Sunday, March 27, 2022

పేలిన ఎలక్ట్రిక్ స్కూటర్ … తండ్రి కూతురు మృతి

పేలిన ఎలక్ట్రిక్ స్కూటర్ … తండ్రి కూతురు మృతి

Courtesy by : తొలివెలుగు మీడియా website

తమిళనాడులో విషాదకర ఘటన చోటు చేసుకుంది. వేలూరు జిల్లా అల్లాపురంలో ఎలక్ట్రిక్ స్కూటర్ పెలింది. ఈ ఘటనలో తండ్రి, కూతురు మరణించారు.

మృతులను దురై వర్మ(49), మోహనా ప్రీతిలుగా పోలీసులు గుర్తించారు. దురై వర్మ ఫోటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. మోహనా ప్రీతి ప్రభుత్వ పాఠశాలలో చదువుతోంది.

ఘటన వివరాల్లోకి వెళితే… తిరువణ్ణ మలైలో రెండు రోజుల క్రితం ఎలక్ట్రిక్ స్కూటర్ ను దురై వర్మ కొనుగోలు చేశారు. శుక్రవారం సాయంత్రం స్కూటర్ లో బ్యాటరీ డౌన్ అయింది.దీంతో స్కూటర్ కు దురై మళ్లీ చార్జింగ్ పెట్టారు. కొద్ది సేపటి తర్వాత ఛార్జింగ్ అయిందో లేదా చూద్దామని స్కూటర్ దగ్గరు తండ్రీ కూతురు వచ్చారు. ఇంతలో అకస్మాత్ముగా స్కూటర్ పేలిపోయింది.దీంతో సమీపంలో ఉన్న మరో రెండు బైకులకు నిప్పు అంటుకుంది. బయటకు వెళ్లేందుకు అవకాశం లేకపోవడంతో వారిద్దరూ బాత్ రూంలో దాక్కుకున్నారు.కానీ పెద్ద ఎత్తున పొగలు ఇళ్లంతా వ్యాపించాయి. దీంతో వారిద్దరూ ఊపిరాడక మరణించారు. ఘటనా స్థలానికి చేరకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Friday, March 25, 2022

పోరాటాలకు సిద్ధమైన కాంగ్రెస్....... టీపీసీసీ సమావేశంలో కీలక నిర్ణయం

*పోరాటాలకు సిద్ధమైన కాంగ్రెస్....... టీపీసీసీ  సమావేశంలో కీలక నిర్ణయం*

హైదరాబాద్‌: ఛార్జీల పెంపుపై క్షేత్రస్థాయిలో ఉద్యమాలు చేయాలని తెలంగాణ కాంగ్రెస్‌ కమిటీ నిర్ణయించింది.ఇందుకోసం ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయాలని పీసీసీ వర్కింగ్‌ కమిటీ ఆర్గనైజింగ్‌ ఇన్‌ఛార్జి మహేశ్‌కుమార్‌ గౌడ్‌ అధ్యక్షతన జరిగిన టీపీసీసీ జూమ్‌ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులకు అండగా ఉండే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంపై ఉద్యమించి రైతులకు న్యాయం జరిగేలా క్షేత్ర స్థాయి పోరాటాలు చేయాలని నిర్ణయించారు. పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌, నిత్యావసర వస్తువుల ధరల పెంపు వల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నేతలు పేర్కొన్నారు.

విద్యుత్‌ ఛార్జీల పెంపు పేదలకు గుదిబండగా మారిందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఛార్జీలు పెంచుతూ వారే ఒకరిపై ఒకరు పోరాటాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ఈ విషయంలో ప్రజలను భాగస్వాములను చేస్తూ క్రియాశీల ఉద్యమాలు చేయాలని నిర్ణయించారు. ప్రజలకు కాంగ్రెస్‌ హయాంలో ఉన్న ధరలు, ఇప్పటి ధరలు తెలియజేసి వారిని చైతన్య పరచాలని నేతలు అభిప్రాయపడ్డారు. 111 జీవోపై నిపుణులతో అధ్యయన కమిటీ వేయడంతో పాటు, పోరాటం చేయాలని నిర్ణయించారు. దళితబంధు పథకంలో అర్హులందరికీ లబ్ధి జరిగేలా గ్రామస్థాయిలో పోరాటం చేయాలని నిర్ణయించారు. పార్లమెంట్‌ సమావేశాలు జరుగుతుండటంతో ఎంపీలు సమావేశానికి హాజరుకాలేక పోయారని నేతలు తెలిపారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అంజన్‌ కుమార్‌ యాదవ్‌, మాజీ కేంద్ర మంత్రులు బలరాం నాయక్‌, రేణుకాచౌదరి, కిసాన్‌ కాంగ్రెస్‌ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి, సీనియర్‌ ఉపాధ్యక్షులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

link Media ప్రజల పక్షం🖋️ 

రాజేంద్ర నగర్ సబ్ రిజిస్ట్రార్ పై కేసు నమోదు చేసిన..... ఏసీబి

*రాజేంద్ర నగర్ సబ్ రిజిస్ట్రార్ పై కేసు నమోదు చేసిన..... ఏసీబి*

రాజేంద్ర నగర్ సబ్ రిజిస్ట్రార్ అర్షద్ అలీ పై అవినీతి నిరోధక శాఖ శుక్రవారం కేసు నమోదు చేసింది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి వున్నారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.అర్షద్ అలీ కోటీ 87 లక్షల అక్రమ ఆస్తులు కలిగి వున్నారని అవినీతి నిరోధక శాఖ పేర్కొంది. అధికారులు చేసిన తనిఖీల్లో లక్ష రూపాయల నగదు, కోటీ 28 లక్షల విలువైన స్థిరాస్తులు, 328 గ్రాముల బంగారం, 24 లక్షల విలువైన రెండు కార్లు, 5 లక్షల విలువైన రెండు బైక్‌లు, బ్యాంకులో 21 లక్షల రూపాయల ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. మరిన్ని ఆస్తులకు సంబంధించిన పత్రాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఇటీవలే అర్షద్ అలీ లంచం తీసుకుంటూ అధికారులకు పట్టుబడ్డారు.

link Media ప్రజల పక్షం🖋️ 

తెలంగాణ స్టేట్ పోలీస్ వెల్ఫేర్ సొసైటీ ఏర్పాటు......డీజీపీ

*తెలంగాణ స్టేట్ పోలీస్ వెల్ఫేర్ సొసైటీ ఏర్పాటు......డీజీపీ*

హైదరాబాద్: తెలంగాణ స్టేట్ పోలీస్ వెల్ఫేర్ సొసైటీని ఏర్పాటుచేస్తున్నట్టు తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. ఈ సొసైటీ ద్వారా పోలీసు కుటుంబాలకు అవసరమైన సహాయం చేస్తామని అన్నారు.
పోలీసుల సంక్షేమం కోసమే వెల్ఫేర్‌ సొసైటీని ఏర్పాటు చేస్తున్నామని డీజీపీ తెలిపారు. పోలీసుల్లో కొవిడ్‌ మృతుల కుటుంబాల పిల్లలకు స్కాలర్‌షిప్‌లు ఇవ్వాలని నిర్ణయించినట్టు చెప్పారు. కాగా తెలంగాణలో సీసీ టీవీల నిర్వహణకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటుచేస్తున్నట్టుకూడా డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు.

link Media ప్రజల పక్షం🖋️ 

నేరస్థులకు కునుకులేకుండా చేస్తోంది – రేపిస్టులనూ పట్టిస్తోంది – యూపీలో బుల్డోజర్లు ఏం చేస్తున్నాయో తెలుసా?

నేరస్థులకు కునుకులేకుండా చేస్తోంది – రేపిస్టులనూ పట్టిస్తోంది – యూపీలో బుల్డోజర్లు ఏం చేస్తున్నాయో తెలుసా?

Courtesy by : MyIndMedia Twitter

బుల్డోజర్ . యూపీ ఎన్నికల్లో మార్మోగిన పేరిది. యోగీ ఆదిత్యనాథ్ మళ్లీ అధికారంలోకి రావడంలో బుల్డోజర్ కూడా కీలకపాత్రే పోషించిందని చెప్పవచ్చు. ఆక్రమణలు, అక్రమ కట్టడాలను బుల్డోజర్లతో తొలగించడం ద్వారా నేరగాళ్ల గుండెల్లో నిద్రపోయారు యోగీ. అదే సమయంలో ఆయన్ని అభిమానులు ముద్దుగా బుల్డోజర్ బాబా అనీ పిలుచుకోవడం మొదలైంది.

యూపీలో యోగీ హయాంలో ఈ బుల్డోజర్ చేస్తున్న పనులెన్నో. ఇక గతవారం కొందరు దుండగులు ట్రక్ నిండా 35 లక్షల ఇనుపరాడ్ ను దొంగిలించారు. ట్రక్కుతో పాటే ఓ గోడౌన్ లో దాచారు. దుకాణదారు ఫిర్యాదులో పోలీసులు రంగంలోకి దిగారు. ముందుగా ఒకతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తి ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు అక్కడికివెళ్లారు. అయితే గోడౌన్ కు లాక్ చేసి ఉండడంతో… ప్రహారీ గోడను బుల్డోజర్ సాయంతో ధ్వంసం చేశారు పోలీసులు. అందులో ఉన్న ఇనుపరాడ్ ను ట్రక్కు సహా స్వాధీనం చేసుకున్నారు. ఇక ప్రతాప్ గఢ్ పోలీసులు కూడా ఓ అత్యాచారం కేసులో నిందితుడినీ పట్టుకునేందుకు బుల్డోజర్ ను వాడారు. నిందితుడి ఇంటిముందు ఆ భారీ వాహనాన్ని నిలిపి అతను లొంగిపోకుంటే ఇంటిని ధ్వంసం చేస్తామని భయపెట్టారు. దీంతో విధిలేని స్థితిలో నిందితుడు పోలీసులకు సరెండర్ అయ్యాడు. ఇలా బుల్డోజర్ బాబా ఏలికలో ఆ భారీ వాహనం చేస్తున్న మంచిపనులు ఎన్నో ఎన్నెన్నో.

Thursday, March 24, 2022

సిటీ, జనులకు షాక్......బస్ పాస్ చార్జీలు భారీగా పెంపు!

,*సిటీ, జనులకు షాక్......బస్ పాస్ చార్జీలు భారీగా పెంపు!*

హైదరాబాద్‌: డీజిల్‌ ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో అన్నిరకాల బస్‌పాస్‌ చార్జీలను ఆర్టీసీ పెంచింది. కొత్త ధరలు ఏప్రిల్‌ ఒకటి నుంచి అమల్లోకి వస్తాయి.జనరల్‌ బస్‌ టికెట్‌ (జీబీటీ) పాసులు భారీగానే పెరిగాయి. ఈ కేటగిరీలో ఆర్డినరీ పాస్‌ చార్జీ రూ.950 నుంచి రూ.1150కి, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ రూ.1,070 నుంచి రూ.1,300కు, మెట్రో డీలక్స్‌ రూ.1,185 నుంచి రూ.1,450కి, మెట్రో లగ్జరీ రూ.2 వేల నుంచి రూ.2,400కు, పుష్పక్‌ పాస్‌ రూ.2,500 నుంచి రూ.3 వేలకు పెరిగింది.

ఎన్‌జీఓ బస్‌పాస్‌లకు సంబంధించి.. ఆర్డినరీ పాస్‌ చార్జీ రూ.320 నుంచి రూ.400కు, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ రూ.450 నుంచి రూ.550కి, మెట్రో డీలక్స్‌ రూ.575 నుంచి రూ.700కు, ఎంఎంటీఎస్‌-ఆర్టీసీ కోంబో టికెట్‌ చార్జీ రూ.1,090 నుంచి రూ.1,350కి పెరిగింది. ఇటీవలే సేఫ్టీ సెస్‌ పేరుతో టికెట్‌పై రూపాయి పెంచి, చిల్లర సమస్య రాకుండా ధరను రౌండాఫ్‌ చేయటంతో గరిష్టంగా టికెట్‌ ధర రూ.5 మేర పెరిగింది. గతం లో రౌండాఫ్‌ ధర కాస్త ఎక్కువగా ఉందన్న ఫిర్యాదుతో దాన్ని తగ్గించిన ఆర్టీసీ మళ్లీ పాత ధరలను పునరుద్ధరించాలని నిర్ణయించింది. తాజాగా బస్‌పాస్‌ చార్జీలను సవరించింది. అసలైన ఆర్టీసీ చార్జీల పెంపు ప్రతిపాదన ప్రస్తుతం సీఎం వద్ద పెండింగులో ఉంది. ఆయన అనుమతిస్తే అవి కూడా పెరగనున్నాయి.

link Media ప్రజల పక్షం🖋️ 

Wednesday, March 23, 2022

టెట్ వ్యాలిడిటీ ఇక జీవితకాలం......!

*టెట్ వ్యాలిడిటీ ఇక జీవితకాలం......!*

*హైదరాబాద్‌.....*
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. అలాగే టెట్‌ మార్గదర్శకాల్లో కొన్ని మార్పులు, చేర్పులకు కూడా ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది.ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న టీచర్‌ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే.. టీచర్‌ పోస్టుల భర్తీ కంటే ముందు టెట్‌ను నిర్వహించాల్సి ఉంది. రాష్ట్రంలో 2017 తర్వాత ఇప్పటివరకు టెట్‌ జరగలేదు. టెట్‌ పేపర్‌-1 పాసైన అభ్యర్థులు సుమారు 70 వేల మంది ఉన్నారు. అలాగే పేపర్‌-2లో అర్హత సాధించిన అభ్యర్థులు మరో లక్షమంది వరకు ఉన్నారు. టెట్‌ అర్హత లేని అభ్యర్థులు సుమారు 3లక్షల మంది వరకు ఉంటారు. వీరిలో 2017 తర్వాత వృత్తి విద్యా కోర్సులు పూర్తి చేసినవారు కూడా ఉన్నారు. అలాగే.. టెట్‌లో తాజాగా కొన్ని మార్పులు చేశారు. ఇంతకుముందున్న పద్ధతి ప్రకారం డిప్లొమా (డీఎడ్‌) చేసిన అభ్యర్థులు టెట్‌ పేపర్‌-1, బీఎడ్‌ చేసినవారు టెట్‌ పేపర్‌-2 పరీక్షలు రాయడానికి అర్హులు.

అయితే నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ (ఎన్‌సీటీఈ) రూపొందించిన కొత్త మార్గదర్శకాల ప్రకారం.. బీఎడ్‌ పూర్తిచేసిన అభ్యర్థులు పేపర్‌-1 పరీక్షలు రాయడానికి కూడా అర్హులవుతారు. అలాగే టెట్‌ వ్యాలిడిటీ ఇక నుంచి జీవితకాలం ఉంటుంది. ఒకసారి టెట్‌లో ఉత్తీర్ణత సాధిస్తే.. దాని ఆధారంగా ఎప్పుడైనా టీచర్‌ ఉద్యోగాలకు పోటీపడొచ్చు. ఈ నిర్ణయం 2011 ఫిబ్రవరి 11వ తేదీ నుంచి వర్తించనుంది. గతంలో టెట్‌ వ్యాలిడిటీ 7 సంవత్సరాలు ఉండేది. టెట్‌ రాయడానికి ఇంటర్మీడియట్‌, డిగ్రీ కోర్సుల్లో అభ్యర్థులు 50 శాతం మార్కులు సాధించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల అభ్యర్థులకు 45శాతం మార్కులు అవసరం. కాగా.. టెట్‌ను జూన్‌లో నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. మే నెల చివరి వారం లేదా జూన్‌ మొదటి వారంలో పరీక్ష జరిగే అవకాశం ఉంది. మే చివరివారం నుంచి జూన్‌ 1వ తేదీ వరకు టెన్త్‌ పరీక్షలున్నాయి. ఇవి పూర్తయిన వెంటనే టెట్‌ను నిర్వహించాలని భావిస్తున్నారు. మొత్తం టెట్‌ ప్రక్రియను 60 రోజుల్లో పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నారు.

link Media ప్రజల పక్షం🖋️