Saturday, September 25, 2021

పీవోకేను వెంట‌నే ఖాళీ చేయండి.. పాక్‌కు భార‌త్ వార్నింగ్

జాతీయ వార్తలు : 25/09/2021

పీవోకేను వెంట‌నే ఖాళీ చేయండి.. పాక్‌కు భార‌త్ వార్నింగ్

పీవోకేను వెంట‌నే ఖాళీ చేయండి.. పాక్‌కు భార‌త్ వార్నింగ్

!! తొలివెలుగు మీడియా ట్విట్టర్ సౌజన్యంతో !!

క్య‌రాజ్య స‌మితి జ‌న‌ర‌ల్ అసెంబ్లీ వేదిక‌గా పాక్ తీరును భార‌త్ క‌డిగిపారేసింది. ప‌దే ప‌దే జ‌మ్మూ- కాశ్మీర్ స‌మ‌స్య‌ను ప్ర‌పంచం ముందుపెట్టి ఆదేశం సానుభూతి పొందే ప్ర‌య‌త్నం చేస్తుండ‌టాన్ని భార‌త్‌ను గ‌ట్టిగా తిప్పికొట్టింది. పాకిస్థాన్ ఉగ్ర‌వాదుల‌ను ఎలా పెంచి పోషిస్తున్న‌ది, ఆశ్ర‌యం ఇస్తున్న‌ది, సాయం చేస్తున్న‌ది ప్ర‌పంచ దేశాల‌న్నింటికీ తెలుసు అని భారత్ ఎండ‌గ‌ట్టింది. పాకిస్థాన్ అంటేనే సాయుధ ఉగ్ర‌వాదుల‌కు నిల‌యం అని యూఎన్‌వో స‌భ్య దేశాలకు ఎప్పుడో తెలుసు అని విరుచుకుప‌డింది.

జమ్మూ కాశ్మీర్, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలు భారతదేశంలో అంతర్భాగమ‌ని, ఎప్పటికీ విడదీయలేనివి అని భార‌త ప్ర‌తినిధి నొక్కి చెప్పారు. భార‌త్ భూభాగం పాకిస్థాన్ ఆక్రమణలో ఉంద‌ని, వెంట‌నే పీవోకే నుంచి పాక్ అన్ని ప్రాంతాలను ఖాళీ చేయాల‌ని హెచ్చ‌రించింది. అంత‌కుముందు పాక్ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ వ‌ర్చువ‌ల్ మీటింగ్‌లో భార‌త్ తీరుపై అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. కాశ్మీర్‌లో మానవ హ‌క్కుల ఉల్లంఘ‌న జ‌రుగుతోంద‌ని ఆరోపిచారు. అక్క‌డ ప్ర‌జాస్వామాన్ని నెల‌కొల్పాల్సిన అవ‌స‌రం ఉంద‌ని మొస‌లి కన్నీరు కార్చారు. దీంతో భార‌త్ ధీటుగా స‌మాధానం ఇచ్చింది.

No comments:

Post a Comment