డ్రగ్స్ కేసు విచారణ.. సినీ, రాజకీయ పెద్దల్లో కలవరం..!
తొలివెలుగు మీడియా ట్విట్టర్ సౌజన్యంతో!!
– టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ రూటు మార్చిందా..?
– మత్తు మ్యాటర్ లో ఈడీ చూపిస్తున్న సినిమా ఎంటి..?
– ఈడీ దర్యాప్తుతో సినీ, రాజకీయ ప్రముఖుల్లో భయమెందుకు..?
టాలీవుడ్ డ్రగ్స్ కేసు దర్యాప్తులో కొత్త విషయాలు బయటకొస్తున్నాయి. పేరుకి డ్రగ్స్ కేసు విచారణ అని చెబుతున్నా.. ఈడీ తీరు చూస్తుంటే అనేక అనుమానాలు పుట్టుకొస్తున్నాయి. పూరీ జగన్నాథ్, అతని ఆడిటర్ ని 10 గంటల పాటు విచారించారు అధికారులు. చార్మీ సైతం తన ఆడిటర్ తోనే హాజరైంది. 2015 నుంచి 2021 వరకు బ్యాంకు లావాదేవీలను పరిశీలించారు. అయితే అప్పటికే బ్యాంకుల నుంచి తెప్పించుకున్న స్టేట్ మెంట్ ని స్టడీ చేసి ఉన్నారు అధికారులు.
2017లో బయటపడ్డ ఈ మత్తు కేసు తాజాగా కెల్విన్ చుట్టూ తిరుగుతోందని అనుకున్నారు. కానీ.. విదేశాలకు నిధులు మళ్లింపు విషయంపైనే ఈడీ ఎక్కువగా ఫోకస్ పెట్టింది. ఆ దిశగానే దర్యాప్తు చేస్తోంది. ఇప్పటికే డ్రగ్స్ కేసుల్లో వివిధ రాష్ట్రాల్లో ఎన్సీబీ దర్యాప్తును పరిశీలించింది. ఎక్సైజ్ శాఖ సిట్ బృందం చేసిన దర్యాప్తులో కోర్టు నుంచి చార్జిషీట్లు తీసుకొని చూసింది. అయితే ఈడీ పరిధి కేవలం డబ్బులు, దేశ విదేశాలకు పెట్టుబడులు, పేపర్ కంపెనీలు, విదేశాల నుంచి అక్రమంగా స్వదేశానికి నిధులు రావడంపై మాత్రమే ఉంటుంది. కానీ.. మీడియా మాత్రం కేవలం డ్రగ్స్ కేసును మాత్రమే హైలెట్ చేస్తోంది.
నిజానికి డ్రగ్స్ వాడకం జరిపారని ఆరోపణలు ఉన్న సినీ ప్రముఖులు వారి సొంత అకౌంట్స్ నుంచి డబ్బులు నేరుగా విదేశాలకు పంపి ఉండకపోవచ్చు. కెల్విన్ నుంచి మరో పెడ్లర్ కి.. ఆ తర్వాత మరొకరి నుంచి విదేశాలకు వెళ్లే ఛాన్స్ ఉంది. అయితే సినిమాలు తీసిన డబ్బులు ఎక్కడ నుంచి ఎక్కడికి వెళ్లాయో తేల్చే పనిలోనే ఈడీ ఉన్నట్లు కనిపిస్తోంది. ఇదే జరిగితే సినీ, రాజకీయ ప్రముఖులు పెట్టుబడి పెట్టిన సినిమాలపై దృష్టి సారించే అవకాశాలు ఉన్నాయి. లెక్కలు చూపించని మనీ అంతా సినిమా రంగంలోకి చేరుతోందని ఎప్పటినుంచి అనుమనాలున్నాయి. వాటన్నింటినీ నిర్ధారించుకునేందుకు ఈడీకి ఇదో ఛాన్స్ గా భావించవచ్చు.
No comments:
Post a Comment