Thursday, September 16, 2021

సైదాబాద్ అత్యాచారం కేసు: ‘ఉరకమని చెప్పి పోలీసులే నా కొడుకును చంపేశారు’ - నిందితుడు రాజు తల్లి

హైదరాబాద్ : 16/09/2021

సైదాబాద్ అత్యాచారం కేసు: ‘ఉరకమని చెప్పి పోలీసులే నా కొడుకును చంపేశారు’ -నిందితుడు రాజు తల్లి


పల్లంకొండ రాజు

!! BBC తెలుగు మీడియా ట్విట్టర్ సౌజన్యంతో !!

ఫొటో సోర్స్,TELANGANA POLICE

ఫొటో క్యాప్షన్,

ఆరోపణలు ఎదుర్కొంటున్న పల్లంకొండ రాజు

సైదాబాద్‌లో ఆరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య ఘటనలో నిందితుడు పల్లంకొండ రాజు రైలు పట్టాలపై శవమై కనిపించాడు.

అతడి మృతదేహాన్ని రైలు పట్టాలపై గుర్తించినట్లు జనగామ పోలీసులు ‘బీబీసీ’కి తెలిపారు.

చేతిపై మౌనిక అని ఉన్న పచ్చబొట్టు, ఇతర గుర్తుల ఆధారంగా మృతదేహం ఆయనదేనని తేల్చినట్లు చెప్పారు.

''స్టేషన్ ఘన్‌పూర్ సమీపంలోని నాష్కల్ రైల్వే ట్రాక్‌పై రాజు మృతదేహాన్ని గురువారం ఉదయం గుర్తించాం. మృతదేహంపై ఉన్న ఆనవాళ్లు, అతడి చేతిపై ఉన్న పచ్చబొట్టు ఆధారంగా అది రాజుదేనని ధ్రువీకరించుకున్నాం''అని పోలీసులు బీబీసీతో చెప్పారు.

రాజు కుటుంబ సభ్యులకు కూడా దీనిపై సమాచారం ఇచ్చినట్లు పోలీసులు వివరించారు.

పల్లంకొండ రాజుది ఆత్మహత్యేనని వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి మీడియాకు చెప్పారు.

రైల్వే సిబ్బంది ఉదయం ట్రాక్‌ను పరిశీలిస్తున్న సమయంలో ఒక వ్యక్తి పట్టాలపై నడుస్తుండడంతో ఆయన్ను పట్టాలపై వెళ్లిపోమని వారు సూచించారని, దాంతో ఆయన పరుగులు తీశాడని.. అదే సమయంలో హైదరాబాద్ వైపు వస్తున్న కోణార్క్ ఎక్స్‌ప్రెస్ ఢీకొని మరణించాడని తరుణ్ జోషి తెలిపారు. వారి నుంచి పోలీసులకు సమాచారం అందిందని.. వెళ్లి చూడగా అది పల్లంకొండ రాజు మృతదేహమని చెప్పారు.

ప్రత్యక్ష సాక్షి ఆయన రైల్వే ఉద్యోగి చెప్పిన ప్రకారం ఇది ఆత్మహత్యేనన్నారాయన.

పోస్ట్‌ Twitter స్కిప్ చేయండి, 1

పోస్ట్ of Twitter ముగిసింది, 1

మరోవైపు మంత్రి కేటీఆర్ కూడా ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా స్పష్టంచేశారు.

''చిన్నారిపై అత్యాచారం చేసిన మృగం మృతదేహం స్టేషన్ ఘన్‌పూర్ పట్టాలపై లభించిందని తెలంగాణ డీజీపీ ఇప్పుడే చెప్పారు''అని కేటీఆర్ ట్వీట్ చేశారు.

ఫొటో సోర్స్,UGC

చెట్లలోకి పరిగెత్తాడు..

రైల్వే సిబ్బంది టీ కుమార్, సారంగపాణి ఈ ఘనకు సంబంధించి కొన్ని వివరాలు పోలీసులకు తెలిపారు.

''మేం వచ్చే సమయంలో.. ఓ వ్యక్తి చెట్లలోకి పోయాడు. మమ్మల్ని చూసి పారిపోయినట్లు అనిపించింది. వెంటనే మేం చెట్లలోకి చూశాం. కానీ ఎవరూ కనిపించలేదు. ఎవరో అనుకుని మా పని మేం చేసుకుంటూ పోయాం''అని కుమార్ చెప్పారు.

''మేం దాదాపు 200 మీటర్ల వరకు వెళ్లిపోయాం. అయితే, అక్కడ ఎవరో రైలు కింద పడ్డారని మాకు చెప్పారు. దీంతో మేం వెనక్కి వచ్చిచూశాం. హైదరాబాద్ వెళ్తున్న కోణార్క్ రైలు కింద పడటంతో 8.45 నిమిషాలకు అటూఇటూగా అతడు మరణించారు''అని ఆయన వెల్లడించారు.

ఫొటో సోర్స్,UGC

ఫొటో క్యాప్షన్,

పల్లంకొండ రాజు చేతిపై పచ్చబొట్టు

'ఉరకమని చెప్పి పోలీసులే నా కొడుకును చంపేశారు'

మరోవైపు, సైదాబాద్‌ ఆత్యాచార కేసు నిందితుడు రాజు మరణంపై అతని కుటుంబ సభ్యులు స్పందించారు.

రాజుది ఆత్మహత్య కాదు, పోలీసులే చంపేశారని వారు ఆరోపించారు.

నిందితుడు రాజు తల్లి స్థానిక మీడియాతో మాట్లాడారు. ఆమె ఏమన్నారంటే..

"అడ్డగూడూరు నుంచి మమ్మల్ని శుక్రవారం తీసుకెళ్లారు. ఆరు రోజులు మమ్మల్ని పోలీస్ స్టేషన్‌లోనే ఉంచారు. రైల్వే స్టేషన్‌లో దొరికాడని ఆదివారమే అన్నారు. ఎన్‌కౌంటర్ చేయమని పై నుంచి ఆర్డర్స్ వచ్చాయని పోలీసులు ఆదివారం మాట్లాడుకుంటుంటే విన్నాము. నిన్న వచ్చి హడావుడిగా కాగితాలపై సంతకాలు పెట్టించుకున్నారు. రాత్రి పది గంటలకు మమ్మల్ని ఉప్పల్‌లో వదిలేశారు" అని నిందితుడి తల్లి చెప్పారు.

వాడు (రాజు) తప్పు చేశాడు. తప్పు చేస్తే కోర్టులో హాజరుపరచొచ్చు కదా? కోర్టు వేసిన శిక్షను అమలు చేయొచ్చు కదా? చంపడానికి వీళ్లెవరు? అని ఆమె ప్రశ్నించారు.

"ఉరకమని నా కొడుకును పోలీసులే చంపేశారు. వాళ్ల మీదే నాకు అనుమానం ఉంది. నాకు ఇంకా ఎవరి మీద అనుమానం లేదు. చనిపోయేవాడైతే అలా చనిపోతాడా.. ఉరకమని వాళ్లే చంపేశారు" అంటూ ఆమె కన్నీటిపర్యంతం అయ్యారు.

ఆమెకు అన్యాయం జరిగింది. న్యాయం చేశారు. ఇప్పుడు నా కడుపు కాలింది. నాకు న్యాయం చేయండి అని అమె అన్నారు.

ఇది పోలీసులు ఆడుతున్న నాటకం: పీఓడబ్ల్యూ నేత సంధ్య

నిందితులపై విచారణ జరగకుండానే చట్టానికి అతీతంగా చంపడమనేది పోలీసులకు అలవాటుగా మారుతోందని పీఓడబ్ల్యూ నేత సంధ్య అన్నారు.

సైదాబాద్ అత్యాచార కేసు నిందితుడు పల్లంకొండ రాజు మృతదేహం పట్టాలపై దొరకడం కూడా పోలీసులు ఆడుతున్న నాటకంలో భాగమేనని ఆమె ఆరోపించారు.

ఇది పోలీసులు చేసిన హత్యని ఆమె అన్నారు.

గతంలో కూడా వివిధ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొన్నవారిని, మావోయిస్టుల పేరుతో అమాయకులను పోలీసులు చంపిన ఘటనలు ఉన్నాయని ఆమె చెప్పారు.

నిందితులను ఎన్‌కౌంటర్ చేయడం, చంపేసి ఆత్మహత్యలుగా చిత్రీకరించడం వల్ల ఇలాంటి సమస్యల పరిష్కారం కావని ఆమె అభిప్రాయపడ్డారు.

నిందితులకూ హక్కులు ఉంటాయని.. దర్యాప్తు, విచారణ జరిగి దోషులని తేలితే చట్టబద్ధంగా శిక్షలు వేయాలని.. అంతేకానీ, ఇలాంటి ఎక్స్‌ట్రా జ్యుడిషియల్ కిల్లింగ్స్‌కి పాల్పడడం హక్కుల ఉల్లంఘనేనని ఆమె అన్నారు.

ప్రజాప్రతినిధులు బాధ్యతారహితంగా, చట్ట వ్యతిరేకమైన ప్రకటనలు చేస్తున్నారని సంధ్య అన్నారు. తెలంగాణ మంత్రి మల్లారెడ్డి, తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్, ఎంపీ అయిన రేవంత్ రెడ్డి వంటి వారు చేసిన ప్రకటనల నేపథ్యంలో సంధ్య, మరికొందరు హక్కుల సంఘాల నేతలు బుధవారమే తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు ఒక వినతిపత్రాన్ని సమర్పించారు.

‘‘ఎన్‌కౌంటర్‌ చేస్తాం" అని మంత్రి మల్లారెడ్డి, "దిశా కేసు తరహాలో న్యాయం జరగాలని" రేవంత్ రెడ్డి అనడాన్ని వారు న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు.

ప్రభుత్వంలో, శాసన వ్యవస్థలో భాగమైన ఇలాంటివారి మాటలు పోలీసులు చట్టపరమైన శిక్షకు అతీతులనే భావాన్ని ప్రేరేపించేలా ఉన్నాయన్నారు.

వారం రోజులుగా గాలింపు

సెప్టెంబర్‌ 9న హైదరాబాద్‌లోని సింగరేణి కాలనీలో తోటిపిల్లలతో కలసి ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారికి చాక్లెట్‌ ఆశ చూపి తీసుకెళ్లి నిందితుడు రాజు అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నాడు.

రాజు కోసం పోలీసులు తీవ్రంగా గాలించారు. అతడి ఆచూకీ చెప్పిన వారికి రూ.10 లక్షల రివార్డు ఇస్తామని కూడా పోలీసులు ప్రకటించారు.

మొత్తంగా పోలీసులు 15 బృందాలుగా విడిపోయి అతడి కోసం గాలింపు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

ఈ ఘటన జరిగి వారం కావొస్తున్నా నిందితుడిని ఇంకా పట్టుకోకపోవడంపై బాధిత కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.

అత్యాచారానికి గురైన ఆరేళ్ల చిన్నారి కుటుంబాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా పరామర్శించారు.

No comments:

Post a Comment