పాఠశాలలు తెరవాలా వద్దా అని రాష్ట్రాలే నిర్ణయించుకోవాలి – సుప్రీం కోర్ట్
!! MyindiaMedia ట్విట్టర్ సౌజన్యంతో !!
పాఠశాలల పున:ప్రారంభం విషయంలో జోక్యం చేసుకోబోమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. పాఠశాలలను ప్రారంభించాలా వద్దా అనేది రాష్ట్రాలు నిర్ణయించుకోవాలని స్పష్టం చేసింది. కరోనా ఇంకా తగ్గుముఖం పట్టని సందర్భంలో పాఠశాలలు తెరవాలని పిల్లలు విధిగా తరగతులకు హాజరవ్వాయని రాష్ట్రాలను ఆదేశించలేమని అంది. ఓ విద్యార్థి దాఖలు చేసిన పిటిషన్ ను స్వీకరించిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.
‘పలు రాష్ట్రాల్లో పలురకాలుగా కరోనాపరిస్థితులు ఉన్నాయి. రాష్ట్ర పరిమాణం, జనసాంద్రతకు అనుగుణంగా అవి మారొచ్చు. కేసులు ఎక్కడ ఎక్కువగా ఉన్నాయి.. ఎలా నడుచుకోవాలని అనేది రాష్ట్రాల నిర్ణయం. అంతిమంగా ప్రభుత్వాలు నిర్ణయం తీసుకునేలా వదిలేయడం ఉత్తమం’ అని జస్టిస్ చంద్రచూడ్ పేర్కొన్నారు.
అదే సమయంలో …పాఠశాలలు తెరిస్తే…పిల్లలు వైరస్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అయితే విద్యార్థిని తిరిగి పాఠశాలకు తీసుకొచ్చే బాధ్యత, ఈ విషయంలో జవాబుదారీతనం అంతిమంగా ప్రభుత్వానిదేనని గుర్తు చేశారు. పిటిషన్ కు సూచనాత్మక హెచ్చరికలు చేసిన న్యాయమూర్తులు…తమ వాదనలకు మద్దతిచ్చేలా తక్కువ లేదా అసలు డేటా లేకుండా ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేయడం కంటే ..తన చదువుపై దృష్టి పెట్టాలని హితవు పలికారు
No comments:
Post a Comment