అత్యాచారయత్న ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడికి బెయిల్ ఇచ్చే క్రమంలో బిహార్ కోర్టు విచిత్రమైన షరతు పెట్టింది. తన గ్రామంలోని స్త్రీల దుస్తులని ఆరునెలల పాటు ఉచితంగా ఉతికి, ఇస్త్రీ చేయాలని ఆదేశించింది. అందుకు అయ్యే ఖర్చును కూడా అతడే భరించాలని వెల్లడించింది.
బిహార్‌లోని మజోర్ గ్రామానికి చెందిన లాలన్ కుమార్ చాకలి వృత్తిలో కొనసాగుతున్నాడు. గత ఏప్రిల్ నెలలో ఓ మహిళపై అత్యాచారయత్నం చేసిన కేసులో అరెస్ట్ అయ్యాడు. బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ వేయగా.. ఈ వింత నిబంధన పెట్టింది. మజోర్ గ్రామంలో 2 వేల మంది మహిళలు ఉన్నారు. కోర్టు తీర్పు పట్ల వారంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి తీర్పు చరిత్రలోనే మొదటిసారి అని, ఈచర్యతో నిందితుడిలో పరివర్తన వస్తుందని భావిస్తున్నట్టు చెప్పారు. ఇలాంటి తీర్పులతో… మహిళలపై జరిగే నేరాల గురించి విస్తృత చర్చ జరుగుతుందని అభిప్రాయపడ్డారు. బిహార్ కోర్టు తీర్పు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
నిందితుడు ఆ పనిచేసినట్టుగా 6 నెలల తర్వాత గ్రామ సర్పంచ్ ధ్రువీకరించాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే ఈ తీర్పునచ్చిన ఝంజీర్‌పూర్ ఏడీజే ఉన్న అవినాష్ కుమార్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి. గతంలోనూ ఆయన ఇలాంటి విచిత్రమైన తీర్పులు ఇచ్చి వార్తల్లోకెక్కారు.
No comments:
Post a Comment