Thursday, June 16, 2022

పిల్లలను బడికి పంపండయ్యో....ఎండలో నేలపై పడుకోని హెడ్ మాస్టర్ వేడుకోలు

*పిల్లలను బడికి పంపండయ్యో....ఎండలో నేలపై పడుకోని హెడ్ మాస్టర్ వేడుకోలు*

పుల్‌కల్‌, : బడి మానేసిన పిల్లలను బడికి పంపేవరకూ తిరిగి వెళ్లేదేలేదంటూ వాళ్ల ఇళ్ల వద్ద ప్రధానోపాధ్యాయుడు నేలపై పడుకొని వినూత్న నిరసన తెలుపుతూ తల్లిదండ్రులను వేడుకున్నారు.సంగారెడ్డి జిల్లా పుల్‌కల్‌ మండలం ముదిమాణిక్యం గ్రామంలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకున్నది. బడిబాట కార్యక్రమంలో భాగంగా ముదిమాణిక్యం జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల హెచ్‌ఎం నూలి శ్రీధర్‌రావు సహచర ఉపాధ్యాయులను వెంట బెట్టుకుని బడి మానేసిన పిల్లల ఇళ్లకు వెళ్లారు. 2021-22 విద్యా సంవత్సరంలో ఎనిమిదో తరగతి పూర్తి చేసిన అన్నదమ్ములు ప్రస్తుత విద్యా సంవత్సరంలో తొమ్మిదో తరగతిలో చేరాల్సి ఉంది. అయితే అందులో ఒకరు బాల కార్మికుడిగా మారగా, మరొకరు అనారోగ్యంతో పాఠశాలలో చేరలేదు. వీరితో పాటుగా ఏడో తరగతి పూర్తి చేసుకుని ఎనిమిదో తరగతిలో చేరాల్సిన మరో విద్యార్థి కూడా బడి మానేశాడు. దీంతో హెచ్‌ఎం శ్రీధర్‌రావు విద్యార్థుల ఇళ్లకు వెళ్లి బడికి వచ్చేలా కౌన్సెలింగ్‌ ఇచ్చారు. తల్లిదండ్రులు ఎంతకీ వినకపోవడంతో.. ఎండలో కటిక నేలపై కూర్చుని, పడుకుని వినూత్న రీతిలో వారిని వేడుకొన్నారు. చివరకు పిల్లలను తిరిగి పాఠశాలకు వచ్చేలా చేశారు. దీంతో హెచ్‌ఎం శ్రీధర్‌రావును గ్రామస్థులు ప్రశంసించారు.

link Media ప్రజల పక్షం🖋️ 

Wednesday, June 15, 2022

తల్లి తండ్రులరా ఆలోచించండి మీ పిల్లల ఉజ్వల భవిష్యత్ కోసం... Bplkm🪶

కరెక్టే ప్రస్తుతం ఇలాంటి పరిస్థితులు వున్నాయి... తల్లి తండ్రులు మారాలి... పిల్లలు బాగా చదవాలి అని ఆలోచిస్తున్నారు బాగానే వుంది... ప్రయివేట్ కార్పొరేట్ విద్యాసంస్థలలో చదువును కోనేపరిస్థితికి తీసుకొచ్చాయి ఈ ప్రభుత్వాలు.... అందుకే ప్రతి కార్పొరేట్ విద్యాసంస్థలలో పేరెంట్స్ కమిటీ ఉండాలి ఆ కమిటీ భారత రాజ్యాంగం కల్పించిన న్యాయమైన హక్కులకు & చట్టాలకు అనుగుణంగా విద్యార్థుల భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని  ఉపాధ్యాయులతో & యాజమాన్యాలతో కలిసి పనిచేసినప్పుడే విద్యావ్యవస్థ బాగుపడుతుంది.... Bplkn🪶*   prajasankalpam1.blogspot.com 

టీఆర్ఎస్ అక్రమాలపై గవర్నర్ కు ఫిర్యాదు

టీఆర్ఎస్ అక్రమాలపై గవర్నర్ కు ఫిర్యాదు

– చర్యలు తీసుకోవాలన్న జడ్సన్

ఎనిమిదేండ్ల కేసీఆర్ పాలన అంతా అవినీతి, అక్రమాలేనంటూ విపక్షాలు తరచూ విమర్శలు గుప్పిస్తుంటాయి. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పులకుప్పగా మార్చారని.. ప్రాజెక్టుల పేరుతో విపరీతంగా దోపిడీకి పాల్పడ్డారని మండిపడుతుంటాయి. కేసీఆర్ కుటుంబ ఆస్తులు వేల కోట్లకు పెరిగాయని ఆరోపిస్తుంటాయి. తాజాగా కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ ఈ విషయంలో ఓ అడుగు ముందుకేశారు.

టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాల అమలులో అక్రమాలు అనేకంగా జరుగుతున్నాయనేది జడ్సన్ ఆరోపణ. కబ్జాలు, సెటిల్​ మెంట్లు, బెదిరింపులతో అక్రమాలతో వేలకోట్లు సంపాదించి.. ప్రజలను ఆగం చేశారని విరుచుకుపడుతున్నారాయన. ఈ నేపథ్యంలోనే జడ్సన్ గవర్నర్ ను కలవడం హాట్ టాపిక్ గా మారింది.

కల్వకుంట్ల పాలనలో అంతా అవినీతిమయం అంటూ గవర్నర్ కు ఫిర్యాదు చేశారు జడ్సన్. కేసీఆర్ కుటుంబం చేసిన అక్రమాలు, అవినీతిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. తెలంగాణ మాజీ స్పెషల్ ప్లీడర్ అడ్వకేట్ శరత్ కుమార్ తో కలిసి జడ్సన్ ఫిర్యాదు చేశారు.

బాసర ఆర్జీయూకేటీ విద్యార్థుల ఆందోళన పై KTR...... ట్వీట్

*బాసర ఆర్జీయూకేటీ విద్యార్థుల ఆందోళన పై KTR...... ట్వీట్*

హైదరాబాద్‌: తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఆర్జీయూకేటీ-బాసరలో 8వేల మంది విద్యార్థులు రోడ్డుపై కూర్చున్నారని.. ఈ విషయంలో స్పందించాలంటూ బత్తిని తేజగౌడ్‌ అనే యువకుడు మంత్రి కేటీఆర్‌కు ట్వీట్‌ చేశారు.వెంటనే స్పందించిన మంత్రి.. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్‌, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి దృష్టికి తీసుకెళ్తామని భరోసా ఇచ్చారు. విద్యలో నాణ్యత పెంపొందించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని.. విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేటీఆర్‌ హామీ ఇచ్చారు.

మరోవైపు ఈ అంశంపై కేటీఆర్‌ చేసిన ట్వీట్‌కు మంత్రి సబిత స్పందించారు. బాసర ఆర్జీయూకేటీ సమస్యలపై ఇవాళ వీసీతో సమావేశమవుతున్నట్లు చెప్పారు. వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు.

link Media ప్రజల పక్షం🖋️ 

Tuesday, June 14, 2022

తెలంగాణ....గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్షా తేది ఖరారు....!

*తెలంగాణ....గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్షా తేది ఖరారు....!*

హైదరాబాద్‌: గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ తేదీని ఖరారు చేసింది తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌. ఈ మేరకు మంగళవారం సాయంత్రం తేదీని ప్రకటించింది.అక్టోబర్ 16న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణ ఉంటుందని టీఎస్‌పీఎస్సీ పేర్కొంది.

తెలంగాణ ఆవిర్బావం తర్వాత తొలిసారి వివిధ శాఖల్లో 503 గ్రూప్-1 ఉద్యోగాల కోసం టీఎస్​పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. గతంతో పోలిస్తే గ్రూప్ వన్‌ కోసం ఈసారి భారీగా దరఖాస్తులు అందాయి. రోజుకు సుమారు పది వేల చొప్పున దరఖాస్తులు అందగా.. గడువు పెంచిన తర్వాత చివరి నాలుగు రోజుల్లో సుమారు 30 వేల మంది దరఖాస్తులు సమర్పించారు. మొత్తం 503 పోస్టులకు గానూ.. 3 లక్షల 80 వేల 202 మంది పోటీపడుతున్నారు.

అయితే దరఖాస్తుల తేదీని పొడగించాలన్న విజ్ఞప్తిని పెద్దగా పట్టించుకోని టీఎస్‌పీఎస్సీ.. పరీక్ష తేదీ విషయంలో మాత్రం అభ్యర్థుల విజ్ఞప్తులను మాత్రం పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అందుకే జులై-ఆగష్టులో నిర్వహించాలనుకున్న ప్రిలిమినరీ పరీక్షను.. అక్టోబర్‌కు జరిపింది.

link Media ప్రజల పక్షం🖋️ 

Monday, June 13, 2022

రౌడీలు......కేడీలపై ఉక్కుపాదం..పి ఎస్ ల వారీగా లెక్క తేల్చుతున్న సీపీ స్టీఫెన్‌రవీంద్ర

*రౌడీలు......కేడీలపై ఉక్కుపాదం*

*పీఎ్‌సల వారీగా లెక్క తేల్చుతున్న సీపీ స్టీఫెన్‌రవీంద్ర*

హైదరాబాద్‌ రౌడీషీటర్లు, పాత నేరస్థుల కదలికలపై దృష్టి పెంచాలని సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర ఆదేశించారు.కమిషనరేట్‌ పరిధిలోని పలు ప్రాంతాల్లో అల్లరిమూకల ఆగడాలు, రౌడీషీటర్‌ల అరాచకాలు, భూ కబ్జాలు, ఆర్థిక నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ఆయన సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఈ మేరకు ఎస్‌హెచ్‌ఓలు, ఏసీపీలు, డీసీపీలు, క్రైమ్‌ సిబ్బందితో ఇటీవల సమీక్షా సమావేశం నిర్వహించారు.

501 మంది రౌడీషీటర్స్‌

మూడేళ్లుగా నమోదైన గణాంకాల ప్రకారం.. సైబరాబాద్‌ కమిషనరేట్‌లో ప్రస్తుతం రౌడీషీటర్ల సంఖ్య 501గా ఉన్నట్లు తెలుస్తోంది. వీరందరిపై దృష్టి పెట్టాలని సీపీ సూచించినట్లు సమాచారం.

పాత నేరస్థులకు కౌన్సెలింగ్‌

అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా, శాంతి భద్రతలకు విఘాతం కలిగించినా ఉపేక్షించేది లేదని సీపీ స్టీఫెన్‌ రవీంద్ర స్పష్టం చేశారు. ఇటీవల కమిషనరేట్‌ పరిధిలోని కొంతమంది పాత నేరస్థులతో సమావేశం నిర్వహించి హెచ్చరించారు. ఇకపై ప్రతి నేరస్థుడి జాబితా రికార్డుల్లో ఉంటుందని, పదే పదే అల్లర్లు, గొడవలు సృష్టిస్తున్న వారిపై బైండోవర్‌ కేసులు నమోదు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్‌లు పాత నేరస్తులకు కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు. ఇప్పటికే పాత నేరస్థుల అడ్ర్‌సలు, లొకేషన్స్‌ను జియోట్యాగింగ్‌ చేయగా.. కొత్తవారిని కూడా జియోట్యాగింగ్‌ చేసి, వారి కదలికలపై నజర్‌ పెడుతున్నారు. ప్రతి పోలీస్‌ స్టేషన్‌లో నేరస్థుల జాబితాను సిద్ధం చేస్తున్నారు.

link Media ప్రజల పక్షం🖋️ 

జూన్ 23 బీజేపీ పతనానికి పునాది రాయి....రేవంత్ రెడ్డి

జూన్ 23 బీజేపీ పతనానికి పునాది రాయి....రేవంత్ రెడ్డి

నేషనల్ హెరాల్డ్ పత్రిక కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఈడీ నోటీసులు ఇవ్వడంపై కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమంటున్నాయి. దీనిలో భాగంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్నాయి.తెలంగాణలోనూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నేతృత్వంలోనూ కాంగ్రెస్ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. గాంధీ కుటుంబంకి నోటీసులు ఇవ్వడం అంటే.. దేశం నీ అవమానించడమేనని, గాంధీ కుటుంబంకి జరిగిన అవమానం కాదు.. దేశ ప్రజలకు జరిగిన అవమానంగా రేవంత్‌ రెడ్డి అభివర్ణించారు. ఇందిరాగాంధీపై సీబీఐ కేసు పెట్టీ అవమానిస్తే… దేశం ఏకం అయ్యిందని, తిరిగి దేశానికి ఇందిరా గాంధీ ప్రధాని అయ్యిందని ఆయన గుర్తు చేశారు. జూన్ 23 బీజేపీ పతనానికి పునాది రాయి అని ఆయన మండిపడ్డారు. సోనియా గాంధీ ఈడీ ఆఫీస్ లో అడుగు పెట్టిన క్షణం నుండే మోడీ..అమిత్ షా పతనం మొదలైందన్నారు.

బీజేపీకి రోజులు దగ్గర పడ్డాయని, గాంధీ కుటుంబం మీద ఏం జరిగినా.. జనం చూస్తూ ఉండరన్నారు. సోనియా గాంధీ తెలంగాణకు తల్లి లాంటిదని, అలాంటి తల్లిని అవమనిస్తుంటే చూస్తూ ఊరుకుంటామా..? అని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. గాంధీ వారసులం కాబట్టి శాంతియుత నిరసన చేశాం.. సోనియా గాంధీని అవమానించాలని చూస్తే ఊరుకోమని ఆయన ధ్వజమెత్తారు. ఈ నెల 23న మళ్లీ ఈడీ ఆఫీస్ కి వస్తమని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా… రాష్ట్రంకి ముందు ఈడీ, సీబీఐ వస్తుంని, తర్వాత మోడీ..అమిత్ షా వస్తారన్నారు. గాంధీ కుటుంబం మీద కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తుందని, గాంధీ కుటుంబం ఈక కూడా పీకలేరని ఆయన మండిపడ్డారు.

link Media ప్రజల పక్షం🖋️