Thursday, September 2, 2021

ఆ రాష్ట్రాల్లో వందశాతం వ్యాక్సినేషన్లు…

హైదరాబాద్ : 02/09/2021

ఆ రాష్ట్రాల్లో వందశాతం వ్యాక్సినేషన్లు…

 Ntv మీడియా ట్విట్టర్ సౌజన్యంతో!!

దేశంలో వేగంగా క‌రోనా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ కొన‌సాగుతున్న‌ది.  గ‌త రెండు మూడు రోజులుగా రోజుకు కోటి వ‌ర‌కు వ్యాక్సినేష‌న్ల‌ను అందిస్తున్నారు.  ఆర్హులైన ప్ర‌తి ఒక్క‌రూ త‌ప్ప‌కుండా వ్యాక్సిన్ తీసుకోవాల‌ని ప్ర‌భుత్వం ఇప్ప‌టికే ప‌లుమార్లు హెచ్చ‌రించింది.  సెకండ్ వేవ్ నుంచి దేశం ఇంకా పూర్తిగా కోలుకోక‌పోవ‌డంతో వ్యాక్సిన్ తీసుకున్నా క‌రోనా నిబంధ‌న‌లు పాటించాల‌ని ప్ర‌భుత్వాలు హెచ్చ‌రిస్తున్నాయి.  దేశంలో వ్యాక్సిన్ కొర‌త లేద‌ని, అన్ని రాష్ట్రాల‌కు వ్యాక్సిన్ల‌ను అందిస్తున్నామ‌ని కేంద్రం ఇప్ప‌టికే స్ప‌ష్టం చేసింది.  ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో 66 కోట్ల మందికి పైగా వ్యాక్సిన్ తీసుకున్నార‌ని, ఇందులో ఆర్హులైన 16 శాతం మందికి రెండు డోసుల వ్యాక్సినేష‌న్ పూర్తికాగా, 54 శాతం మందికి మొద‌టి డోసు వ్యాక్సిన్‌ను అందించిన‌ట్టు కేంద్ర ఆరోగ్య‌శాఖ స్ప‌ష్టం చేసింది. సిక్కిం, హిమాచ‌ల్ ప్ర‌దేశ్ రాష్ట్రాల్లోనూ, దాద్రాన‌గ‌ర్ హ‌వేలీ వంటి కేంద్ర పాలిత ప్రాంతాల్లోనూ వంద‌శాతం మొద‌టి డోసు వ్యాక్సినేష‌న్ పూర్తి అయిన‌ట్టు కేంద్ర ఆరోగ్య‌శాఖ తెలియ‌జేసింది. 

No comments:

Post a Comment