కేవలం చదువు పైనే కాకుండా కొత్త పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించారు చర్యలు తీసుకోవాలని ప్రతి ఇంజనీరింగ్ కాలేజీలో ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. కొత్త పారిశ్రామికవేత్తలు రావడం వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయని కూడా చెప్పుకొచ్చారు. మొత్తంమీద చూసుకుంటే విద్యావ్యవస్థలో సీఎం జగన్ తాజాగా తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తులో ప్రజలకు ఎంతగానో ఉపయోగపడతాయని పద్మశ్రీ అవార్డు గ్రహీత బివిఆర్ మోహన్ రెడ్డి విజయవాడ వాణిజ్య ఉత్సవ కార్యక్రమంలో కొనియాడారు. జగన్ అధికారంలోకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చదువు ఏ కుటుంబానికి భారం కాకూడదని అనేక పథకాలతో.. విద్యార్థులకు ప్రోత్సాహాలు అందిస్తూ వస్తున్నారు.
అంత మాత్రమే కాక స్కూల్ దశ నుండే ఇంగ్లీష్ మీడియం.. అమలులోకి తీసుకు వచ్చి ప్రపంచంతో పోటీ పడేలా చిన్ననాటినుండే.. విద్యా విధానంలో అనేక సంస్కరణలు తీసుకురావడం జరిగింది. ఒక చదువు విషయంలో మాత్రమే కాక భోజనం విషయంలో కూడా జగన్ అన్న గోరుముద్ద అనే కార్యక్రమంతో పిల్లలకు.. మంచి పౌష్టికాహారాన్ని కూడా జగన్ ప్రభుత్వం అందిస్తుంది. ఈ రీతిగా సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి.. విద్యా వ్యవస్థలో తీసుకున్న నిర్ణయాలు.. ప్రముఖులను ఆకర్షించటం మాత్రమే కాక దేశంలో ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ కార్యక్రమాలు చేపట్టేలా విజయవంతంగా ఏపీలో విద్యావ్యవస్థను.. జగన్ మార్చడం జరిగింది.
No comments:
Post a Comment