Friday, September 11, 2026

మరికల్ లో ఘనంగా అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం_


 
*మరికల్ లో ఘనంగా అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, సెప్టెంబర్ 09:

వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండల పరిధిలోని మరికల్ గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా గ్రామంలో ర్యాలీ నిర్వహించి ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు , అందరూ చదవాలి అందరూ ఎదగాలి అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు.తర్వాత  అక్షరాస్యత గురించి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సర్వమంగళ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఉన్నత చదువులు చదవాలని ఎవరు కూడా చదువును మధ్యలో మానివేయ రాదని ఇంటిలో ఉన్న పెద్దలు ఎవరైనా చదువు రాని వాళ్ళు ఉంటే వారికి సంతకం చేయడానికి చదవడానికి నేర్పించాలని విద్యార్థులకు తెలియజేయడం జరిగింది. మంచిగా చదువుకుంటే జీవిత లక్ష్యం తో పాటు జీవనభృతి సంఘంలో గౌరవం దక్కుతుందని తెలియజేశారు .
విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు నిర్వహించి ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శైలజ ,వెంకటయ్య, రామకృష్ణ ,మల్లయ్య, హన్మయ్య ,అంజిలయ్య, రాజశేఖర్ ,పాండురంగాచారి ,రత్నమాల ,శ్రీలక్ష్మి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment