెడుతున్నా… తెలుగు ప్రధాన దినపత్రికలు, ప్రముఖ న్యూస్ ఛానెళ్లు దీనిని కావాలనే తొక్కిపెట్టాయని ఆయన ఆక్షేపించారు. ఏ ఒక్క ప్రధాన ఛానెల్‌లోనూ దీనిపై సరైన చర్చగానీ, హెడ్‌లైన్స్ గానీ రాలేదని ఆయన వేలెత్తి చూపారు.
*_మీడియా యజమానులతో సంబంధాలు & నిధుల ప్రవాహం…:_*
AMR సంస్థ ప్రమోటర్లకు ప్రధాన తెలుగు మీడియా సంస్థలు, పలు టీవీ ఛానెళ్ల మేనేజ్‌మెంట్లు/ యజమానులతో ప్రత్యక్ష, పరోక్ష వ్యాపార బంధాలు ఉన్నాయని విమర్శలు ఉన్నాయి. AMR గ్రూప్ నుంచి అడ్వర్టైజ్‌మెంట్లు, పెట్టుబడులు, స్పాన్సర్‌షిప్‌లు లేదా ఇతర ఆర్థిక రూపాల్లో మీడియా సంస్థలకు నిధులు మళ్లడం వల్లనే… ఈడీ దాడుల విషయాన్ని కప్పిపుచ్చుతూ వార్తలను బ్లాక్ చేశారనే అంశాన్ని ఆయన బహిర్గతం చేశారు.
*_అంతా 'వెధవ'ల రాజకీయమే..!_*
రాజకీయ అండదండలు, మీడియా సంస్థల భాగస్వామ్యంతోనే గత ప్రభుత్వంలో మొదలైన ఈ అక్రమ వసూళ్ల వ్యవహారం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అధికారుల నివేదికలు ఉన్నప్పటికీ సజావుగా విచారణ జరగకుండా అడ్డుకోగలుగుతున్నారని ఆయన విమర్శించారు. ఇంగ్లీష్ ప్రధాన పత్రికలైన డెక్కన్ క్రానికల్, టైమ్స్ ఆఫ్ ఇండియా, ది హన్స్ ఇండియా తదితర పత్రికలు ఈ ఆర్థిక మోసం, నిధుల మళ్లింపు, కోల్‌కతా ఈడీ బృందం జరిపిన తనిఖీల వివరాలను వెలుగులోకి తీసుకురాగా, తెలుగు మెయిన్‌స్ట్రీమ్ మీడియాలో ఈ వార్త మాయమవడం విచిత్రం…
No comments:
Post a Comment