రైతు ఋణ మాపి ధరణి సమస్యల పై రాహుల్ గాంధీ గారు మాట్లాడాలి
.................................................
గతంలో కాంగ్రెస్ పార్టీ దళితులకు భూమి లేని వారికి తెలంగాణలో 24 లక్షల యెకరాల భూమి 15 లక్షల రైతులకు అసైన్డ్ చేసింది,
ఇప్పుడు జరగ బోవు వరంగల్ సభలో వారికి శాశ్వత హక్కులు అంటే అమ్ముకునే హక్కు తెలంగాణ లో అధికారం లోకి వస్తె కలిపిస్తామని వాగ్దానం చేయాలని తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీ నీ కోరుతుంది
ఇంటికి నాలుగు ఓట్లు ఉంటాయి అనుకున్నా 60 లక్షల ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వస్తాయి
అట్లాగే కౌలు రైతులు రాష్ట్రంలో 25 లక్షల మంది ఉంటారు వీరిని ఆదుకొనే యంత్రాంగం లేదు వీరిని గుర్తించి వారికి ఉచితంగా ఎరువులు విత్తనాలు ఇవ్వాలి
రైతులకు రుణ మాపి చేస్తాం అని కూడా ప్రకటన చేయాలి ప్రభుత్వం ఇచ్చే రైతు బంధు పైసలు వడ్డీ కింద బ్యాంక్ లు జమ చేసుకుంటున్నాయి ఋణ మాపీ చేయకుండా trs ప్రభుత్వం రైతులను మోసం చేసింది
ధరణి పోర్టల్ బాధిత రైతులు 10 లక్షల మంది ఉంటారు 20 నెలలుగా రైతులు ధరణి పోర్టల్ ద్వారా యెదురు కుంటున్న సమస్యలను పరిష్కరింఛు కోవడం కోసం అధికారుల చుట్టూ ప్రదీక్షణ చేస్తున్నారు ,అమర్నాథ్ యాత్రకు పోతే సులువుగా శివ దర్శనం అయితది కాని సమస్య పరిష్కరించే అధికారి దర్శనం తెలంగాణ లో రైతులకు దొరకడం లేదు
కౌలు రైతు మరణాలు ఎక్కువ ఉన్నాయి వీరి కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసింది యేమి లేదు
రైతు పండించిన పంటకు సరైన మద్దతు ధర లేక పోవడం తరుగు తీయడం తూకం లో మోసం చేయడం
రాజకీయ నాయకులు మిల్లర్ల తో కుమ్మక్కై అనేక రకాలుగా రైతును దోపిడీ చేస్తున్నారు దీనిని అరికట్టే సిస్టాన్ని ఏర్పాటు చేయాలి
అకాల వర్షాలు కురిసినప్పుడు రైతు తీవ్రంగా నష్ట పోతున్నాడు
కనీసం రైతుల వద్దకు ఎమ్మెల్యే లు వెళ్లి వారినీ కనీసం పలకరించడం లేదు నాయకులు అధికారులు అందరు ప్రగతి భవన్ చుట్టూ ప్రదీక్షన చేస్తున్నారు కాని
రైతుల కష్టాలు తెలుసుకునే వారు లేరు ఈ పద్ధతి మారాలి
..నారగొని ప్రవీణ్ కుమార్ ప్రెసిడెంట్ తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్
No comments:
Post a Comment