సర్కారును నిలదీసిన ఆ అధికారి బదిలీ
!! తొలివెలుగు మీడియా ట్విట్టర్ సౌజన్యంతో !!
తెలంగాణ ప్రభుత్వం విద్యావిధానంలో అనుసరిస్తున్న పద్ధతి సరైంది కాదు… తెలంగాణలో స్కూల్స్ ఎప్పుడు తెరవాలి, ఎప్పుడు మూయాలి అంతా కార్పోరేట్ సంస్థల చేతుల్లో ఉంది. శ్రీచైతన్య, నారాయణ చెప్పిందే నడుస్తోంది… పిల్లలను మెకానికల్ గా మార్చేశారంటూ ఉపాధ్యాయ దినోత్సవం రోజున సూర్యాపేట జెడ్పీ సీఈవో ప్రేమ్ కరణ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలివి.
దీనిపై ప్రేమ్ కరణ్ రెడ్డి స్పందించారు. తాను తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని… తెలంగాణ స్వరాష్ట్రంలో ఏపీ కార్పోరేట్ సంస్థల రాజ్యం నడుస్తుందని ఆయన మండిపడ్డారు. తను ఉద్యోగానికి రాజీనామా చేసేందుకు అయినా సిద్ధమే అన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికలపై ఉన్న కరోనా ఎఫెక్ట్ స్కూల్స్ తెరిస్తే పిల్లలపై ఉండదా అని తాను ప్రశ్నిస్తే అందులో తప్పేముందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు
No comments:
Post a Comment