Monday, May 23, 2022

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ.... తహసిల్దార్!

*లంచం తీసుకుంటూ పట్టుబడ్డ.... తహసిల్దార్!*

పెద్దపల్లి : భూమి సర్వే కోసం ఓ వ్యక్తి నుంచి లక్ష రూపాయాలు లంచం తీసుకుంటూ జిల్లాలోని అంతర్గాం తహసీల్దార్‌ సంపత్, ఆర్‌ఐ అజీం, ప్రైవేట్‌ ఉద్యోగి లింగస్వామి రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీకి పట్టుబడినట్లు ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తెలిపారు.అంతర్గాం మండలంలోని అకినపల్లి గ్రామానికి చెందిన రైతు పెద్దంపేట్ శంకర్ తన భూమి సర్వే కోసం దరఖాస్తు చేసుకున్నాడు.

కాగా, భూమి సర్వే చేయాలంటే మూడు లక్షల వరకు అవుతుందని ఆర్‌ఐ అజీమ్ శంకర్‌కు చెప్పగా.. లక్ష రూపాయలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అనంతరం బాధితుడు ఏసీబీ అధికారులను సంప్రదించి వారి సూచనల మేరకు లక్ష రూపాయలను మధ్యవర్తికి ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌ గా పట్టుకున్నారు. తాసిల్దార్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని డీఎస్పీ తెలిపారు.

link Media ప్రజల పక్షం🖋️ 

No comments:

Post a Comment