*దానం నాగేందర్‌పై హైకోర్టు అనర్హత వేటు ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి న్యాయం గెలిచింది - ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ*
*రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌ను కఠినంగా అమలు చేయాలి - ఆప్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ మిస్ హేమా సుదర్శన్ జిల్లోజు*
బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, సెప్టెంబర్ 20:
పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేయడం కీలక పరిణామం.మిగిలిన పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై కూడా తక్షణ చర్యలు తీసుకోవాలి అని ఆప్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ మిస్ హేమా సుదర్శన్ జిల్లోజు అన్నారు.ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీ ఫిరాయింపు వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆప్ తెలంగాణ స్వాగతిస్తుందని ఆప్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు హేమా సుదర్శన్ జిల్లోజు తెలిపారు. బీఆర్‌ఎస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ అనంతరం కాంగ్రెస్‌లో చేరడమే కాకుండా, 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీఫామ్‌పై సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన అంశాన్ని హైకోర్టు పరిగణనలోకి తీసుకుని, 2024 ఏప్రిల్ 23 నుంచే ఆయన ఎమ్మెల్యేగా అనర్హుడని ప్రకటించింది. అలాగే ఆయన పార్టీ మారలేదంటూ స్పీకర్ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది. ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీగా ఉన్నట్లు నోటిఫై చేసే విధంగా తీర్పు ప్రతిని ఎన్నికల సంఘానికి, అసెంబ్లీ స్పీకర్‌కు పంపాలని కూడా ఆదేశించింది. “న్యాయం గెలిచింది. రాజ్యాంగం గెలిచింది. పార్టీ ఫిరాయింపులపై ప్రజల్లో ఉన్న అనుమానాలకు ఈ తీర్పు ఒక ముఖ్యమైన రాజ్యాంగపరమైన సందేశం” అని ఆమె పేర్కొన్నారు. మిగిలిన ఎమ్మెల్యేలపై కూడా చర్యలు తీసుకోవాలి.
**దానం నాగేందర్‌తో పాటు బీఆర్‌ఎస్ టికెట్‌పై గెలిచి కాంగ్రెస్‌లో చేరినట్లు అనర్హత పిటిషన్లు ఎదుర్కొన్న ఎమ్మెల్యేలు**
*(1)*: కడియం శ్రీహరి – స్టేషన్ ఘన్‌పూర్
*(2)*: పోచారం శ్రీనివాస్ రెడ్డి – బాన్సువాడ
*(3)*: తెల్లం వెంకట్రావు – భద్రాచలం
*(4)*: డాక్టర్ సంజయ్ కుమార్ – జగిత్యాల
*(5)*: అరికెపూడి గాంధీ – శేరిలింగంపల్లి
*(6)*: టి. ప్రకాశ్ గౌడ్ – రాజేంద్రనగర్
*(7)*: బండ్ల కృష్ణమోహన్ రెడ్డి – గద్వాల్
*(8)*: కాలే యాదయ్య – చేవెళ్ల
*(9)*: గూడెం మహిపాల్ రెడ్డి – పటాన్‌చెరు.
పేర్లు నమోదయ్యాయి.
వీరిలో గూడెం మహిపాల్‌రెడ్డి తిరిగి బీఆర్‌ఎస్‌లోకి వచ్చిన నేపథ్యంలో ఆయనను మినహాయించి మిగిలిన తొమ్మిది మందిపై చర్యలు కోరుతూ బీఆర్‌ఎస్ తరఫున హైకోర్టులో పిటిషన్లు దాఖలైనట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. “ఒక ఎమ్మెల్యే విషయంలో హైకోర్టు స్పీకర్ ఉత్తర్వులను రద్దు చేసి అనర్హతను ప్రకటించిన నేపథ్యంలో, మిగిలిన పార్టీ ఫిరాయింపు కేసులను కూడా పారదర్శకంగా, రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా త్వరితగతిన పరిష్కరించాలి. ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు పార్టీ మారితే రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌ను గౌరవించాల్సిందే” అని ఆప్ తెలంగాణ డిమాండ్ చేస్తోంది.
ఆప్ తెలంగాణ డిమాండ్లు:
మిగిలిన పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులను తక్షణమే పరిష్కరించాలి.రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌ను కఠినంగా అమలు చేయాలి. పార్టీ ఫిరాయింపుల విషయంలో ప్రజలకు పూర్తి పారదర్శకత కల్పించాలి. ప్రజల తీర్పును గౌరవించే విధంగా ఎమ్మెల్యేలపై నిర్ణయాలు తీసుకోవాలి. పార్టీ ఫిరాయింపుల వల్ల ఏర్పడే రాజకీయ అస్థిరతకు అడ్డుకట్ట వేయాలి. “పార్టీ ఫిరాయింపులకు రాజకీయ లాభాల కోసం ప్రోత్సాహం ఇవ్వకుండా, రాజ్యాంగ విలువలు మరియు ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికీ, శాసనసభకీ ఉంది. ఈ విషయంలో ఆప్ తెలంగాణ ప్రజల తరఫున నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటుంది” అని ఆమె స్పష్టం చేశారు.
No comments:
Post a Comment