*సైబరాబాద్ పోలీస్ అసోసియేషన్‌కు నూతన కార్యవర్గం*
*నూతన సభ్యులకు సీపీ డా. రమేష్, IPS, అభినందనలు*
బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, సెప్టెంబర్ 11:
సైబరాబాద్ పోలీస్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నికైంది. అధ్యక్షుడిగా ఎస్సై శ్రీనివాస్ (హెచ్‌సీ–3046), ఉపాధ్యక్షుడిగా ఇన్‌స్పెక్టర్ శ్రీకర్‌బాబు (19435) ఎన్నికయ్యారు. ఎస్సై/ఏఎస్సై కేటగిరీలో ప్రియదర్శిని (3251), హెడ్ కానిస్టేబుల్ కేటగిరీలో కార్తిక్ శ్రీనివాస్ (3276), పోలీస్ కానిస్టేబుల్ కేటగిరీలో రాజేందర్ (5180) వైస్ ప్రెసిడెంట్లుగా ఎన్నికయ్యారు.వివిధ పదవులకు మొత్తం 29 మంది సభ్యులు ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డా. రమేష్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీపీ వారికి శుభాకాంక్షలు తెలిపారు. అసోసియేషన్ ద్వారా సిబ్బంది సంక్షేమం, సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.
No comments:
Post a Comment