*పాలనలో కేంద్ర సర్కార్ విఫలం..... MLC కవిత.....!*
*మోదీకి 8 ప్రశ్నలు సంధించిన ఎమ్మెల్సీ కవిత*
*హైదరాబాద్,....!*
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పాలనలో విఫలం అయిందని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు.ఈ మేరకు బీజేపీ పాలనా వైఫల్యాలపై సోమవారం ప్రధాని మోదీకి ట్విటర్ వేదికగా 8 ప్రశ్నలు సంధించారు. వీటికి సమాధానం ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. ''తెలంగాణపై కేంద్ర ప్రభుత్వ పక్షపాతానికి ముగింపు ఎప్పుడు? రాష్ట్రానికి రావాల్సిన రూ.7000 కోట్ల పెండింగ్ నిధులను కేంద్రం ఎప్పుడు విడుదల చేస్తుంది?
''మెహంగై ముక్త్ భారత్'' అని ప్రకటించుకున్న మీరు అసలు అలాంటి ''అచ్ఛే దిన్'' ఎప్పుడు తెస్తారు? విఫలమైన లా అండ్ ఆర్డర్, విఫలమైన వ్యవస్థలు.. భారతదేశ ప్రజలకు కృత్రిమ ప్రచారాలు లేని నిజమైన ''అమృత్ కాల్'' ఎప్పుడు వస్తుంది? దేశ జీడీపీ పడిపోతున్నా..
గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి. విచిత్రంగా అవి దేశ ప్రభుత్వ నియంత్రణలో ఎందుకు లేవు? పీఎం కేర్స్ నిధుల గురించిన నిజమైన సమాచారాన్ని దేశ ప్రజలకు తెలియజేసే రోజు వస్తుందా? మహిళా సాధికారత, వారి శక్తికి సమాన ప్రాధాన్యం కల్పించేందుకు ఉద్దేశించిన మహిళా రిజర్వేషన్ బిల్లును ఎప్పుడు అమలులోకి తెస్తారు? తెలంగాణలోని వరి, పసుపు రైతులు తమ కష్టానికి కనీస గుర్తింపు కోరినందుకు బీజేపీ చేతిలో నష్టపోతున్నారు. వారికి ఎప్పుడు న్యాయం జరుగుతుంది?'' అంటూ కవిత ప్రశ్నలు సంధించారు.
link Media ప్రజల పక్షం🖋️
No comments:
Post a Comment