Tuesday, May 10, 2022

సుప్రసిద్ధ సంతూర్ విద్వాంసుడు శివకుమార్ శర్మ కన్నుమూత – ప్రముఖుల నివాళి

సుప్రసిద్ధ సంతూర్ విద్వాంసుడు శివకుమార్ శర్మ కన్నుమూత – ప్రముఖుల నివాళి

సుప్రసిద్ధ సంతూర్ విద్వాంసుడు పండిట్ శివకుమార్ శర్మ ముంబైలో కన్నుమూశారు. కిడ్నీ సంబంధ వ్యాధితో బాధపడుతున్నకు డయాలసిస్ జరుగుతోంది. అయితే ఉదయం అకస్మాత్తుగా తీవ్రమైన గుండెపోటు వచ్చి తుదిశ్వాస విడిచారు. 84 ఏళ్ల శివకుమార్ వచ్చేవారం భోపాల్లో సంగీత ప్రదర్శనలో పాల్గొనాల్సి ఉంది. ఈ లోగానే ఆయన మృతిచెందడం అభిమానులను కలిచివేస్తోంది. శివకుమార్ శర్మ కశ్మీర్ పండిట్. జమ్మూ-కశ్మీరులోని జానపద వాద్య పరికరం సంతూర్‌ను ఉపయోగించి భారతీయ సంప్రదాయ సంగీతాన్ని వినిపించిన మొట్టమొదటి సంగీతకారుడు ఆయనే.పండిట్ శివ కుమార్ శర్మ సుప్రసిద్ధ వేణు నాద సంగీతకారుడు పండిట్ హరి ప్రసాద్ చౌరాసియాతో కలిసి ‘సిల్సిలా’, ‘లమ్హే’ , ‘చాందిని’ వంటి సినిమాలకు సంగీతాన్ని సమకూర్చారు. పండిట్ శివ కుమార్ తనయుడు రాహుల్ శర్మ కూడా సంతూర్ వాద్యకారుడే. సంగీతరంగంలో ఆయన చేసిన సేవలకు గానూ భారత ప్రభుత్వం అత్యున్నత పద్మవిభూషణ్ తో సత్కరించింది. శర్మ మృతిపట్ల ప్రముఖులు తమ శ్రద్ధాంజలి ఘటించారు. ప్రముఖ సరోద్ కళాకారుడు అంజాద్ అలీ ఖాన్ ట్విటర్ వేదికగా నివాళులు అర్పించారు. ఇంకా పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఆయన మృతిపట్ల సంతాపం తెలిపారు.

No comments:

Post a Comment