Monday, May 16, 2022

అకాల వర్షంతో భారీగా పంట నష్టం..... కేటీఆర్.... ఆరా

*అకాల వర్షంతో భారీగా పంట నష్టం..... కేటీఆర్.... ఆరా*

హైదరాబాద్‌: ఉమ్మడి కరీంనగర్‌, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నిన్న రాత్రి, ఇవాళ ఉదయం వర్షం బీభత్సం సృష్టించింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ధాన్యం కొనుగోళ్లలో జాప్యం వల్లే తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈదురు గాలులతో కూడిన వర్షంతో జగిత్యాల జిల్లాలో అన్నదాతలు అతలాకుతలమయ్యారు.

మెట్‌పల్లి, కోరుట్ల, మల్లాపూర్‌, ఇబ్రహీంపట్నం మండలాల్లోని పలు గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో మొక్కజొన్న, సజ్జ, మామిడిపంటలు నేలరాలాయి. సారంగపూర్‌, బీర్పూర్‌, రాయికల్‌, జగిత్యాల మండలాల్లో ధాన్యం తడిసిపోయింది. తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి జరిగిన నష్టంపై రైతులతో మాట్లాడారు.

నిజామాబాద్, డిచ్‌పల్లి, ఆర్మూర్, ఎడపల్లి, భీంగల్, జక్రాన్ పల్లి, సిరికొండ, ఇందల్వాయి, ధర్పల్లి, బాల్కొండ, రుద్రూర్, నవీపేట్ మండలాల్లో వర్షం కురిసింది. కామారెడ్డి జిల్లాలో నిజాంసాగర్, పిట్లం, పెద్దకొడపగల్, లింగంపేట్, బీబీపేట్, గాంధారి, కామారెడ్డి మండలాల్లో కురిసిన వర్షానికి కోతకు సిద్ధంగా ఉన్న వరితో పాటు కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం నీటిలో మునిగింది.

*పంటనష్టంపై కేటీఆర్‌ ఆరా....*

సిరిసిల్ల జిల్లాలో వర్షాలతో నష్టపోయినపంట వివరాలపై కేటీఆర్‌ ఆరా తీశారు. వర్షానికి తడిసిన ధాన్యం వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. నష్టం వివరాలను కేటీఆర్‌కు కలెక్టర్‌ వివరించారు.

link Media ప్రజల పక్షం🖋️ 

No comments:

Post a Comment