*ముఖ్యమంత్రి హోదాలో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న రేవంత్ రెడ్డి - మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి*
బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, సెప్టెంబర్ 24:
తెలంగాణలో గ్రేడ్ 9 G9 బొగ్గు దొరకదని నిన్న రివ్యూ మీటింగ్లో పచ్చి అబద్ధాలు ఆడిన సీఎం రేవంత్ రెడ్డి అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు.అసలు G9 బొగ్గు లేకుండానే బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ రకం బొగ్గుతో ప్లాంట్ను నడిపిస్తామని ఒప్పందం ఎలా చేసిందంటూ నిన్న మీడియా సాక్షిగా తప్పుడు ప్రచారం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని అన్నారు.బీఆర్ఎస్ నాయకుల పవర్ ప్లాంట్ సందర్శనలో రేవంత్ రెడ్డి చెప్పినవి పచ్చి అబద్ధాలని నిరూపించిన జెన్కో ఇంజనీర్లు అని అన్నారు.G9 బొగ్గు సరఫరా చేస్తామని సింగరేణి చెప్పడంతోనే ఆనాడు ఆ రకం బొగ్గుతో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నడిపేందుకు ఒప్పందం చేసుకున్నామని, వాస్తవానికి G7 నుంచి G13 వరకు టెక్నాలజీ ఉందని జగదీష్ రెడ్డికి తెలిపిన ఇంజనీర్లు.కానీ ఇప్పుడు ఉన్నపళంగా సింగరేణి G9 బొగ్గు సరఫరా చేయడం ఆపేసిందని తెలిపిన అధికారులు. దాదాపు 15 నుంచి 20 రోజుల విద్యుత్ ఉత్పత్తికి సరిపడా బొగ్గు నిల్వలు ఉంచాల్సిన నేపథ్యంలో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో కేవలం 4 రోజులకే బొగ్గు నిల్వలు ఉన్నాయని తెలిపిన ఇంజనీర్లు.మొత్తానికి బీఆర్ఎస్ నాయకుల పవర్ ప్లాంట్ సందర్శన కారణంగా, G9 బొగ్గుపై, బీఆర్ఎస్ పార్టీ ఒప్పందంపై తన అనుకూల మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి చేయించిన దుష్ప్రచారం బట్టబయలైంది.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సింగరేణిలో వస్తున్న మంచి బొగ్గును ఏపీలో తన గురువు చంద్రబాబుకి, కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి పంపిస్తున్నాడు.దీని వల్లే ఇబ్బంది అయింది తప్ప వేరే ఎలాంటి కారణం లేదు అని జగదీష్ రెడ్డి అన్నారు.ఈ రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభానికి కారణం ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, మంత్రులే అని అన్నారు.పూర్తి స్థాయిలో విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నాము.. లేకుంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టము అని హెచ్చరించారు.
No comments:
Post a Comment