Tuesday, September 8, 2026

రాష్ట్రంలో వెన్నెముక గాయాలతో బాధపడుతున్న దివ్యాంగులను ప్రభుత్వం ఆదుకోవాలి - నరేష్

*రేవంత్ రెడ్డి సారు మమ్మల్ని ఆదుకోండి*

*రాష్ట్రంలో వెన్నెముక గాయాలతో బాధపడుతున్న దివ్యాంగులను ప్రభుత్వం ఆదుకోవాలి - నరేష్*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, సెప్టెంబర్ 07:

నా పేరు నరేష్ మాది మరికల్ గ్రామం,చౌడపూర్ మండలం,వికారాబాద్ జిల్లా.​జీవితం ఎప్పుడు ఎలాంటి మలుపు తిరుగుతుందో ఎవరూ ఊహించలేరు.నాకు 18 సంవత్సరాల క్రితం ఆటో ప్రమాదం వల్ల వెన్నుముక విరిగింది అప్పటినుంచి నేను మంచానికి పరిమితం అయ్యాను.ఏ పనులు చేసుకోవాలన్న అమ్మా నాన్నల సహకారం అవసరం. రోడ్డు ప్రమాదం తర్వాత వెన్నుముక్క విరిగి మంచానికి పరిమితమైన నేను నా వల్ల కుటుంబం చాలా ఇబ్బందులు పడింది.ఆ సమయంలో నాకంటే ఎక్కువగా నా కుటుంబం తీవ్ర వేదనను అనుభవించింది.నన్ను పూర్వపు స్థితికి తీసుకురావాలన్న తాపత్రయంతో నిమ్స్ (NIMS) హాస్పిటల్‌లో దాదాపు రెండు సంవత్సరాలకు పైగా చికిత్స చేయించారు.

*ట్రీట్మెంట్ కోసం 20 పశువులను,కొంత భూమిని కూడా అమ్మి నాకోసం ఖర్చు చేశారు*

అయినా కూడా ఎటువంటి ఇంప్రూవ్మెంట్ లేదు మమ్మల్ని చూసుకోవడానికి ఒక సంరక్షకులు ఎప్పుడు మావెంటే ఉండాలి.​ఆ చీకటి రోజుల్లో జీవితంపై ఆశలు సన్నగిల్లుతున్న వేళ... నా జీవితంలోకి *హోప్ 4 స్పందన* ఒక స్వచ్ఛంద సంస్థ పరిచయమై శ్రీ కోట లక్ష్మీ నరసింహ సర్ ,రఘు అరికపూడి సర్ నా పరిస్థితిని అర్థం చేసుకుని, నేను స్వయం సమృద్ధిగా జీవించడానికి నాకు ఒక చిన్న కిరాణా షాప్ పెట్టి ఇవ్వడం జరిగింది. అలాగే నాలాంటి వెన్నుముక బాధితులకు *హోప్ 4 స్పందన ఫౌండేషన్  *స్పైనల్ కార్డ్ మెడికల్ కిట్* కూడా ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్రంలో వెన్నెముక గాయాలతో బాధపడుతున్న దివ్యాంగులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆదుకోవాలి అని నరేష్ విజ్ఞప్తి చేశాడు.వీల్ చైర్ ఆటల గురించి తెలుసుకొని వీల్ చైర్ క్రికెట్లో *తెలంగాణ వీల్ చైర్ క్రికెట్ టీం* కి ఆడుతున్నాను అలాగే స్టేట్ లెవెల్ ప్యార గేమ్స్ లో జావేలిన్ త్రో లో, మెడల్స్ గెలవడం జరిగింది అని తెలిపాడు.​మంచానికే పరిమితమైన స్థాయి నుంచి నేడు క్రీడా మైదానంలో పతకాలు గెలిచే స్థాయికి చేరుకోవడానికి కారణం నా కుటుంబం చేసిన త్యాగం, "హోప్ ఫర్ స్పందన" అందించిన చేయూత, నాలోని ఆత్మవిశ్వాసం. వైకల్యం శరీరానికే కానీ ఆలోచనలకు, సంకల్పానికి కాదు!.

**ప్రపంచ వెన్నెముక  మరియు వెన్నుపాము గాయాల దినోత్సవాన్ని (World Spinal Cord Injury Day) ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5 న జరుపుకుంటారు*.

సెప్టెంబర్ 5 న హైదరాబాద్ సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశం,అవగాహన సదస్సు నిర్వహించారు.తెలంగాణ వెన్నెముక గాయాల దివ్యాంగుల సంఘం (SCIAT) రాష్ట్ర అధ్యక్షుడిగా ఎం.డి. షఫీ అహ్మద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఇంటర్నేషనల్ స్పైనల్ కార్డ్ సొసైటీ (ISCoS) సంస్థ 2016 వ సంవత్సరంలో ఈ దినోత్సవాన్ని ప్రారంభించింది.వెన్నుముక మరియు వెన్నుపాముకు జరిగే గాయాల పట్ల ప్రజల్లో అవగాహన పెంచడం. ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన తక్షణ జాగ్రత్తలు, అధునాతన శస్త్రచికిత్సల ప్రాధాన్యతను వివరించడం. వీల్‌చైర్‌కే పరిమితమైన బాధితులకు సమాజంలో సమాన అవకాశాలు కల్పిస్తూ వారిలో ఆత్మస్థైర్యం నింపడం.వెన్నెముక గాయం అనేది జీవితాన్ని పూర్తిగా మార్చివేసే తీవ్రమైన సమస్య అని, సకాలంలో సరైన చికిత్స అందకపోతే పరిస్థితి మరింత విషమిస్తుందని మలమూత్రాలు ఆధీనంలో ఉండక డైపర్లు యూరిన్ క్యాటరు వాడాల్సి వస్తుంది. పుండ్లు పడి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అని పేర్కొన్నారు.​రోడ్డు ప్రమాదాలు మరియు ఎత్తుల నుండి పడటం వంటి సమయాల్లో వెన్నుముక దెబ్బతినకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వైద్య నిపుణులు ఈ సమావేశంలో సూచించారు.

**అవసరమైన సదుపాయాలు:**

బాధితులకు సకాలంలో ఫిజియోథెరపీ, మెరుగైన వైద్యం, వీల్‌చైర్ వంటి సహాయ పరికరాలు అందించాలని కోరారు.వెన్నెముక దెబ్బతిని ఇతరులపై ఆధారపడి జీవిస్తున్న వారి పట్ల ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరించాలని, ఆంధ్రప్రదేశ్ తరహాలో నెలకు ₹15 వేల ఆర్థిక భరోసా (పెన్షన్/సాయం) కల్పించాలని డిమాండ్ చేశారు.అలాగ తీవ్రమైన వికలాంగులను గుర్తించి పునారావస కేంద్రాలు ఏర్పాటు చేసి మెరుగైన ఫిజియోథెరపీ అందించాలి స్పైనల్ కార్డ్ బాధితులు ఆర్థికంగా ఎదగడానికి జీవనోపాధి కల్పించి  ప్రభుత్వం సహకారం అందించాలి అని అన్నారు.

No comments:

Post a Comment