Saturday, May 7, 2022

కేసీఆర్ తో ఎన్నికల పొత్తు ఉండదు,పార్టీ సిద్దాంతలకు వ్యతిరేకంగా పని చేసేవాళ్లు…


హైదరాబాద్:వరంగల్ లో రైతు సంఘర్షణ సభలో పాల్గొని ప్రసంగించారు రాహుల్ గాంధీ.8 ఏళ్ల నుండి పాలిస్తున్న టీఆరెస్ పార్టీ అందరిని మోసం చేస్తూ,కుటుంబ పాలన చేస్తుందని అన్నారు.అప్పుల బాధతో రైతులు ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబలను ప్రభుత్వం ఎందుకు ఆదుకోవడం లేదని ప్రశ్నించారు.తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చడం కొరకు ఎన్నో ఆత్మ బలిదానాలు చేసుకున్న నేపథ్యంలో చలించిన సోనియా గాంధీ ప్రత్యేక తెలంగాణ ప్రకిటించింది .తెలంగాణ రాష్టం ప్రకటిస్తే రెండు రాష్ట్రల్లో కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసిన రాష్టాన్ని ప్రకటించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు. రాష్టంలో ఉన్న ముఖ్యమంత్రి ఒక రాజులాగా పాలిస్తు ప్రజల సమస్యలను గాలికి వదిలేశారని అన్నారు. ముఖ్యమంత్రి ప్రజల అవసరాలకనుగుణంగా పని చేయాలి కానీ రాజు లాగా పాలిస్తు సొంత నిర్ణయాలతో రాష్టాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని దుయ్యబట్టారు. ఛత్తీస్ ఘడ్ లో తమ ప్రభుత్వం హయాంలో 2500 రూపాయలు మద్దతు ధర చెల్లించి రైతులను అదుకుంటున్నామని తెలిపారు.ఇక్కడి ముఖ్యమంత్రి దళారులతో కుమ్మక్కై రైతులను నిలువునా దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ రైతులకు విజ్ఞప్తి చేస్తున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాలో అధికారంలోకి రాగానే ఏకకాలంలో2 లక్షల రూపాయల రుణ మాఫీ చేస్తామని తెలిపారు. తాము చెప్పే ప్రతి హామీని నెరవరుస్తాం,ఇచ్చిన తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిస్తాం.కాంగ్రేస్ పార్టీ ప్రవేశపెట్టిన వ్యవసాయ డిక్లరేషన్ ను కచ్చితంగా అమలు చేస్తామని తెలిపారు.తెలంగాణలో వేల కోట్ల రూపాయల అవినీతి ఎవరో చెప్పాలని వారికి ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని కోరారు.తెలంగాణ కలలను మోసం చేసిన కేసీఆర్ తో ఎలాంటి ఎన్నికల పొత్తు పెట్టుకోబోమని తెలిపారు.కాంగ్రేస్ పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పనిచేసే నాయకులు, కార్యకర్తలు ఎవ్వరైనా బీజేపీ, టీఆరెస్ పార్టీలకు పోవచ్చు అలాంటి వారు తమ పార్టీకి అవసరం లేదన్నారు. తెలంగాణ ప్రాంత యువకులను, కార్మికులను, ఉద్యోగస్తుల పేరుపై అవినీతి చేసినారో వారిని అస్సలు వదిలేది లేదని అన్నారు.ఎన్నికల సమయంలో పార్టీ టికెట్ కోసం ఆరాటం పడే వారికి టికెట్ ఇవ్వమని నిత్యం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలు తెలుసుకొని పరిష్కరం చేసే వారికే టికెట్ ఇస్తామని తెలిపారు. తెలంగాణ ప్రజలకు ఎప్పుడు ఆపద వచ్చిన తాను ముందుంటానని హామీ ఇచ్చారు.టీఆరెస్,బీజేపీ రెండు ఒకటేనని పార్లమెంట్లో రైతులకు వ్యతిరేకంగా మూడు నల్లచట్టలకు బీజేపీ ప్రవేశ పెడితే మద్దతు పలికిన పార్టీ టీఆరెస్ అని అన్నారు. తెలంగాణలో అధికారంలో బీజేపీ పార్టీ రాదని తెలిసే,ఢిల్లీలో ఉండి టీఆరెస్ పార్టీ ద్వారా పరిపాలన చేయాలని ప్రయత్నం చేస్తుందని అన్నారు.తెలంగాలో కాంగ్రేస్ అధికారంలోకి రాకుండా బీజేపీ పార్టీ టీఆరెస్ పార్టీని పావుగా వాడుకుంటుందని అన్నారు.తెలంగాణలో అవినీతి, అక్రమాలు జరుగుతున్న కేంద్ర ప్రభుత్వం ఎందుకు సిబిఐ, ఈడీలతో దాడులు చేపించడం లేదని నిలదీశారు.ఈ సభ ద్వారా రైతులకు కాంగ్రేస్ పార్టీ భరోసా ఇచ్చేందుకే ఏర్పాటు చేశామని తెలిపారు. ఆదివాసీలు, 10శాతం రిజర్వేషన్ కోసం పోరాడుతామన్నారు.తెలంగాణ ఏర్పడ్డాక టీఆరెస్ పార్టీకి రెండు సార్లు అవకాశం ఇచ్చారు ఒక్కసారి తెలంగాణ రాష్టం ఇచ్చిన పార్టీగా తమకు అవకాశం ఇవ్వండని విజ్ఞప్తి చేసారు.

No comments:

Post a Comment