Thursday, September 23, 2021

కుల వివక్ష: రెండేళ్ల దళిత బాలుడు ఆలయంలోకి వచ్చాడని తండ్రికి రూ. 25 వేల జరిమానా

జాతీయ వార్తలు : 24/09/2021

కుల వివక్ష: రెండేళ్ల దళిత బాలుడు ఆలయంలోకి వచ్చాడని తండ్రికి రూ. 25 వేల జరిమానా

  • ఇమ్రాన్ ఖురేషి
  • బీబీసీ కోసం
!! BBC News తెలుగు ట్విట్టర్ సౌజన్యంతో !!
ఆలయం

ఫొటో సోర్స్,GETTY IMAGES

'దళిత బాలుడు ఆలయ ప్రవేశంతో మైల అంటుకున్నది ఆలయానికి కాదు, మన మనస్సులకు'

కర్ణాటకలోని కొప్పల్ జిల్లా డిప్యూటీ కమిషనర్ గ్రామస్తులకు చెప్పిన మాటలు ఇవి.

ఓ దళిత చిన్నారి ఆలయంలోకి వెళ్లడంతో ఆ బాలుడి తండ్రికి అగ్రవర్ణాలవారు రూ. 25,000 జరిమానా విధించారు.

రెండేళ్ల వయసున్న కుమారుడి పుట్టినరోజు సందర్భంగా ఆలయం బయట ఉండి దేవుడిని ప్రార్థించుకుంటుండగా ఆ పసిబిడ్డ ఆలయంలోకి పరుగెత్తడమే ఆ తండ్రి చేసిన తప్పు.

ఆలయం

ఫొటో సోర్స్,GETTY IMAGES

"మేం ఆలయం బయట ప్రార్థన చేస్తున్నప్పుడు చినుకులు పడుతున్నాయి. దీంతో బాబు ఆలయంలోకి పరుగెత్తాడు. వెంటనే నేను బాబుని పట్టుకున్నాను. అయినా, సెప్టెంబర్ 11న జరిగిన బహిరంగ సమావేశంలో గ్రామ పెద్దలు నేను అభిషేకానికి, దేవాలయ శుద్ధి చేయడానికి డబ్బు చెల్లించాలని చెప్పారు. దాదాపు రూ. 25,000 నుంచి రూ. 30,000 వరకు చెల్లించాల్సి ఉంటుందని వారు నాతో చెప్పారు'' అని చిన్నారి తండ్రి చంద్రు విలేకరులతో అన్నారు.

చంద్రు పెద్ద మొత్తాన్ని చెల్లించలేకపోవడంతో తన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులతో సంప్రదింపులు జరిపారు. తరువాత కుష్టగి పోలీసులను ఆశ్రయించారు. కానీ, భయంతో అధికారికంగా ఫిర్యాదు చేయలేకపోయారు.

''గ్రామానికి వెళ్లే ముందు, ఆలయాన్ని శుభ్రం చేయడానికి జరిమానా విధించారని నేను చదివాను. అందుకే పసిపిల్లల ప్రవేశం తర్వాత మైల పడింది దేవాలయం కాదు, మన మనస్సులకు అని నేను గ్రామస్తులతో చెప్పాను'' అని కొప్పల్ డిప్యూటీ కమిషనర్ వికాస్ కిషోర్ సురాల్కర్ బీబీసీ హిందీకి చెప్పారు.

"బాధితులు ఫిర్యాదు చేయడానికి వెనుకాడినా.. తాలూకా సాంఘిక సంక్షేమ అధికారి ఈ ఘటనపై ఫిర్యాదు చేశారు. ఆలయ కమిటీ సభ్యులుగా ఉన్న ఐదుగురిని మేం అరెస్టు చేశాం" అని సురాల్కర్ తెలిపారు.

వీడియో క్యాప్షన్,

అంబేడ్కర్ రిజర్వేషన్లు పదేళ్లే ఉండాలని కోరుకున్నారా?

మియాపూర్ గ్రామంలో సుమారు 450 కుటుంబాలు నివసిస్తున్నాయి. అందులో 20 శాతం దళిత కుటుంబాలున్నాయి.

"మిగిలిన వారందరూ వివిధ కులాలకు చెందిన వారున్నారు. వీరందరి ప్రధాన వృత్తి వ్యవసాయం" అని జిల్లా ఎస్‌పీ టీబీ శ్రీధర బీబీసీ హిందీకి చెప్పారు.

"గ్రామస్తులందరి ఆలోచనా దోరణి ఇలానే లేదు. దళితులపై ఇలాంటి చర్యలు తీసుకోవడాన్ని అగ్రవర్ణాలకు చెందిన చాలా మంది వ్యతిరేకించారు. కేవలం కొందరు మాత్రమే ఈ వైఖరితో ఉన్నారు'' అని శ్రీధర అన్నారు.

వీడియో క్యాప్షన్,

తెలంగాణ: రామోజీపేటలో ఏం జరిగింది?

నాలుగు నెలల క్రితం కొప్పల్ జిల్లాలో దళిత యువకులు హెయిర్‌ కటింగ్ చేయించుకోవడానికి సెలూన్‌కి వెళ్లారని, వారిని గ్రామం నుంచి వెలివేశారు. ఆ దుకాణం గ్రామంలోని లింగాయత్‌లకు మాత్రమే అని వారు చెప్పారు.

మియాపూర్‌లో కూడా చంద్రుకి జరిమానా విధించిన వారు లింగాయత్‌లే. కానీ, మధ్యతరగతికి చెందిన, గనిగా సామాజిక వర్గానికి చెందిన వారు.

No comments:

Post a Comment