- మురళీధరన్ కాశీవిశ్వనాథన్
- బీబీసీ ప్రతినిధి
దేశవ్యాప్తంగా కులాలు, మతాల ఆధారంగా రిజర్వేషన్ల పెంపుపై డిమాండ్‌లు వినిపిస్తున్న సమయంలో తమిళనాడు ప్రభుత్వం ఉద్యోగాల్లో మహిళలకు రిజర్వేషన్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
సర్కారీ కొలువుల్లో ప్రస్తుతం మహిళలకున్న 30% రిజర్వేషన్లను 40 శాతానికి పెంచుతూ స్టాలిన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
అయితే, ఈ నిర్ణయం వల్ల తాము పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు కోల్పోతామని పురుషులు వాదిస్తున్నారు.
మరి ఇది ఎంత వరకు నిజం?
సెప్టెంబర్ 13న తమిళనాడు ఆర్థిక, మానవ వనరుల శాఖ మంత్రి పళనివేల్ త్యాగరాజన్ మహిళలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లను 40 శాతానికి పెంచుతున్నట్లు అసెంబ్లీలో ప్రకటించారు.
ఇది ప్రభుత్వ కొలువుల్లో పని చేసే మహిళల సంఖ్యను పెంచే నిర్ణయం కాబట్టి అనేక రంగాల ప్రజలు ఈ చర్యను స్వాగతించారు. 1989లో కరుణానిధి హయాంలో ప్రభుత్వ ఉద్యోగాలలో మహిళలకు 30% రిజర్వేషన్ ప్రకటించారు. ఇప్పుడు దాన్ని మరో 10% పెంచారు.
ప్రస్తుత పరిస్థితుల్లో మహిళలకు ఈ రకమైన రిజర్వేషన్లు అత్యవసరమని ది అసోసియేషన్ ఆఫ్ బ్యాక్‌వర్డ్ క్లాస్ వర్కర్స్ ఆఫ్ ఇండియా జనరల్ సెక్రటరీ కరుణానిధి అన్నారు.
కానీ ఈ నిర్ణయాన్ని పురుషులు వ్యతిరేకిస్తున్నారు. దీనివల్ల తమకు అవకాశాలు దెబ్బతింటాయని వాదిస్తున్నారు.
తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ రికార్డుల ప్రకారం గ్రూప్-1, గ్రూప్-2 వంటి పరీక్షలలో మహిళల ఉత్తీర్ణత శాతం చాలా ఎక్కువ. గ్రూప్-1లో మహిళలు 75%, గ్రూప్-2లో 60%మంది ఉత్తీర్ణత సాధిస్తున్నారు.
గ్రూప్-4 వంటి తక్కువ గ్రేడ్ పరీక్షలలోనే ఎక్కువ మంది (దాదాపు 45%) పురుషులు ఉత్తీర్ణులవుతారు. కాబట్టి రిజర్వేషన్‌ను చెరిసగానికి (50-50) మార్చవచ్చని కొంతమంది అభిప్రాయపడ్డారు.
తమిళనాడు మానవ వనరుల శాఖ పాలసీ డాక్యుమెంట్ గణాంకాలు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయి. 30% రిజర్వేషన్ ఉన్న సమయంలో కూడా తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగాల్లో ఎక్కువమంది మహిళలు ఉద్యోగాలు సాధించారు.
కానీ, కరుణానిధి లాంటి ఉద్యోగ పరీక్షల శిక్షకులు దీనితో విభేదిస్తున్నారు.
"మొదటిసారి రిజర్వేషన్ ఇచ్చినప్పుడు, అగ్రవర్ణాల వారు అవకాశాలు కోల్పోవడం గురించి ఇదే విధంగా గొడవ చేశారు. ఇప్పుడు పురుషులు అదే చెబుతున్నారు. మహిళలు అన్ని పరీక్షలలో ఎక్కువ స్కోర్లు పొందుతారు కాబట్టి సహజంగానే వారికి ఎక్కువ సీట్లు వస్తాయి. ఇందులో తప్పేమీ లేదు" అని ఆయన చెప్పారు.
గత రెండు మూడేళ్లుగా ఉద్యోగాల్లో రిజర్వేషన్ల గురించి వివాదాలు చెలరేగుతున్నాయని శంకర్ ఐఏఎస్ అకాడమీకి చెందిన శివబాలన్ అన్నారు.
''ప్రభుత్వ ఉద్యోగాల్లో స్త్రీ, పురుష నిష్పత్తికి సంబంధించిన పూర్తి వివరాలను ప్రభుత్వం తక్షణం విడుదల చేయాలి. అలాగే రిజర్వేషన్లు పెంచితే ఎంతమంది మహిళలు పెరుగుతారో వివరించాలి. వాళ్లు అలా వివరించడం లేదు కాబట్టే వ్యతిరేకత వస్తోంది. 1989 నుంచి రిజర్వేషన్లు ఉన్నా, ఇప్పటికీ ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండే మహిల సంఖ్య 50 శాతానికి చేరలేదు. అది జరిగినప్పుడే ఫిఫ్టీ-ఫిఫ్టీ ఎంప్లాయ్‌మెంట్ గురించి ఆలోచించాలి'' అన్నారు శివబాలన్.
1929 ఫిబ్రవరిలో చెంగల్పట్టు ఆత్మగౌరవ సదస్సు సందర్భంగా పెరియార్ రామస్వామి నాయకర్ ఒక తీర్మానాన్ని ప్రతిపాదించారు. మహిళలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 50%, ప్రభుత్వ టీచర్ ఉద్యోగాల్లో 100% రిజర్వేషన్లు కల్పించాలని రామస్వామి నాయకర్ అన్నారు.
"తమిళనాడు ప్రభుత్వ తాజా ప్రకటన రామస్వామి నాయకర్ తీర్మానానికి దగ్గరగా ఉంది. స్కూల్ ఫైనల్స్‌తో సహా అన్ని పరీక్షల్లోనూ సహజంగా అమ్మాయిలు ఎక్కువ మార్కులు పొందుతారు. వారు తమ పట్టుదల, తెలివి తేటలతో ఎక్కువ మార్కులు సాధించి సహజంగానే ఎక్కువ స్థానాలు పొందుతారు. దీన్ని మనం ఎలా తప్పుబట్టగలం. దాని కోసం రిజర్వేషన్లను వ్యతిరేకించలేం" అని శివబాలన్ అన్నారు.
కానీ ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న పురుష అభ్యర్ధులు మాత్రం, సర్కారు నిర్ణయం తమను షాక్‌కు గురి చేసిందని అన్నారు
No comments:
Post a Comment