Wednesday, September 8, 2021

కరోనాపై హైకోర్టులో విచారణ.. ప్రభుత్వానికి వారం రోజుల డెడ్ లైన్..

హైదరాబాద్ : 08/09/2021

కరోనాపై హైకోర్టులో విచారణ.. ప్రభుత్వానికి వారం రోజుల డెడ్ లైన్..

కరోనాపై హైకోర్టులో విచారణ.. ప్రభుత్వానికి వారం రోజుల డెడ్ లైన్..

!! తొలివెలుగు మీడియా ట్విట్టర్ సౌజన్యంతో !!


తెలంగాణలో కరోనా పరిస్థితులపై తాత్కాలిక సీజే జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు, జస్టిస్ టీ వినోద్ కుమార్ ధర్మాసనం హైకోర్టులో విచారణ జరిపింది. థర్డ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని డీహెచ్ కోర్టుకు తెలిపారు. అలాగే నిపుణుల సలహా కమిటీ సమావేశం ఇంకా జరగలేదని ఏజీ ప్రసాద్ వివరించారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రణాళికలు, ప్రక్రియల కోసం వైరస్ వేచి చూడదని వ్యాఖ్యానించింది. థర్డ్ వేవ్ ముంచుకొస్తోందన్న హెచ్చరికలు ఉన్నాయని తెలిపింది న్యాయస్థానం.

కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే కేసులు పెరుగుతున్నాయని… చాలామంది వైరస్ బారినపడి చనిపోయారని గుర్తు చేసింది హైకోర్టు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నత్త నడకన కాకుండా.. వేగంగా కదలాలని ఆదేశించింది. ప్రభుత్వాలు కొంతమేరకు చేస్తున్నా.. ఇంకా చేయాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది. హైకోర్టు ఆదేశించినా.. కనీసం నిపుణుల కమిటీ సమావేశం నిర్వహించలేదా అని ప్రశ్నించింది. జనగామ, కామారెడ్డి, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో కరోనా 1 శాతానికి మించి ఉందని ప్రస్తావించిన హైకోర్టు.. ఆర్టీపీసీఆర్ పరీక్షల పాజిటివిటీ రేటు సమర్పించాలని ఆదేశించింది.

వారం రోజుల్లో థర్డ్ వేవ్ ను ఎదుర్కొనే ప్రణాళిక రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించింది హైకోర్టు. అలాగే నిపుణుల కమిటీ సమావేశం కూడా నిర్వహించాలని స్పష్టం చేసింది. చిన్నారుల చికిత్సకు అవసరమైన పడకలు, ఇతర వసతుల వివరాలు సమర్పించాలని తెలిపింది. తమ ఆదేశాలు అమలు కాకపోతే డీహెచ్, కేంద్ర ప్రభుత్వ నోడల్ అధికారి కోర్టుకు రావాలని.. ఎందుకు అమలు కాలేదో వివరణ ఇవ్వాల్సి ఉంటుందని చెప్పింది. తదుపరి విచారణను ఈనెల 22కి వాయిదా వేసింది న్యాయస్థానం.

No comments:

Post a Comment