కష్టపడితే తెలంగాణలో అధికారం బీజేపీదే.... టిఆర్ఎస్ విమర్శలు తిప్పికొట్టండి.... అమిత్ షా!*
హైదరాబాద్: నేతలంగా కష్టపడితే తెలంగాణలో అధికారం బీజేపీదేనని, రాబోయే ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరాలని బీజేపీ సీనియర్ నేత, కేంద్రమంత్రి అమిత్ షా ఆకాంక్షించారు.శనివారం హైదరాబాద్ పర్యటన సందర్భంగా.. శంషాబాద్ నోవాటెల్ హోటల్‌లో బీజేపీ కోర్ కమిటీ భేటీకి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా.. తెలంగాణలో పార్టీ పరిస్థితిని నేతలంతా అమిత్ షాకు వివరించగా, ప్రతిగా ఆయన నేతలకు రాజకీయ దిశానిర్దేశం చేశారు.
టీఆర్‌ఎస్‌తో పోటీ, బీజేపీకి అవకాశాలపై అమిత్ షాకు వివరణ ఇచ్చారు నేతలు. గత రెండేళ్లుగా పార్టీ అన్ని విషయాల్లో మెరుగుపడిందన్న బీజేపీ నేతలు.. పార్లమెంట్, దుబ్బాక, గ్రేటర్, హుజురాబాద్ ఎన్నికల ప్రస్తావన అమిత్ షా దగ్గర తీసుకొచ్చారు. ఆపై మీడియాలో వచ్చిన టీఆర్‌ఎస్ ప్రభుత్వ వ్యతిరేక కథనాలను ఆయనకు చూపించారు. ప్రాంతాల వారీగా పార్టీ పరిస్థితిని అమిత్‌షాకు వివరించిన నేతలు.. ఈ క్రమంలో నియోజకవర్గానికి ముగ్గురు ఆశావహుల పేర్లను సిద్ధం చేస్తున్నట్లు నేతలు అమిత్ షాకు వివరించారు.
ఈ సందర్భంగా.. ప్రజలు బీజేపీ వైపే ఉన్నారని, కష్టపడితే తెలంగాణలో అధికారం బీజేపీదేనిన నేతలతో అమిత్‌షా పేర్కొన్నట్లు తెలుస్తోంది. అందరూ కలిసి పని చేయాలని నేతలకు సూచించారాయన. తెలంగాణలో ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యంగా పనిచేయాలని కోరారు. టీఆర్‌ఎస్ విమర్శలను తిప్పికొట్టాలని, ముఖ్యంగా కేంద్రం ఏం చేయలేదన్న వాదనకు గట్టి కౌంటర్ ఇవ్వాలని తెలిపారు. నియోజకవర్గాల వారీగా అభ్యర్థులు గురించి తెలుసుకున్న అమిత్ షా.. తెలంగాణలో బీజేపీ పరిస్థితి చాలా బాగుందని కితాబిచ్చారు.
link Media ప్రజల పక్షం🖋️
No comments:
Post a Comment