Monday, September 13, 2021

థర్డ్ వేవ్ అవకాశాలు తక్కువే.. ఐసీఎంఆర్ సైంటిస్ట్ కీలక వ్యాఖ్యలు..!

హైదరాబాద్ : 13/09/2021

థర్డ్ వేవ్ అవకాశాలు తక్కువే.. ఐసీఎంఆర్ సైంటిస్ట్ కీలక వ్యాఖ్యలు..!

థర్డ్ వేవ్ అవకాశాలు తక్కువే.. ఐసీఎంఆర్ సైంటిస్ట్ కీలక వ్యాఖ్యలు..!

!! తొలివెలుగు మీడియా ట్విట్టర్ సౌజన్యంతో !!


కరోనా భారత్ లో ఎంతటి కష్టాన్ని కలిగించిందో అందరికీ తెలుసు. ముఖ్యంగా సెకెండ్ వేవ్ లో దేశం అతలాకుతలమైంది. ఈ క్రమంలోనే త్వరలో థర్డ్ వేవ్ ఉంటుందనే ఆందోళన అందరిలోనూ ఉంది. అయితే.. మూడో వేవ్ అవకాశాలు చాలా తక్కువేనని అంటున్నారు ఐసీఎంఆర్ సైంటిస్ట్ డాక్టర్ రమణ్ గంగాఖేడ్కర్. తాజాగా ఓ జాతీయ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

థర్డ్ వేవ్ వచ్చే ఛాన్స్ తక్కువేనని చెప్పుకొచ్చారు రమణ్ గంగాఖేడ్కర్. అయితే పిల్లల్ని ఇప్పుడే స్కూళ్లకు పంపొద్దని సూచించారు. ఒకవేళ మూడో వేవ్ వచ్చినా కూడా ఇంతకుముందులా అంత ప్రభావం ఉండకపోవచ్చని చెప్పుకొచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో స్కూళ్లు తెర‌వ‌క‌పోవ‌డమే మంచిదని అభిప్రాయపడ్డారు. తప్పని పరిస్థితుల్లో ఓపెన్ చేస్తే మాత్రం ఎక్కువమంది ఉండకుండా రోజుమార్చి రోజు విధానాలు పాటిస్తే మంచిదని సూచించారు.

నాలుగో సేరో స‌ర్వే ప్ర‌కారం… మూడింట రెండు వంతుల మందిలో యాంటీబాడీస్ అభివృద్ధి చెందిన‌ట్లు తేలిందని.. అంతేకాకుండా వ్యాక్సిన్ వల్ల కరోనా నుంచి తప్పించుకునే ఛాన్స్ ఉందని వివరించారాయన. చిన్నారుల‌కు కరోనా సోకినా.. వారిలో రోగ నిరోధ‌క శ‌క్తి ఎక్కువ‌గా ఉండ‌టం వ‌ల్ల పెద్దగా ప్రమాదం ఉండదని చెప్పారు. అయినా రిస్క్ తీసుకోవడం మంచిది కాదని.. జాగ్ర‌త్త‌లు పాటించాలన్నారు రమణ్ గంగాఖేడ్కర్.

No comments:

Post a Comment