Thursday, May 5, 2022

జమ్మూ​, పాక్ మధ్య సొరంగం..!

జమ్మూ​, పాక్ మధ్య సొరంగం..!

Courtesy by : తొలివెలుగు మీడియా website

జమ్మూ కశ్మీర్‌లో పాకిస్థాన్ సరిహద్దు సమీపంలో నుంచి తవ్విన సొరంగ మార్గం వెలుగుచూసింది. దీంతో అమర్​నాథ్​ యాత్ర లక్ష్యంగా ఉగ్రవాదులు కుట్రలు పన్నుతున్నారని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అలాగే, జైషే మహ్మద్​ సూసైడ్​ బాంబర్లు.. ఈ సొరంగం గుండానే భారత్​లోకి చొరబడినట్లు భావిస్తున్నారు. దీన్ని గుర్తించటంతో భారత్‌లోకి చొరబాటు, ఉగ్రదాడి యత్నాలను భగ్నం చేసినట్లయిందని అధికారులు వెల్లడించారు.

జమ్ముకశ్మీర్‌ సాంబా ప్రాంతంలోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి.. భారీ సొరంగాన్ని సరిహద్దు భద్రతా దళం(బీఎస్​ఎఫ్​) గుర్తించింది. ఈ సొరంగం ఇటీవలె తవ్వినట్లు తెలుస్తుందని అధికారులు వెల్లడించారు. అలాగే, పాక్​ నుంచి సొరంగం దాదాపు 150 మీటర్ల పొడవు ఉంటుందని అంచనా వేస్తున్నారు.ఇటీవల దాడికి పాల్పడిన పాకిస్థాన్​ జైషే మహ్మద్ ఉగ్రముఠాకు చెందిన ఇద్దరు సూసైడ్​ బాంబర్లు.. దీనిగుండా భారత్​లోకి చొరబడినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. అమర్​నాథ్​ యాత్రకు అంతరాయం కలిగించేందుకు పాక్​ ముష్కరుల కుట్రలో భాగంగానే సొరంగం తవ్వారని భావిస్తున్నారు

ఏప్రిల్​ 22న సుంజ్వాన్​ ప్రాంతంలో ఇద్దరు సూసైడ్​ బాంబర్లు.. పుల్వామా తరహా దాడికి తెగబడ్డారు. సీఐఎస్​ఎఫ్​ బలగాలు ప్రయాణిస్తున్న బస్సు లక్ష్యంగా తుపాకులు, గ్రనేడ్లతో విరుచుకుపడగా.. ఓ ఏఎస్సై ప్రాణాలు కోల్పోయారు. అదే రోజు బలగాలు జరిపిన ఎన్​కౌంటర్​లో ఆ ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఇది జరిగిన 14 రోజులకు సొరంగాన్ని గుర్తించారు అధికారులు.


No comments:

Post a Comment