Sunday, May 8, 2022

దాన్యపు రాశి వద్దే అసువులు బాసిన రైతుబిడ్డ....!కొనుగోలు కేంద్రంలో పిడుగుపాటు

*దాన్యపు రాశి వద్దే అసువులు బాసిన రైతుబిడ్డ....!*

*కొనుగోలు కేంద్రంలో పిడుగుపాటు*

*వేంసూరు...*
ఆటుపోట్లను ఎదుర్కొని ఆ రైతు యాసంగిలో వరి పంట సాగు చేశాడు.ఆ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తరలించాడు. వర్ష సూచనలు ఉండటంతో ధాన్యాన్ని కాపాడుకునేందుకు కుమారుడితో కలిసి అక్కడకు వెళ్లాడు. ఆ బిడ్డపైనే పిడుగుపడటంతో ధాన్యం రాశి వద్దే కుప్పకూలిపోయిన కొడుకును చూసి ఆ తండ్రి అల్లాడిపోయాడు. ఈ దుర్ఘటన ఖమ్మం జిల్లా వేంసూరులో ఆదివారం చోటుచేసుకుంది.

వేంసూరుకు చెందిన బూరుగు ఏసురత్నం, అనురాధ దంపతులకు ముగ్గురు సంతానం. వారిలో విద్యాసాగర్‌(22) పెద్దవాడు. పశువైద్యంలో డిప్లొమా చేసి అనుభవం కోసం స్థానిక పశువైద్యశాలలో శిక్షణ పొందుతున్నాడు. తండ్రి వ్యవసాయం చేస్తుంటే తనూ చేయూతగా నిలిచేవాడు.

4 రోజుల క్రితం వారు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తరలించారు. కాంటా వేయకపోవడంతో ధాన్యం అక్కడే ఆరబోసి ఉంచారు. ఆదివారం మధ్యాహ్నం వర్షం వచ్చేలా ఉండటంతో ధాన్యాన్ని కాపాడుకునేందుకు తండ్రీకుమారుడు హడావుడిగా కొనుగోలు కేంద్రం వద్దకు వెళ్లి రాశిగా చేశారు. పట్టాలు కప్పే ప్రయత్నంలో ఉండగా విద్యాసాగర్‌పై పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతిచెందాడు.

link Media ప్రజల పక్షం🖋️ 

No comments:

Post a Comment