Friday, September 17, 2021

సినీ హీరోయిన్ల‌తో కేటీఆర్‌కు సంబంధాలు.. కాంగ్రెస్ లీడ‌ర్ సెన్సేష‌న‌ల్ కామెంట్స్

హైదరాబాద్ : 17/09/2021

సినీ హీరోయిన్ల‌తో కేటీఆర్‌కు సంబంధాలు.. కాంగ్రెస్ లీడ‌ర్ సెన్సేష‌న‌ల్ కామెంట్స్

!! తొలివెలుగు మీడియా ట్విట్టర్ సౌజన్యంతో !!

మంత్రి కేటీఆర్‌పై ఐఏసీసీ మెంబ‌ర్ బ‌క్క జడ్సన్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. సినీ హీరోయిన్ల‌తో ఆయ‌న‌కు సంబంధాలు ఉన్నాయ‌ని వ్యాఖ్యానించారు. అందుకు త‌న వ‌ద్ద ఆధారాలు కూడా ఉన్నాయ‌ని బాంబ్ పేల్చారు. రాష్ట్రంలో ప్ర‌స్తుతం విచార‌ణ జ‌రుగుతున్న‌ డ్రగ్స్ కేసులో రాజకీయ నేత‌ల ప్ర‌మేయం ఉంద‌ని ఆరోపించిన ఆయ‌న‌.. ముఖ్యంగా కేటీఆర్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. గ‌తంలో డ్ర‌గ్స్ కేసు విచార‌ణ‌ను కేటీఆర్ ప్ర‌భావితం చేశార‌ని… ఆయ‌న అడ్డుకోకుంటే 2017 లోనే అది కొలిక్కి వచ్చేదని చెప్పారు. ఇదే విష‌య‌మై తాజాగా ఈడీకి ఫిర్యాదు చేసిన‌ట్టుగా బ‌క్క జ‌డ్స‌న్ వెల్ల‌డించారు.

దిశ కేసు, సైదాబాద్ సింగరేణి కాలనీ చిన్నారి లాంటి ఘటనలు మద్యం, గంజాయి మత్తులోనే జరిగాయని ఆరోపించారు బ‌క్క జ‌డ్స‌న్. సినీ హీరోయిన్లతో కేటీఆర్‌కు సంబంధాల‌పై.. ఈడీకి కొన్ని ఆధారాలు కూడా స‌మ‌ర్పించిన‌ట్టుగా వెల్ల‌డించారు. ఎక్సైజ్ శాఖ‌తో కేసును క్లోజ్ చేయించిన‌ట్టే.. ఈడీ కేసును కూడా ఆపేందుకు కేటీఆర్ పైరవీలు చేస్తున్నట్టు తెలిసిందని ఆయ‌న ఆరోపించారు. సినీ ప్రముఖులను విచారించిన‌ట్టే మంత్రి కేటీఆర్‌నూ విచారించాల‌ని కోరారు.త్వరలోనే విచారణ చేస్తామ‌ని ఈడీ హామీ ఇచ్చిన‌ట్టుగా వివ‌రించారు. బ‌క్క జ‌డ్స‌న్‌తో పాటు ఫిర్యాదు చేసిన వారిలో రాష్ట్ర యూత్ కాంగ్రెస్ కార్యదర్శి కందుకూరి హరీష్ వ‌ర్ధ‌న్ ఉన్నారు.


No comments:

Post a Comment