ప్రచార యావ… నవ్వుల పాలవుతున్న కేటీఆర్
!! తొలివెలుగు మీడియా ట్విట్టర్ సౌజన్యంతో !!
ట్విట్టర్ పిట్టగా ప్రతిపక్షాల విమర్శలు ఎదుర్కొంటున్న మంత్రి కేటీఆర్ ప్రచార యావలో నవ్వుల పాలయ్యారు. తామే రికార్డు స్థాయిలో వ్యాక్సినేషన్ చేస్తున్నామని, రైతుల వద్దకే పొలాల్లోకి వెళ్లి మరీ ఆరోగ్య కార్యకర్తలతో వ్యాక్సిన్ ఇప్పిస్తున్నట్లు కొన్ని ఫోటోలను మంత్రి కేటీఆర్ షేర్ చేశారు.
ఖమ్మం, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ఆరోగ్య కార్యకర్తలు పొలాల్లోకి వెళ్లి రైతులకు అర్థమయ్యేలా చెప్పి వ్యాక్సిన్ ఇస్తున్నారని, తెలంగాణలో కేసీఆర్ నాయకత్వంలో వ్యవసాయ విప్లవం వచ్చేసిందని గొప్పలు కూడా చెప్పుకున్నారు.
కానీ, అంతకు రెండ్రోజుల ముందే వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఇవే ఫోటోలను షేర్ చేస్తూ… సీఎం జగన్ స్ఫూర్తితో ఆరోగ్య కార్యకర్తల అంకిత భావంతో పొలాల్లోకి వెళ్లి మరీ వ్యాక్సిన్ ఇస్తున్నారని ట్వీట్ చేశారు. వ్యాక్సిన్ ఉద్యమంలో సాగుతుందని పొగడ్తలు కురిపించారు.
కేటీఆర్ కు ప్రచార యావ ఉందని అందరికీ తెలిసిందే అని, కానీ మరీ ఇతర రాష్ట్రంలో చేస్తున్న పనులను కూడా కాపీ కొడుతూ మేమే చేశాం అని చెప్పుకోవటం దారుణమని పలువురు విమర్శిస్తున్నారు. ప్రచారం కోసం మరీ ఇంత దిగజారుతారా…? మీకు నిజంగా జనం పట్ల చిత్తశుద్ధి ఉంటే మీరు కూడా రైతుల వద్దకే వ్యాక్సిన్ పాలసీ తీసుకోని ప్రచారం చేసుకోవాలి కానీ ఇతర రాష్ట్రాల్లో తీసిన ఫోటోలను మనవి అని చెప్పటం సిగ్గనిపించటం లేదా అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ప్రచారం కోసం ఉన్న తపన… వ్యాక్సినేషన్ పై కూడా ఉంటే బాగుండు అంటూ రియాక్ట్ అవుతున్నారు.
ఇటీవల సైదాబాద్ సింగరేణి కాలనీలో 6ఏళ్ల పాప హత్యాచార ఘటనలోనూ మొదట నిందితుడు దొరికాడని చెప్పి, ఆ తర్వాత తనకు తప్పుడు సమాచారం ఇచ్చారని అందుకే అలా చెప్పానంటూ కేటీఆర్ మాట మార్చారు. ఇప్పుడు ఏపీ పనితీరును తమదేనని చిన్న సారు చేసిన ట్వీట్ పై ఏం చెప్తారో చూడాలి.
ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కేటీఆర్ పై ఫైర్ అయ్యారు. ఓకే సినిమా అన్ని థియేటర్లలో ఉన్నట్లుగా… ఒకే ఫోటోలు రెండు రాష్ట్రాల్లో చక్కర్లు కొడుతున్నాయని ట్వీట్ చేశారు. మనుషులను పోలిన మనుషులుంటారని అంటారు కానీ పొలాలను పోలిన పొలాలు కూడా ఉన్నాయా అని సెటైర్స్ వేశారు.
కేటీఆర్ ట్వీట్ పై ఎంపీ, తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మాణికం ఠాగూర్ కూడా స్పందించారు. కొడుకు ఇంకా ఎదో మూడ్ లో ఉన్నట్లున్నారు, ఏపీ సక్సెస్ ను తమదిగా చెప్పుకుంటున్నారని… ఇంకా ఇలాంటి మార్ఫ్ ఫోటోలతో ప్రజలను ఎంతకాలం మోసం చేస్తారని ప్రశ్నించారు.
No comments:
Post a Comment