*ప్రపంచ రేబీస్ దినోత్సవం*
*కుక్క కాటును నిర్లక్ష్యం చేయవద్దు వెంటనే యాంటీ రేబీస్ టీకా వేయించుకోవాలి - అనురాధ రావు బాలల హక్కుల సంఘం*
బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, సెప్టెంబర్ 27:
2007 వ సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 28న ప్రపంచం అంతట ప్రపంచ రేబీస్ దినోత్సవం జరుపుకుంటారు.రేబీస్ వ్యాధి నివారణ టీకాను కనుగొన్న శాస్త్ర వేత్త లూయిస్ పాశ్చర్ వర్ధంతిని పురస్కరించుకుని ప్రతి సoll Sep 28న ప్రపంచ రేబీస్ దినోత్సవం జరుకుంటున్నాం రేబీస్ వ్యాధి ఎంత ప్రమాదకరమైనదో, ఎలా నివారించ వచ్చో ,టీకాల ప్రాధాన్యత గురించి ప్రజల్లో అనగాహన పెంపొందిచడం లక్ష్యం.2026 సం॥ థీం "స్ట్రాంగర్ టుగెదర్" 2030 నాటికి కుక్కల కాటు వల్ల వచ్చె రేబోస్ వల్ల మనుషులు చనిపోకుండా పూర్తిగా నివారించడం లక్ష్యం - Zero by 2030
భారత దేశంలో ఏటా సుమారు 37 లక్షల నుండి 47 లక్షల వరకు కుక్క కాటు కేసులు నమోదు అవుతున్నాయి.
పశుధన్ ప్రహరి నివేదికల ప్రకారం
2025-2026 సంవత్సరాల్లో 40.44 లక్షల కేసులు 2025 లో నమోదు. 2026 మొదటి ఆరు నెలల్లో 30.4 కేసులు నమోదు.తెలంగాణలో చూస్తే ప్రతిరోజు 300 కేసులు నమోదు, సంవత్సరానికి సుమారు 1.22 లక్షల కేసులు నమోదు. The lancet ప్రతికలో ప్రచురితం అయిన 5700 పైగా మానవ రేబీస్ మరణాలు అని నిర్ధారణ.తెలంగాణలో13 నుండి 20 వరకు అధికారిక మరణాలు నమోదు
మరణాలకు ప్రధాన కారణాలు -
కుక్క కరిచిన వెంటనే చాలా వరకు చిన్న గాయం అని నిరక్ష్యం చేయడం, నాటు వైద్యం చేయించుకోవడం. వ్యాక్సిన్ వేయించుకోక పోవడం,యాంటి రేబీస్ వ్యాక్సిన్ పూర్తి డోసులను తీసుకోకపోవడం. 0, 3, 7, 14 & 28వ రోజు తీసుకొవాలి. టికాకు చిన్న పిల్లలకు తొడ భాగంలో ఇవ్వాలి. నడుము మీద, సీటు భాగంలో ఇవ్వకూడదు.గాయం తీవ్రంగా ఉండి, రక్తం వస్తే టీకాతో పాటు, రేబీస్ ఇమ్యునోగ్లోబులిన్ ఇంజక్షన్ గాయం చుట్టు ఇస్తారు.కుక్క కరిచిన వెంటనే మంచినీటితో శుభ్ర పరిచి, హాస్పిటల్ తీసుకెళ్లి వైద్యం చేయించాలి, ఆలస్యం చేయకూడదు. రేబీస్ గురించి భయం కాదు, అవగాహన అవసరం.చిన్న నిరక్ష్యం ప్రమాదం కావచ్చు.ఈ విషయం తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి,అవగాహనతో మెలగాలి.కుక్కల దగ్గరకు వెళ్లి ఆటలు ఆడకూడదు అని చెప్పాలి. పెంపుడు కుక్క కరిచినా,గీరిన,నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్లను సంప్రదించాలి. పిల్లలను కాపాడడం మనందరి బాధ్యత.
No comments:
Post a Comment