Friday, September 3, 2021

ఎఫ్‌ క్లబ్‌లో ఏం జరిగింది..?

హైదరాబాద్ : 04/09/2021

ఎఫ్‌ క్లబ్‌లో ఏం జరిగింది..?

ఎఫ్‌ క్లబ్‌లో ఏం జరిగింది..?

!!నమస్తే తెలంగాణ మీడియా ట్విట్టర్ సౌజన్యంతో!!


ఎఫ్‌ క్లబ్‌లో పార్టీలకు ఎన్ని సార్లు వెళ్లారు?
డ్రగ్స్‌ తీసుకున్నారా..?

కెల్విన్‌ మీకు పరిచయమా?..
రకుల్‌ప్రీత్‌సింగ్‌ను ప్రశ్నించిన ఈడీ అధికారులు
ఆరు గంటలపాటు కొనసాగిన విచారణ
అవసరమైతే మళ్లీ విచారణకు హాజరుకావాలని రకుల్‌కు సూచించిన ఈడీ అధికారులు

టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో ఈడీ విచారణ మూడో రోజు కొనసాగింది. శుక్రవారం నాటి విచారణకు సినీనటి రకుల్‌ప్రీత్‌సింగ్‌ హాజరయ్యారు. ఈడీ తొలుత ఇచ్చిన సమన్ల ప్రకారం రకుల్‌ విచారణ ఈనెల 6న జరగాల్సి ఉంది. అయితే తాను వ్యక్తిగత కారణాలతో 6న అందుబాటులో ఉండడం లేదని రకుల్‌ తెలియజేయడంతో ఆమె విజ్ఞప్తి మేరకు ఈడీ అధికారులు శుక్రవారమే విచారించారు. 2017లో ఎక్సైజ్‌శాఖ నమోదు చేసిన కేసులో రకుల్‌ప్రీత్‌సింగ్‌ పేరు లేదు..కానీ ఆమె హీరో నవదీప్‌కు చెందిన ఎఫ్‌-క్లబ్‌కు తరచూ వెళ్లినట్టు ఉన్న సమాచారం మేరకు ఈడీ ఆమెను విచారణకు పిలిచినట్టు తెలిసింది. ఉదయం 9-30 గంటలకు ఈడీ కార్యాలయానికి తన అడ్వొకేట్‌, చార్టెడ్‌ అకౌంటెంట్‌తో సహా వచ్చిన రకుల్‌ప్రీత్‌సింగ్‌ను ఈడీ అధికారులు దాదాపు ఆరుగంటలపాటు విచారించారు. ఈడీ అధికారులు నోటీసులలో సూచించిన ప్రకారం రకుల్‌ప్రీత్‌సింగ్‌ తన రెండు బ్యాంకు ఖాతాలకు చెందిన లావాదేవీలను సమర్పించింది. హీరో నవదీప్‌కు చెందిన ఎఫ్‌-క్లబ్‌లో 2015 నుంచి 2017 మధ్య జరిగిన పలు పార్టీలకు రకుల్‌ హాజరైనట్టు ఉన్న ప్రాథమిక సమాచారం మేరకు ఈడీ అధికారులు రకుల్‌ను పలు అంశాలపై ప్రశ్నించినట్టు తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం..ఎఫ్‌-క్లబ్‌లో అసలు ఎలాంటి పార్టీలు జరుగుతుంటాయి?..అక్కడికి వచ్చిన వారికి డ్రగ్స్‌ సరఫరా చేస్తుంటారా..? మీరెప్పుడైనా డ్రగ్స్‌ వాడారా?..డ్రగ్స్‌ సరఫరా చేసే కెల్విన్‌తో మీకు పరిచయం ఉందా?..మీరెప్పుడైనా కెల్విన్‌కు డబ్బులు పంపారా?..ఆ పార్టీల సమయంలో ఇంకెవరైనా డ్రగ్‌ పెడ్లర్లు మీకు పరిచయం అయ్యారా?..అంటూ రకుల్‌ను ఈడీ అధికారులు ప్రశ్నించినట్టు సమాచారం. అయితే తనకు కెల్విన్‌ ఎవరో తెలియదని రకుల్‌ సమాధానమిచ్చినట్టు తెలిసింది. బ్యాంక్‌ లావాదేవీలపైనా రకుల్‌తోపాటు ఆమె సీఏను సైతం ఈడీ అధికారులు వేర్వేరుగా ప్రశ్నించి వివరాలు తీసుకున్నట్టు సమాచారం. ఆరు గంటలపాటు సాగిన సుదీర్ఘ విచారణలో అనేక విషయాలు తెలుసుకున్న ఈడీ అధికారులు, అవసరమైతే మరోమారు విచారణకు హాజరుకావాల్సి ఉంటుందని రకుల్‌కు సూచించినట్టు తెలిసింది. అయితే, ఈనెల 13న విచారణకు హీరో నవదీప్‌, ఎఫ్‌-క్లబ్‌ మేనేజర్‌ను హాజరు కావాల్సిందిగా ఇప్పటికే ఈడీ సమన్లు జారీ చేసింది. వారిద్దరు విచారణకు హాజరైతేనే మరిన్ని విషయాలు వెల్లడవుతాయని ఈడీ వర్గాలు తెలిపాయి. కాగా, ఈడీ ఇప్పటికే జారీ చేసిన సమన్ల ప్రకారం తర్వాతి క్రమంలో ఈనెల 8న హీరో రానా దగ్గుబాటి ఈడీ ఎదుట విచారణకు హాజరుకావాల్సి ఉంది.

No comments:

Post a Comment