Saturday, May 7, 2022

రాహుల్ గాంధీ తో రవి ప్రకాష్ భేటీ

రాహుల్ గాంధీ తో రవి ప్రకాష్ భేటీ

Courtesy by : తొలివెలుగు మీడియా website

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ రెండు రోజుల తెలంగాణ పర్యటన లో భాగంగా వివిధ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ లో కొందరు ప్రముఖ జర్నలిస్టుల తో భేటీ అయ్యారు. ఈ భేటీలో భాగంగా మీడియా లెజెండ్, టీవీ9 మాజీ సీఈవో రవి ప్రకాష్ ను కలిశారు.

అరగంట పాటు సాగిన ఈ భేటీలో దేశ, రాష్ట్ర రాజకీయాల గురించి చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. త్వరలో రానున్న గుజరాత్ ఎన్నికలు, తెలంగాణలో ఉన్న పరిస్థితులు మీడియాపై కేసీఆర్ అణిచివేతతో పాటు పలు రాజకీయ అంశాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తుంది.

త్వరలో జరగబోయే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ముందస్తు ఎన్నికలపై ప్రధానంగా మాట్లాడుకున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆ రాష్ట్రాలలో ఎన్నికల వేడి మొదలైంది. అక్కడి రాజకీయ సామాజిక అంశాలపై వీరిద్దరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తుంది. గుజరాత్ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో రాహుల్, రవిప్రకాష్ మధ్య జరిగిన భేటీపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఇకపోతే ఇప్పటికే కాంగ్రెస్ దెబ్బకు విలవిలలాడుతున్న కేసీఆర్ కు.. రవి ప్రకాష్, రాహుల్ భేటీ నిద్ర లేకుండా చేస్తుందనడంలో సందేహం లేదని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

ప్రస్తుతం రాహుల్, రవి ప్రకాష్ ల భేటీకి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.


No comments:

Post a Comment