ఘనంగా జాతీయ బీసీ కమిషన్ రెండో వార్షికోత్సవం
!! Q న్యూస్ మీడియా సౌజన్యంతో !!
హైదరాబాద్: జాతీయ బీసీ కమిషన్ ఏర్పాటు జరిగి రెండు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్ లోని విశ్వేశ్వరయ్య భవన్ లో రెండో వార్షికోత్సవ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి మాట్లాడుతూ... రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల కులాలకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని దాదాపుగా కొన్ని వందల మంది వారి వారి సమస్యలను తెలుపుతూ కమిషన్ ఆశ్రయించారన్నారు. కొన్ని పేపర్ స్టేట్మెంట్ లో వచ్చినటువంటి సంచలన విషయాలను సైతం సుమోటోగా స్వీకరించి కమిషన్ వాటి పరిష్కారం దిశగా అడుగులు వేస్తుందని ప్రజలకు కమిషన్ ద్వారా ఎంతో ఉపశమనం కలుగుతుందన్నారు. కేవలం ఈ రెండు సంవత్సరాల కాలంలో అనేక మంది ప్రజలు వారి వారి సమస్యలను తెలుపుతూ కమిషన్ను ఆశ్రయించిన ఉన్న పరిస్థితిని చూస్తే చాలా జాలి వేస్తుందని ఆయన అన్నారు. కొన్ని రాష్ట్రాల్లో రాష్ట్ర బీసీ కమిషన్ లేవని అక్కడ కూడా జాతీయ బీసీ కమిషన్ చొరవతో రాష్ట్రాల్లో కూడా కమీషన్ను ఏర్పాటు చేశారని ఆయన తెలిపారు. ఇక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కమిషన్ సభ్యులు ఆచార్య వల్ల ఎంతో ఉపశమనం కలుగుతుందని ఏ అధికారి అయినా కమిషన్ ఆదేశాలను పాటించకపోతే ఖచ్చితమైన చర్యలు ఉంటాయన్నారు. ప్రతి అధికారి కచ్చితంగా అన్ని కమిషన్ల ఆదేశాలను పాటించాలని హెచ్చరించారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ సైతం కమిషన్ లో ఆచార్య పాత్రను ప్రశంసించారు. నేడు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అండగా జాతీయ బీసీ కమిషన్ ఉందని ఎటువంటి పరిస్థితులనైనా కమిషన్ చొరవతో పరిష్కరించే అవకాశం మెండుగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అలాగే పుదుచ్చేరి గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్ర టూరిజం, కల్చర్ డెవలప్మెంట్ శాఖామాత్యులు జి.కిషన్ రెడ్డి జాతీయ బీసీ కమీషన్ చైర్మన్ భగవన్ లాల్ సహాని, NCBC లీగల్ అడ్వయిసర్ ఆనంద్ కుమార్ పాల్గొన్నారు.
No comments:
Post a Comment