బిగ్ బాస్ ను బ్యాన్ చేయాలి- నారాయణ

!! తొలివెలుగు మీడియా ట్విట్టర్ సౌజన్యంతో !!
ఈమధ్యే గ్రాండ్ గా బిగ్ బాస్ సీజన్ 5 ప్రారంభమైంది. అయితే ఈ షోపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ. దీనివల్ల ఎవరికైనా ఉపయోగం ఉందా అని ప్రశ్నించారాయన. సమాజంలో విష సంస్కృతిని పెంచేలా ఇది ఉందని విమర్శించారు.
బిగ్ బాస్ షోను వెంటనే నిషేధించాలని డిమాండ్ చేశారు నారాయణ. వందల కోట్ల రూపాయల వ్యాపారం కోసం ఇలాంటి షోలను ప్రోత్సహించకూడదని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అసలు ఎలా అనుమతి ఇస్తున్నాయని ప్రశ్నించారు. బిగ్ బాస్ షోను ఆపాలని కోర్టుకు వెళ్లినా, పోలీసులను కలిసినా ఉపయోగం ఉండడం లేదని వివరించారు.
No comments:
Post a Comment