Monday, April 11, 2022

దాన్యం కొనుగోలుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి..... రేవంత్ రెడ్డి......!

*దాన్యం కొనుగోలుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి..... రేవంత్ రెడ్డి......!*

హైదరాబాద్: ఈ రోజు మధ్యాహ్నం జరిగే రాష్ట్ర మంత్రి వర్గ సమావేశంలో ధాన్యం కొనుగోలుపై ప్రభుతం ఒక నిర్ణయం తీసుకోవాలని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... 24 గంటలలో రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరిచి కొనుగోలును ప్రారంభించాలన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం ఒక స్పష్టమైన వైఖరి తీసుకుని రైతులకు భరోస కల్పించకపోతే ఎక్కడికక్కడ మంత్రులను, టీఆర్ఎస్ నేతలను అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు. మద్దతు ధరలకు ధాన్యం కొనుగోలు చేపట్టాలన్నారు. రైతులకు లాభం జరిగేలా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, బీజేపీ, టీఆర్ఎస్‌లు ఆడుతున్న దొంగ నాటకాలు కట్టిపెట్టాలని డిమాండ్ చేశారు. రైతుల నుంచి చివరి వరి గింజ వరకు కొనుగోలు చేయాలన్నారు. రైతులకు అన్యాయం జరిగితే కాంగ్రెస్ రైతుల పక్షాన పోరాటం చేసి వారికి అండగా ఉంటుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

link Media ప్రజల పక్షం🖋️ 

విద్యార్థుల‌కు మధ్య ఘర్షణ.. వార్నింగ్ ఇచ్చిన జేఎన్‌యూ

విద్యార్థుల‌కు మధ్య ఘర్షణ.. వార్నింగ్ ఇచ్చిన జేఎన్‌యూ

Courtesy by : తొలివెలుగు మీడియా website

ఢిల్లీలోని జేఎన్‌యూ వర్సిటీలో ఆదివారం స్టూడెంట్స్ యూనియన్ల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ ఘర్షణపై రిజిస్ట్రార్‌ ఓ లేఖ విడుదల చేశారు. విద్యార్థులు ఎలాంటి గొడవలకు పాల్పడవద్దంటూ నోటీసులో సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. వర్సిటీలో శాంతికి భంగం కలిగితే సహించబోమని హెచ్చరించారు. హింసకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని వీసీ చెప్పార‌ని ఆ లేఖ‌లో రిజిస్ట్రార్ తెలిపారు.

శ్రీరామ‌న‌వ‌మి పూజ‌ సందర్బంగా ఆదివారం వర్సిటీలో ఏబీవీపీ, జేఎన్‌యూఎస్‌యూ సంఘాల విద్యార్థుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ తలెత్తింది. యూనివర్సిటీ మెస్‌లో మంసాహారం వడ్డించటంతో ఈ ఘర్షణ జరిగినట్టు అధికారులు తెలిపారు. ఈ ఘర్షణలో దాదాపు 16 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన యూనివర్సిటీ అధికారులు సంఘటన స్ధలానికి చేరుకొని, ఇరుసంఘాల విద్యార్థులను అదుపు చేశారు.కాగా, క్యాంపస్‌లోని కావేరీ హాస్టల్‌ మెస్‌లో మాంసాహారం వడ్డించకుండా ఏబీవీపీ కార్యకర్తలు అడ్డుకున్నారని జేఎన్‌యూ స్టూడెంట్స్‌ యూనియన్‌ (జేఎన్‌యూఎస్‌యూ) కార్యకర్తలు ఆరోపించారు. క్యాంపస్‌లో రామనవమి పూజకు జేఎన్‌యూఎస్‌యూ నేతలు ఆటంకాలు సృష్టించారని ఏబీవీపీ కార్యకర్తలు పేర్కొన్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య రగడ మొదలయ్యింది. పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

ఈ ఘర్షణల నేపథ్యంలో వర్సిటీ క్యాంపస్‌లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ ఘటనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్టు వెల్లడించారు. జేఎన్‌యూఎస్‌యూ, ఎస్ఎఫ్ఐ, డీఎస్ఎఫ్‌, ఏఐఎస్ఏ సంఘాలు ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు గుర్తు తెలియ‌ని ఏబీవీపీ విద్యార్తుల‌పై కేసు బుక్ చేసినట్టు డిప్యూటీ కమిషనర్‌ మనోజ్‌ తెలిపారు.

వరి.. కారు పార్టీకి ఉరి కానుందా?

వరి.. కారు పార్టీకి ఉరి కానుందా?

Courtesy by : తొలివెలుగు మీడియా website

--చంద్రబాబును గుర్తు చేస్తున్న కేసీఆర్‌

– ఏసీలు, కూలర్ల కింద ధర్నాలు
– 2019 సీన్‌ రిపీట్‌ అవుతుందా?
– బాబుకు జరిగినట్టే కేసీఆర్‌ కు జరుగుతుందా?
– వరి వార్‌.. సారు మెడకే చుట్టుకుంటుందా?

ఎండవేడి తట్టుకునేందుకు టెంట్లు, కూలర్లు.. వందల మందితో ఢిల్లీలో ధర్నా.. వారికి విందులు, వినోదాలు.. ఫ్లైట్‌, ఇతర ఖర్చులు.. కేసీఆర్‌ నిరసన అంటే ఆ మాత్రం కాస్ట్లీగానే ఉండాలి అనేలా సాగింది టీఆర్‌ఎస్‌ ధర్నా. అయితే.. కేంద్రంపై సారు వ్యవహరిస్తున్న తీరు.. తన పాత బాస్‌ చంద్రబాబును గుర్తు చేస్తున్నట్లే ఉందని అంటున్నారు విశ్లేషకులు. ఆయన కూడా ఇలాగే 2019 ఎన్నికల సమయంలో కేంద్రంపై పోరుబాట పట్టి.. ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్నారని గుర్తు చేస్తున్నారు

2014 ఎన్నికల సమయంలో కలిసి పోటీకి దిగి 2019 ఎన్నికల సమయానికి మోడీ సర్కార్‌ పై యుద్ధం ప్రకటించారు చంద్రబాబు. ప్రత్యేక హోదా నినాదంతో ధర్మ పోరాటం అంటూ పోరు బాట పట్టారు. బీజేపీయేతర శక్తులన్నింటినీ ఏకం చేసేందుకు శతవిథాలా ప్రయత్నించారు. కానీ.. మోడీపై ఆయన యుద్ధం ఫెయిల్‌ అయింది.జాతీయ రాజకీయాల మాట అటుంచితే రాష్ట్రంలోనే చావు దెబ్బ తిని అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చింది. ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా అదే బాటలో పయనిస్తున్నట్లు చెబుతున్నారు విశ్లేషకులు.

2014 ఎన్నికల్లో వేర్వేరుగా పోటీకి దిగినా.. పార్లమెంట్‌ లో ఏ బిల్లుకు అడ్డు చెప్పలేదు కేసీఆర్‌. కేంద్రంతో సఖ్యతగానే ఉంటూ వచ్చారు. అయితే.. రాను రాను రాష్ట్రంలో బీజేపీ బలం పుంజుకోవడం.. జాతీయ రాజకీయాల ఆశ ఉండడంతో కేంద్రంపై యుద్ధానికి దిగారు కేసీఆర్‌.అందులోభాగంగానే ధాన్యం కొనుగోళ్ల విషయంలో మోడీ సర్కార్ పై పోరుబాట పట్టారు. అచ్చం చంద్రబాబు తరహాలోనే కూలర్లు, ఏసీల కింద ధర్నాలు నిర్వహిస్తున్నారు. ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.ముచ్చటగా మూడోసారి 95 నుండి 105 స్థానాలు దక్కించుకోవాలని చూస్తున్నారు కేసీఆర్‌. పీకే సూచనలతో అధికార పార్టీ అయి కూడా ప్రతిపక్ష నేతల మాదిరిగా ఆందోళనలకు శ్రీకారం చుట్టారు. కేంద్ర పరిపాలనకు వ్యతిరేకంగా రాష్ట్రంలోని ప్రజలను తయారుచేస్తే మళ్లీ అధికారం తమ హస్తగతం అవుతుందనేది కేసీఆర్‌ భావనగా చెబుతున్నారు విశ్లేషకులు.అయితే.. చంద్రబాబు కూడా ఇలాగే ఆలోచించి బొక్కబోర్లా పడ్డారని.. రానున్న ఎన్నికల్లో కేసీఆర్‌ కూడా అలాగే అయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని అంటున్నారు.


ఏ క్షణమైనా కేసీఆర్ జైలుకు... బండి సంజయ్ అని మూడు నెలలు అవుతుంది

 @కేసీఆర్ సారు & అయన కుటుంబ సభ్యుల మీద అవినీతి ఆరోపణలు చేసిన తెలంగాణ బీజేపీ పార్టీ రాష్ట్ర అధిష్టానం & ముఖ్య నాయకులు ఇప్పుడు మౌనంగా ఎందుకు వున్నారు ??. ఢిల్లీ లో తెరాస జరుపుతున్న అన్ని కార్యక్రమాల మీద  ముఖ్య నాయకుల మీద అడుగడుగునా కేంద్ర ఇంటెలిజెన్స్ నిఘా పెట్టింది అని జాతీయ మీడియా అంటున్న మాట. ఇకపోతే రైతులకు తెరాస / బీజేపీ పార్టీ లు ఎలాంటి సహాయం చేస్తున్నాయో రైతులకు తెలుసు. తెలంగాణ ద్రోహులను @కేసీఆర్ సారు ఢిల్లీ కి తీసుకెళ్లి ధర్నా చేయడం నిజంగా సిగ్గుచేటు ఎందుకంటే అక్కడ ధర్నాలో కూర్చున్న మంత్రులకు కానీ MLA లకు కానీ, MLC లకు కానీ తెలంగాణ లో తెలంగాణ వచ్చాక ఎంతమంది రైతులు ఆత్మహత్యలు(ప్రభుత్వ హత్యలు) చేసుకున్నారో తెలియని సన్నాసులు వారు. నిజంగా రైతులకు న్యాయం చేయాలంటే నేరుగా రైతులతో @కేసీఆర్ సారు ఏనాడు చర్చలు జరుపలేదు ఎందుకు ??. తెలంగాణ భవన్ లో రైతులతో మీటింగ్ పెట్టినప్పుడు ఆ మీటింగ్ లో 95% తెరాస కార్యకర్తలు వున్నారు రైతులకు ప్రవేశం లేకుండా చేసిన ఘనత సంతోష్ రావు ది. అప్పుడే ప్రతిపక్షాలు గట్టిగా నీలాదీసింటే బాగుంటుండే కానీ ఆలా చేయలేదు. ఏది ఏమైనా బీజేపీ + తెరాస = లోపాయకారి ఒప్పందం అని అందరు తెలుసుకుంటున్నారు 👍.... Bplkm🪶*  *Copy to Group link Media* prajasankalpam1.blogspot.com

Sunday, April 10, 2022

స్టార్ క్యాంపేయినర్ గా నా భాద్యత ఏంటో చూయిస్తా...... కోమటి రెడ్డి.....!

*స్టార్ క్యాంపేయినర్ గా నా భాద్యత ఏంటో చూయిస్తా...... కోమటి రెడ్డి.....!*

హైదరాబాద్: స్టార్ క్యాంపెయినర్‌గా తన బాధ్యత ఏంటో చూపిస్తానని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజా సమస్యలపై పోరాడుతామని ప్రకటించారు.ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగడతామన్నారు. షేక్‌పేటలో రూ.2 వేల కోట్ల ప్రభుత్వ భూమిని.. ప్రైవేట్ కంపెనీకి కట్టబెడుతున్నారని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. తెలంగాణ రాజకీయాలపై ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ ఫోకస్‌ పెట్టారు. ఈ నేపథ్యంలోనే స్టార్ క్యాంపెయినర్‌గా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నియామించారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని నియమిస్తున్నట్లు ఏఐసీసీ ప్రకటించింది.

link Media ప్రజల పక్షం🖋️

Saturday, April 9, 2022

Telangana to ban private practice for government doctors

Telangana to ban private practice for government doctors

share
SYNOPSIS
In a key move, the department of medical health has decided to disallow government doctors from engaging in private practice.

Friday, April 8, 2022

తెలంగాణ బీజేపీ అధిష్టానం ఒక్కసారి ఆత్మ విమర్శన చేసుకోవాలి.

అందరికి నమస్కారం 🙏

*తెలంగాణ బీజేపీ అధిష్టానం ఒక్కసారి ఆత్మ విమర్శన చేసుకోవాలి. మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎన్ని అసెంబ్లీ స్థానాలలో బీజేపీ పార్టీ కు బలమైన నాయకుడు (MLA అభ్యర్థిగా) వున్నారు ??. పాదయాత్రల ద్వారా నియోజకవర్గాలలో తెలంగాణ బీజేపీ అంటే ప్రజాభిమానం కన్నా మోడీ గారి మీద వున్న అభిమానం ఎక్కువగా వుంది అని ఇదివరకు జరిగిన పాదయాత్రలో చూసాము. తెలంగాణ బీజేపీ అధిష్టానంలోని ముఖ్య నాయకులు టీవీలలో మీడియా ముందు ఎన్నోసార్లు ఎన్నో డైలాగులు చెప్పారు. ముఖ్యమంత్రి / కేటీర్ / సంతోష్ రావు... ఇతరులు ED / CBI,జైలుకు అని ఏమైంది  ??. నిత్యావసరాల  ధరల పెరుగుదల గురించి సరిఅయిన సమాధానం ప్రధాని గాని కేసీఆర్ గాని వివరణ ప్రజలకు ఎందుకు ఇవ్వలేక పోయారు ??. సోషల్ మీడియా చాలా చురుకుగా పనిచేస్తుంది అని తెలుసుకోవాలి అన్ని రాజకీయ పార్టీ నాయకులు.తెలంగాణ బీజేపీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు NVSS ప్రభాకర్ గారు మీరు మొదట మారాలి ప్రజా సంకల్పం గ్రూప్ మీడియా లో  మిమ్మల్ని ప్రశ్నిస్తే ఏ ఒక్కరోజు కూడా సమాధానం ఇవ్వలేదు అంటేనే అర్థం అవుతుంది మీ వ్యక్తిత్వం. మీరు రాజకీయాలలో వున్నారు మీరు ఎక్కడినుండి మీ రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టారో అక్కడే పుట్టింది ప్రజా సంకల్పం. మొదట మీ సంకల్పం ప్రజా సంకల్పం లో తెలిపితే అందరు స్వాగత్తిస్తారు.మారాలి రాజకీయ నాయకులు మారాలి... Bplkm🪶*  

NOTE : *ప్రజా సంకల్పం & link Media ఏ రాజకీయ పార్టీకు మద్దత్తుగా లేదు. ప్రజాప్రయోజనాలకోసం ప్రజలను జాగృతం చేస్తూ నిస్వార్థంగా పనిచేస్తుంది. ప్రతి ఒక్కరు @ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేయండి* 

*Copy to Group link Media*   08/04/2022

Bapatla Krishnamohan 
prajasankalpam1@gmail.com
@Praja_Snklpm (Twitter)
https://youtube.com/channel/UCO3m8P1ULX6soj73A43nhMg   (youTube)
https://prajasankalpam1.blogspot.com/