*ప్రజాస్వామ్యబద్ధంగా అనుమతి కోరుతున్నాం.... రేవంత్ రెడ్డి.....!*
హైదరాబాద్: ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలపై చాలా కేసులు నమోదు చేసి జైలుకు పంపారని.. చంచల్‌గూడ జైల్లో ఉన్న వారిని కలిసేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఈనెల 7న అక్కడికి వెళ్తారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలిపారు.జైల్లో విద్యార్థులను రాహుల్ కలిసేందుకు జైలు సూపరింటెండెంట్ అనుమతి కోరామని చెప్పారు. జైళ్ల శాఖ డీజీని కలవాలని సూపరింటెండెంట్ తమకు సూచించినట్లు రేవంత్ చెప్పారు.
ఖైదీలను కలిసే హక్కు ఎవరికైనా ఉంటుందని.. ప్రజాప్రతినిధులుగా జైల్లో ఉన్న విద్యార్థులను కలిసేందుకు అనుమతివ్వాలని డీజీని కోరామన్నారు. ఆలోచించి నిర్ణయం చెబుతామని ఆయన తెలిపినట్లు వివరించారు. అధికారులపై తెరాస నేతలు ఒత్తిడి తెస్తున్నారని రేవంత్ ఆరోపించారు. అధికారం శాశ్వతం కాదని.. ఇది నిరంకుశ పాలన అని మండిపడ్డారు. ప్రజాస్వామ్యబద్ధంగా తాము అనుమతి కోరుతున్నట్లు చెప్పారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
link Media ప్రజల పక్షం🖋️
No comments:
Post a Comment