Praja Sankalpam Group Media

Thursday, March 10, 2022

కులమతాల పేరుతో పంచాయతీ పెట్టే చిల్లర రాజకీయాలు చేయం.... KTR

*కులమతాల పేరుతో పంచాయతీ పెట్టే చిల్లర రాజకీయాలు చేయం.... KTR!*

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ ఒకవైపు అభివృద్ధి.. మరోవైపు సంక్షేమంతో ముందుకు సాగుతున్నారని మంత్రి కేటీఆర్ తెలిపారు. నేడు ఉప్పల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఈ క్రమంలోనే అర్హులు ఎవరికైతే పెన్షన్లు రాలేదో వారికి వచ్చే నెల నుంచి కొత్త పెన్షన్లు కూడా వస్తాయని తెలిపారు. లక్ష ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టి 70 వేల ఇళ్లను సిటీలో కట్టామన్నారు. ఐటీ అంటే ఒక్క మాదాపూర్ కాకుండా ఉప్పల్ నియోజకవర్గంలో కూడా కంపెనీలు వచ్చాయని కేటీఆర్ తెలిపారు.

కులాలు, మతాల పేరుతో పంచాయతీ పెట్టే చిల్లర రాజకీయం మనది కాదన్నారు. సీఎం కేసీఆర్ చెప్పిన ఉద్యోగాలను నమ్మబోమని వేరే పార్టీ ఎమ్మెల్యేలు అన్నారని.. కేసీఆర్ మాట నమ్మితే ఇక్కడ దరఖాస్తు పెట్టుకోవాలన్నారు. నమ్మనివారు ప్రధాని మోదీ చెప్పిన రెండు కోట్ల పకోడీ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలని కేటీఆర్ చెప్పారు.

link Media ప్రజల పక్షం🖋️ 

Posted by Bapatla Krishnamohan at 11:04 PM No comments:
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest

బీజేపీ పట్ల దేశంలో తగ్గని ఆదరణ – నిరూపించిన తాజా ఎన్నికల ఫలితాలు

బీజేపీ పట్ల దేశంలో తగ్గని ఆదరణ – నిరూపించిన తాజా ఎన్నికల ఫలితాలు

Courtesy by :  మైఇండ్ మీడియా ట్విటర్‌ March 11, 2022

భారతీయ జనతా పార్టీ పట్ల ప్రజాదరణ ఏమాత్రం తగ్గలేదని 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు నిరూపించాయి. తాజా ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లోనూ మళ్లీ కమలం వికసించింది. దేశానికి గుండెకాయ లాంటి… కీలకంగా భావించే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా సహా ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో కాషాయ పార్టీ విజయభేరి మోగించింది. అయితే మరో రాష్ట్రం పంజాబ్ ను మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ ఊడ్చేసింది.
దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన యూపీని మరోసారి కైవసం చేసుకున్న బీజేపీ పలు రికార్డులను కొల్లగొట్టింది. గతంతో పోలిస్తే కాస్త సీట్లు తగ్గినా గణనీయంగా ఓట్లు పెంచుకుంది. అంతేకాదు దాదాపు నాలుగు దశాబ్దాల్లో రెండోసారి ముఖ్యమంత్రి అయిన నాయకుడిగా నిలుస్తున్నారు యోగీ. కులమతాలకు అతీతంగా ఓటర్లు ఆ పార్టీకి పట్టం కట్టారు. ముస్లిం జనాభా అధికంగా ఉన్న ప్రాంతాల్లోనూ కాషాయ జెండా ఎగిరింది. ఉత్తరప్రదేశ్ లో యోగీ సుపరిపాలనకు మంచి మార్కులేశారని చెప్పవచ్చు ప్రజలు.
ఇక వరుసగా రెండోసారి ఒకేపార్టీ అధికారంలోకి రాదనే సెంటిమెంట్ ఉన్న ఉత్తరాఖండ్ లోనూ ఆ సెంటిమెంట్ ను తప్పుతూ బీజేపీ అధికారంచేపట్టనుంది. ముగ్గురు సీఎంలను మార్చిన పరిస్థితుల్లో పార్టీకి అధికారం కష్టమేననే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే అన్ని అంచనాలను పటాపంచలు చేస్తూ మరోసారి బీజేపీకే పాలనా పగ్గాలు కట్టబెట్టారు ఓటర్లు.

ఈశాన్య రాష్ట్రపు మణిపూస మణిపూర్ నూ నిలుపుకుంది భారతీయ జనతా పార్టీ. మరోసారి ఆ పార్టీకే పట్టంగడుతూ తీర్పు చెప్పేశారు ప్రజలు. క్రైస్తవ జనాభా అధికంగా ఉన్న రాష్ట్రంలో హిందుత్వ పార్టీగా ముద్రపడిన భారతీయ జనతా పార్టీ వరుసగా గెలవడం ఆ పార్టీకి ప్రత్యేక విజయమనే చెప్పవచ్చు.
క్రైస్తవుల జనాభా అధికంగా ఉన్న మరో రాష్ట్రం గోవాలో బీజేపీ హవా కొనసాగింది. రెండో సారీ ఆ పార్టీనే ప్రజలు ఆదరించారు.
ఇక పంజాబ్ ను మాత్రం ఆప్ ఊడ్చేసింది. నాలుగింట మూడొంతుల అద్భుత విజయాన్ని ఆ పార్టీ సొంతం చేసుకుంది. మొన్నటివరకు అధికారంలో ఉన్న హస్తం పార్టీకి అక్కడఘోర పరాభవం ఎదురైంది. మాజీ ముఖ్యమంత్రులు చన్నీ, కెప్టెన్ అమరీందర్ సింగ్, పీసీసీ చీఫ్ సిద్దూ సహా మహామహులు మట్టికరిచారు.


Posted by Bapatla Krishnamohan at 9:51 PM No comments:
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest

Tuesday, March 8, 2022

రాష్ట్రంలో ఉద్యోగాల ఖాళీలు.. శాఖలు, జిల్లాల వారీగా ......!

*రాష్ట్రంలో ఉద్యోగాల ఖాళీలు.. శాఖలు, జిల్లాల వారీగా ......!*

రాష్ట్రంలో గ్రూప్‌-1, గ్రూప్‌-2, గ్రూప్‌-4 పోస్టులను భర్తీ చేస్తున్నామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. గ్రూప్‌ల వారీగా ఖాళీల వివరాలు..
గ్రూప్‌ 1- 503 ఉద్యోగాలు
గ్రూప్‌ 2- 1,373 ఉద్యోగాలు
గ్రూప్‌ 4- 9168 పోస్టులు

క్యాడర్ వారీగా ఖాళీలు..
జిల్లాల్లాలో- 39,829
జోన్లలో- 18,866
మల్టీజోనల్‌ పోస్టులు- 13,170
సచివాలయం,హెచ్ఓడీలు, విశ్వవిద్యాయాల్లో- 8,147

జిల్లాల వారీగా ఖాళీలు..
హైదరాబాద్ – 5,268
నిజామాబాద్- 1,976
మేడ్చల్ మల్కాజ్‌గిరి- 1,769
రంగారెడ్డి- 1,561
కరీంనగర్- 1,465
నల్లగొండ- 1,398
కామారెడ్డి- 1,340
ఖమ్మం- 1,340
భద్రాద్రి కొత్తగూడెం- 1,316
నాగర్‌కర్నూల్- 1,257
సంగారెడ్డి- 1,243
మహబూబ్‌నగర్- 1,213
ఆదిలాబాద్- 1,193
సిద్దిపేట- 1,178
మహబూబాబాద్- 1,172
హనుమకొండ- 1,157
మెదక్- 1,149
జగిత్యాల- 1,063
మంచిర్యాల- 1,025
యాదాద్రి భువనగిరి- 1,010
జయశంకర్ భూపాలపల్లి- 918
నిర్మల్- 876
వరంగల్- 842
కుమ్రం భీం ఆసీఫాబాద్- 825
పెద్దపల్లి- 800
జనగాం- 760
నారాయణపేట్- 741
వికారాబాద్- 738
సూర్యాపేట- 719
ములుగు- 696
జోగులాంబ గద్వాల- 662
రాజన్న సిరిసిల్లా- 601
వనపర్తి- 556

జోన్లు, మల్టీ జోన్లవారీగా ఖాళీల వివరాలు..
జోన్‌లలో18,866 ఖాళీలు, మల్టీ జోన్‌లలో 13,170 పోస్టులు ఖాళీగా ఉన్నాయని సీఎం కేసీఆర్‌ చెప్పారు. ఇందులో జోన్లు, మల్టీ జోన్లవారీగా ఖాళీల వివరాలు..

జోన్లు..
కాళేశ్వరం జోన్‌లో- 1,630
బాసర జోన్‌- 2,328
రాజన్న జోన్‌- 2,403
భద్రాద్రి జోన్‌- 2,858
యాదాద్రి జోన్‌- 2,160
చార్మినార్ జోన్‌- 5,297
జోగులాంబ జోన్‌- 2,190

మల్టీజోన్లు..
మల్టీజోన్ 1- 6,800
మల్టీజోన్ 2- 6,370

ఏ శాఖలో ఎన్ని..
రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో 80,039 ఖాళీలు ఉన్నాయని, వాటిని నేరుగా భర్తీ చేస్తున్నామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. నియామక ప్రక్రియ నేటినుంచే ప్రారంభమవుతుందని చెప్పారు. శాఖల వారీగా ఖాళీల వివరాలు..
హోం శాఖ- 18,334
సెకండరీ ఎడ్యుకేషన్- 13,086
హెల్త్, మెడికల్, ఫ్యామిలీ వెల్ఫేర్- 12,755
హయ్యర్ ఎడ్యుకేషన్- 7,878
బీసీల సంక్షేమం- 4,311
రెవెన్యూ శాఖ- 3,560
ఎస్సీ వెల్ఫేర్‌ శాఖ- 2,879
నీటిపారుదల శాఖ- 2,692
ఎస్టీ వెల్ఫేర్- 2,399
మైనారిటీస్ వెల్ఫేర్- 1,825
ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, సైన్స్ మరియు టెక్నాలజీ- 1,598
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ- 1,455
లేబర్, ఎంప్లాయీమెంట్- 1,221
ఆర్థిక శాఖ- 1,146
మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్స్- 895
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్- 859
అగ్రికల్చర్, కో-ఆపరేషన్- 801
రవాణా, రోడ్లు, భవనాల శాఖ- 563
న్యాయశాఖ- 386
పశుపోషణ, మత్స్య విభాగం- 353
జనరల్ అడ్మినిస్ట్రేషన్- 343
ఇండస్ట్రీస్, కామర్స్- 233
యూత్ అడ్వాన్స్మెంట్, టూరిజం, కల్చర్- 184
ప్లానింగ్- 136
ఫుడ్, సివిల్ సప్లయిస్- 106
లెజిస్లేచర్- 25
ఎనర్జీ- 16
Posted by Bapatla Krishnamohan at 9:32 PM No comments:
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest

కేసీఆర్ అసెంబ్లీ ప్రకటనపై కోమటిరెడ్డి హాట్ కామెంట్స్

కేసీఆర్ అసెంబ్లీ ప్రకటనపై కోమటిరెడ్డి హాట్ కామెంట్స్

Courtesy by : తొలివెలుగు మీడియా website

నిరుద్యోగులు బుధవారం ఉదయం 10 గంటలకు టీవీ చూడాలన్నీ కేసీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. ఆయన ఏం చెప్తారా? అని రాష్ట్రమంతా ఎదురుచూస్తోందన్న ఆయన.. ఇచ్చిన హామీలు మొత్తాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పాలన్నారు.

2018 ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం నిరుద్యోగులకు రూ.3,116 భృతి ఇస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు కోమటిరెడ్డి. రాష్ట్రంలోని 40 లక్షల మంది నిరుద్యోగులు దీని కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు. 37 నెలల నిరుద్యోగుల బకాయిలను కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు.

ఇక ఖాళీగా ఉన్న 1.90 లక్షల ఉద్యోగాలకు ఒకే దఫాలో నోటిఫికేషన్ ఇస్తున్నట్లు కేసీఆర్ చెప్తారని భావిస్తున్నట్లు చెప్పారు కోమటిరెడ్డి. సమయానికి నోటిఫికేషన్లు రాక ఏజ్ లిమిట్ అయిపోయిన వారి కోసం కూడా మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు.

నిరుద్యోగుల ఆత్మహత్యలు చూస్తూనే ఉన్న కేసీఆర్.. తెలంగాణ రావడానికి యువకులు ముఖ్య కారణమన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు కోమటిరెడ్డి. బుధవారం చేసే ప్రకటన ప్రధానంగా నిరుద్యోగ సమస్యలు తొలగిపోయేలా ఉంటుందని అనుకుంటున్నామన్నారు. తాము ఆశించినట్టు సీఎం ప్రకటన చేస్తే తానే కేసీఆర్ ఫొటోకు పాలాభిషేకం చేస్తానని చెప్పారు కోమటిరెడ్డి.


Posted by Bapatla Krishnamohan at 7:32 PM No comments:
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest

నిరుద్యోగులకు కెసిఆర్ శుభవార్త రేపు 10 గంటలకు టీవీ చూడండి.....!

*నిరుద్యోగులకు కెసిఆర్  శుభవార్త రేపు 10 గంటలకు టీవీ చూడండి.....!*

వనపర్తి: అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న సమయంలో నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పనున్నారు. ఉద్యోగా భర్తీపై కీలక ప్రకటన చేయనున్నారు.నిరుద్యోగులందరూ బుధవారం ఉదయం 10 గంటలకు టీవీలు చూడాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. వనపర్తి జిల్లా పర్యటనలో సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. అసెంబ్లీ వేదికగా తాను నిరుద్యోగులకు శుభవార్త చెబుతానని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 50 వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించుకున్నారు.

ఈ మేరకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఇప్పటికే ఖాళీల వివరాలను సీఎం కేసీఆర్‌కు చీఫ్ సెక్రటరీ అందజేశారు. మరో 30 వేల ఖాళీలను కూడా భర్తీ చేయునున్నట్లు అసెంబ్లీలో కేసీఆర్ చెప్పనున్నారు. ఇక ఖాళీల భర్తీ కోసం 4 వేల కోట్లు ఖర్చు పెడుతున్నట్లు ఆర్థిక శాఖ ప్రకటించింది. దీంతో నిరుద్యోగుల్లో ఆసక్తి పెరిగింది. కేసీఆర్ ప్రకటన ఎలా ఉండబోతోందని ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

*link Media ప్రజల పక్షం🖋️

Posted by Bapatla Krishnamohan at 5:40 AM No comments:
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest

Monday, March 7, 2022

అంతర్జాతీయ మహిళా దినోత్సవం - మన కర్తవ్యం

అంతర్జాతీయ మహిళా దినోత్సవం - మన కర్తవ్యం 

Courtesy by : నవతెలంగాణ మీడియా (ఎస్ వి రమ)

సుమారు వంద సంవత్సరాల క్రితం ఎనిమిది గంటల పని, సమాన వేతనం, ఓటు హక్కు మొదలైన డిమాండ్ల కోసం శ్రామిక మహిళలు పోరాటాలు చేశారు. దానికి గుర్తుగా మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఏర్పడింది. ఆ పోరాట వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలి. కానీ అలాంటి చారిత్రాత్మక ఘటనలు సాధారణ వ్యవహారాలుగా మిగిలిపోతుండటం నేటి విషాదం. ఆ ఉద్యమాల చరిత్రను మరుగున పడేసి వాటి స్థానాల్లో వేడుకలను నిర్వహిస్తున్నారు. లాభాలను తెచ్చిపెట్టే మార్కెట్‌ ప్రేరేపిత ప్రాజెక్ట్‌లుగా మార్చివేస్తున్నారు. ఇలాంటి ఘటనల వెనుకవున్న చరిత్రను మరుగుపరుస్తున్నారు.


Posted by Bapatla Krishnamohan at 7:56 PM No comments:
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest

Sunday, March 6, 2022

దొర రాజ్యంలో మరో న్యాయవాదిపై దాడి

దొర రాజ్యంలో మరో న్యాయవాదిపై దాడి


Courtesy by : తొలివెలుగు మీడియా website 

టీఆర్ఎస్ పాలనలో న్యాయవాదులకు సైతం రక్షణ లేకుండా పోయింది. వామనరావు దంపతులను నడిరోడ్డుపై హత్య చేసి చంపేసి ఏడాది అయినా ఇంకా ఆనాటి ఘటన కళ్లముందే మెదులుతుండగా.. ఈమధ్యే లేడీ లాయర్ పై కోర్టులోనే దాడి జరిగింది. తాజాగా మరో న్యాయవాదిపై దాడికి పాల్పడ్డారు టీఆర్ఎస్ నాయకులు.

వివరాల్లోకి వెళ్తే… రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో రోడ్డు వెడల్పులో భాగం కొందరు ఇళ్లు కోల్పోయారు. అయితే.. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అంబేద్కర్ చౌరస్తాలో జరిగిన మహిళా బంధు కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలు అక్కడకు వెళ్లి ఎమ్మెల్యేను నిలదీశాయి.
తమ ఎమ్మెల్యేనే నిలదీస్తారా? అంటూ టీఆర్ఎస్ శ్రేణులు రెచ్చిపోయారు. బాధితులతోపాటు వచ్చిన న్యాయవాది మహేష్ పై దాడికి పాల్పడ్డారు. ఎమ్మెల్యే ముందే అతని ఫోన్ లాక్కొని దాడి చేశారు. మంచిరెడ్డి సైతం బాధిత మహిళలను దుర్భాషలాడారు.
ఈ ఘటనపై ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు లాయర్ మహేష్. ఇటు ఎమ్మెల్యే, అతని అనుచరుల దౌర్జన్యంపై కేసు నమోదు చేసి తగు చర్యలు తీసుకోవాలని ఇబ్రహీంపట్నం బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ డిమాండ్ చేశారు.
Posted by Bapatla Krishnamohan at 8:26 PM No comments:
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest
Newer Posts Older Posts Home
Subscribe to: Posts (Atom)

About Me

Bapatla Krishnamohan
View my complete profile

Blog Archive

  • ▼  2026 (234)
    • ▼  August (78)
      • ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సారథ్యంలో ప్రజా ప్రభుత్వ...
      • తెలంగాణలో రైల్వే ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించిన...
      • సేవలను గుర్తుచేసుకుంటూ ఘనంగా సన్మానం చేసిన సైబరాబా...
      • ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ తో నెరవేరిన సొంత ఇంటి కల 16...
      • "50,565 ఎకరాలు మరియు లక్ష ఇళ్లు ప్రొహిబిటెడ్ లిస్ట...
      • ఈ రోజు, నా కళ్లు కృతజ్ఞతా భావంతో తడిసిపోయాయి_
      • తెలంగాణ లో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను సజావుగా, ప...
      • ఆరోగ్యకరమైన జీవనశైలితో పాటు సామాజిక బాధ్యతపై అవగాహ...
      • వేతన చెల్లింపులో జాప్యం, ఫారమ్-16 జారీపై చర్యలు తీ...
      • పేదల ఆత్మగౌరవానికి ప్రతీకగా ఇందిరమ్మ ట‌వ‌ర్స్_
      • జపాన్‌ సంస్థతో ‘యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీ...
      • మీరాలం ట్యాంక్ ను పర్యాటకులను ఆకట్టుకునే విధంగా తీ...
      • నకిలీ వైద్యుల ఉచ్చులో పడకండి అప్రమత్తంగా ఉండండి - ...
      • సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అక్రమ నిర్...
      • వార్త రాస్తే.. వేటాడతారా?!అవినీతిని ప్రశ్నిస్తే జర...
      • _నకిలీ వైద్యుల ఉచ్చులో పడకండి.. అప్రమత్తంగా ఉండండి...
      • గణేష్ ఉత్సవాల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు – అన్ని...
      • హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్ ముఠాల పట్ల ప్రజలు అత్యంత అప్...
      • పోలీసు స్టేషన్ న్యాయం జరిగే ప్రదేశంగా ఉండాలి..సెటి...
      • భారత యువతలో పెరుగుతున్న అసంతృప్తి — పాలనా సంక్షోభా...
      • ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విషయంలో గతంలో బీఆర్‌ఎస్ మరి...
      • ఇక మాటలు కాదు — అసలు రికార్డులు బయటపెట్టండి_
      • స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR: ప్రజాస్వామ్య హక్కు...
      • మిలాద్-ఉన్-నబీ" సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులంద...
      • _తెలంగాణ జైళల్లో దీర్ఘకాలంగానిర్భందంలో ఉన్న మావోయి...
      • తెలంగాణ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ #TGFDC ...
      • నిబంధనలు ఉల్లంఘించే భవనాలపై కఠిన కూల్చివేత చర్యలు ...
      • నాచారం డివిజన్ లో 46 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్...
      • హైదరాబాద్ జిల్లా కన్వీనర్ గా బాపట్ల కృష్ణమోహన్ ముద...
      • పాలిటెక్నిక్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎలాం...
      • తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను దేశంలోన...
      • గ్లోబల్ స్థాయిలో ఇన్వెస్ట్ తెలంగాణ సమ్మిట్ నిర్వహణ...
      • అమీన్పూర్‌లో ప్రభుత్వ / సీలింగ్ భూములపై రీ-లేఅవుట్...
      • స్థానిక అవసరాలను అర్థం చేసుకోవడం పరిష్కారం చేయడం -...
      • సాంకేతి విద్యను పరిరక్షణన చేసేందుకు ABVP ఆధ్వర్యంల...
      • మెడిపల్లిలో కల్తీ మసాలాల తయారీ కేంద్రంపై పోలీసుల మ...
      • సామాన్యుడిలా బైక్‌పై వచ్చి.. కేబీఆర్ వన్ వే ట్రాఫి...
      • అధికారులు మూసివేసినా.. మళ్లీ ఎలా తెరిచారు?_
      • గచ్చిబౌలి పోలీసులు మరియు సైబరాబాద్ SOT బృందాలు ముగ...
      • మాభూమి మాకు దక్కింది ఈ ప్రభుత్వానికి కృతజ్ఞతలు -22...
      • కరీంనగర్‌లో ఘనంగా తిరంగా ర్యాలీ_
      • బలూచ్ భూభాగం నుండి అన్ని బలగాలను వెంటనే ఉపసంహరించు...
      • సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజావాణి లో పౌరస...
      • నకిలీ పంచలోహ లక్ష్మీదేవి విగ్రహం, అరుదైన రాయి పేరి...
      • జాతీయ పతాకాన్ని ఆవిష్కరించే అవకాశం ప్రతి పౌరుడికి ...
      • తెలంగాణ రాష్ట్రంలో కళలను ప్రోత్సహిస్తున్నాం - సాంస...
      • గోదావరి పుష్కరాల పై కేబినేట్ సబ్ కమిటి ఏర్పాటు_
      • తెలంగాణ రాష్ట్ర కేబినేట్ తీర్మానాలు _
      • సేవా పతక గ్రహీతలు డీసీపీ జే.నర్సయ్య మరియు సైబర్‌ క...
      • వికసిత్ భారత్ నిర్మాణానికి ప్రతి పౌరుడు తప్పక తోడ్...
      • మింట్ కాంపౌండ్‌లో ఘనంగా టీజీఎస్పీడీసీఎల్ స్వాతంత్ర...
      • గాంధీ భవన్‌లో జాతీయ పతాకావిష్కరణ_
      • రామంతాపూర్ వెంకట సాయి నగర్ కాలనీలో ఘనంగా 80వ స్వాత...
      • పాకిస్తాన్ మరియు బలూచిస్తాన్ రెండు వేర్వేరు దేశాలు...
      • సైబర్ క్రైమ్ మోసాలు - సైబర్ క్రైమ్ పోలీస్ అధికారు...
      • స్వాతంత్ర్యం పళ్ళెంలో పెట్టి ఇవ్వరు. మా వెయ్యేళ్ళ ...
      • చట్టబద్ధంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తాం...
      • ఖైదీలకు వారి మాధ్యమిక విద్యను పూర్తి చేసే అవకాశం_
      • చెరువుల అభివృద్ధి మరియు పునరుద్ధరణలో భాగస్వాములు క...
      • ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ సమీక్షలో మంత్రి కోమటి రె...
      • హైదరాబాద్ జిందాబాద్ కల్చరల్ ఫెస్టివల్ ప్రచార పోస్ట...
      • నిరసన హక్కు రాజ్యాంగ సంస్థలపై ఒత్తిడి తెచ్చే హక్కు...
      • రామంతాపూర్ చిన్నచెరువు కట్ట కింద ఉన్న శ్రీ శ్రీ శ్...
      • మణికొండ జాగీర్ సర్వే నెం.42లోని ప్రభుత్వ భూమి (సుమ...
      • 6 కోట్ల మంది బలూచ్ ప్రజలు తమను తాము ఒక స్వతంత్ర, స...
      • అమ్మాయిలూ.. రెంట్ బాయ్‌ఫ్రెండ్ ఆఫర్ల వల.. జాగ్రత్త!!_
      • సమాచార భవన్ ఎఫ్డిసి (FDC) కార్యాలయంలో ఘనంగా బోనాల ...
      • "పిల్లలు పాఠశాలకు వెళ్లి చదువు కోవాలా? లేక వారి ప్...
      • "రైతు పొలాన్ని దున్నింది ట్రాక్టర్ కాదు... వ్యవస్థ...
      • ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) నిర్వహించిన దేశవ్యా...
      • హైదరాబాద్ నగర సంస్కృతి సంప్రదాయాలు ఆచార వ్యవహారాలు...
      • ఆక్స్‌ఫర్డ్ ఇంటర్నేషనల్ స్కూల్‌పై ప్రభుత్వ భూముల ఆ...
      • తెలంగాణ స్టేట్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (...
      • అమెరికా రాయబారి సెర్జియో గోర్ తో సీఎం రేవంత్ రెడ్డ...
      • బలూచిస్తాన్ గణతంత్రం పాకిస్తాన్‌ను హెచ్చరించింది_
      • నిమ్స్ లో వెయ్యి రోబోటిక్ శస్త్ర చికిత్సలు_
      • బ్రిక్స్ అవినీతి నిరోధక కార్యాచరణ బృందం హైదరాబాద్ ...
      • విధి నిర్వహణలో గాయపడిన కానిస్టేబుళ్లకు సీపీ సజ్జనర...
    • ►  July (70)
    • ►  June (23)
    • ►  May (17)
    • ►  April (6)
    • ►  March (15)
    • ►  February (7)
    • ►  January (18)
  • ►  2025 (445)
    • ►  December (19)
    • ►  November (18)
    • ►  October (20)
    • ►  September (20)
    • ►  August (29)
    • ►  July (44)
    • ►  June (17)
    • ►  May (40)
    • ►  April (52)
    • ►  March (53)
    • ►  February (62)
    • ►  January (71)
  • ►  2024 (562)
    • ►  December (51)
    • ►  November (69)
    • ►  October (54)
    • ►  September (51)
    • ►  August (67)
    • ►  July (76)
    • ►  June (42)
    • ►  May (36)
    • ►  April (15)
    • ►  March (31)
    • ►  February (26)
    • ►  January (44)
  • ►  2023 (583)
    • ►  December (47)
    • ►  November (38)
    • ►  October (39)
    • ►  September (74)
    • ►  August (59)
    • ►  July (54)
    • ►  June (51)
    • ►  May (53)
    • ►  April (52)
    • ►  March (39)
    • ►  February (46)
    • ►  January (31)
  • ►  2022 (719)
    • ►  December (45)
    • ►  November (63)
    • ►  October (59)
    • ►  September (45)
    • ►  August (41)
    • ►  July (63)
    • ►  June (70)
    • ►  May (58)
    • ►  April (61)
    • ►  March (55)
    • ►  February (75)
    • ►  January (84)
  • ►  2021 (763)
    • ►  December (71)
    • ►  November (38)
    • ►  October (53)
    • ►  September (53)
    • ►  August (89)
    • ►  July (111)
    • ►  June (70)
    • ►  May (70)
    • ►  April (56)
    • ►  March (58)
    • ►  February (49)
    • ►  January (45)
  • ►  2020 (538)
    • ►  December (68)
    • ►  November (64)
    • ►  October (61)
    • ►  September (80)
    • ►  August (73)
    • ►  July (83)
    • ►  June (66)
    • ►  May (43)
Simple theme. Powered by Blogger.